నేటి నుంచి కళావేదిక కళకళ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కళావేదిక కళకళ

Jan 30 2026 6:40 AM | Updated on Jan 30 2026 6:40 AM

నేటి

నేటి నుంచి కళావేదిక కళకళ

మళ్లీ ప్రారంభం కానున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని కళావేదిక నేటి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలతో కళకళలాడనుంది. దుర్గమ్మ సన్నిధిలోని కళావేదికపై గత కొన్ని నెలలుగా సాంస్కృతిక ప్రదర్శనలను నిలిపివేయడంతో కళ తప్పింది. దీనిపై సాక్షి ఈ నెల 18వ తేదీన ‘‘ఏవి తల్లీ... నాడు వెలిగిన కళాకాంతులు’’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన దుర్గగుడి అధికారులు ఇకపై ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో కళాకారుల నృత్య ప్రదర్శనకు అనుమతులిచ్చారు. శుక్రవారం భరత నాట్య ప్రదర్శన, శని, ఆదివారాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో గత కొన్ని నెలలుగా వెలవెలబోయిన కళావేదిక శుక్రవారం నుంచి కళాకారుల సంగీత స్వర ధ్వనిలో మారుమోగనుంది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు.

ఎముకలు, కండరాల వ్యాధుల స్క్రీనింగ్‌పై శిక్షణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నపిల్లల్లో ఎముకలు, కండరాల వ్యాధులు(మస్క్యూలో స్కేలేటల్‌) స్క్రీనింగ్‌పై ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో 14 జిల్లాల్లోని బాలల సత్వర చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, ఫిజియోథె థెరపిస్టులు, పిల్లల మనస్తత్వ నిపుణులు, డీఇఐసీ మేనేజర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్లో మస్క్యూలో స్కేలేటల్‌ సమస్యలను ప్రారంభదశలో గుర్తించేందుకు నిర్వహించే స్క్రీనింగ్‌పై నిపుణులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఆర్‌బీఎస్‌కే నోడల్‌ అధికారి డాక్టర్‌ డి.ప్రశాంత్‌ మాట్లాడుతూ ఎముకలు, కండరాల సమస్యలను ప్రారంభదశలో గుర్తిస్తే జీవితాంతం ప్రభావం చూపే వికలాంగత్వాన్ని నివారించవచ్చునన్నారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలపై ముందస్తు స్క్రీనింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శిక్షణలో తిరుపతికి చెందిన డాక్టర్‌ మాధురి స్క్రీనింగ్‌ ప్రొటోకాల్‌, ఆధునిక క్లినికల్‌ విధానాలు, కేస్‌ బేస్డ్‌ డిస్కషన్స్‌, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అందించారు. కార్యక్రమాన్ని ఆర్‌బీఎస్‌కే జిల్లా డాక్టర్‌ జి.మాధవి పర్యవేక్షించారు.

అరుణ్‌ రాజ్‌కుమార్‌కు విశిష్ట రైల్‌ సేవ పురస్కారం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విధుల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను విజయవాడ రైల్వే డివిజన్‌ ఉద్యోగి పూసపాటి అరుణ్‌ రాజ్‌కుమార్‌ను గురువారం సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ విశిష్ట రైల్‌ సేవా పురస్కారంతో సత్కరించారు. అరుణ్‌రాజ్‌ కుమార్‌ జూనియర్‌ ఇంజినీర్‌గా ఈ–ఆఫీస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనపర్చారు. డిజిటలైజేషన్‌ విభాగంలో అంతరాయం లేని డిజిటల్‌ సేవలు, రైల్‌టెల్‌తో చక్కని సమన్వయాన్ని సాధించి అధికారులు, సిబ్బంది పని పక్రియను సులభతరం చేయడంలో ఎంతో కృషిచేశారు. ఆయన ప్రభావవంతమైన కృషి డివిజన్‌ పరిపాలన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చింది. ఆయన కృషికి గాను దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ సంఘ్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు అల్లం రమేష్‌, బ్రాంచ్‌ కార్యదర్శి కర్నూల్‌ సుకుమార్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

నేటి నుంచి కళావేదిక కళకళ  1
1/1

నేటి నుంచి కళావేదిక కళకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement