ఉద్యోగులే రైల్వే డివిజన్‌కు నిజమైన బలం
రెల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగులే రైల్వే డివిజన్‌కు నిజమైన బలమని అతిథులు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే 70వ వారోత్సవాలను సికింద్రాబాద్‌లోని రైల్ కలారంగ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పలు డివిజన్లకు సమర్థతా షీల్డ్‌లు, పలు విభాగాల అధి కారులు, సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఏజీఎం సత్యప్రకాష్, డీజీఎం ఉదయనాథ్ కోట్లా, పలు విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ 2024లో విధుల్లో అందించిన అత్యుత్తమ సేవలకు విశిష్ట రైల్ సేవా అవార్డులను అందుకోవడం డివిజన్‌కే గర్వకారణమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి డివిజన్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. విజయవాడ డివిజన్ నుంచి అవార్డులు అందుకున్న డీఈఈ దీపేంద్ర మార్వార్, డెప్యూటీ సీఈ కె.తులసిరామ్, ఏఈఎన్ బి.వి.ఎస్.ఎన్ మూర్తి, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రదీప్‌చంద్ర, సీనియర్ టెక్నిషియన్ వి.కృష్ణనాయక్, ఎస్‌ఎస్‌ఈలు ఖాదర్‌వలి, వై.శ్రీనివాసరావు, టెక్నిషియన్ గ్రేడ్–2 శ్రీధర్ శ్రీరామ్, జేఈ పూసపాటి అరుణ్ రాజ్‌కుమార్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే రహమతుల్లా, చీఫ్ కంట్రోలర్ నల్లబోతు కృష్ణసాయి, సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎస్.రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఈ వి.శ్రీకాంత్‌లను డీఆర్‌ఎం ప్రత్యేకంగా అభినందించారు.


