అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు

Jan 31 2026 6:34 AM | Updated on Jan 31 2026 6:34 AM

అనిగం

అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు

అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు స్కానింగ్‌ సెంటర్లలో క్రమం తప్పకుండా తనిఖీలు పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఓవరాల్‌ చాంప్స్‌ కృష్ణా, విశాఖ

అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఐర్లాండ్‌కు చెందిన బల్లీమలో కుకరీ స్కూల్‌ వ్యవస్థాపకులు టిమ్‌, డారినా ప్రత్యేకంగా పర్యటించారు. గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ కమ్యూనిటీ మేనేజ్‌డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వి.వీరభద్రరావు, గోవర్ధన్‌, పి.ఉమాహేశ్వరరావుకు చెందిన మిర్చి, యాపిల్‌ బేర్‌, వరి పొలాలను పరిశీ లించి మట్టి ఆరోగ్యం, నీటి వినియోగం, దిగుబడులపై రైతులతో చర్చింఆరు. అనంతరం టిమ్‌, డారినా మాట్లాడుతూ రసాయనాలు వినియోగించుకుండా అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయంతో మట్టి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఖర్చులు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వై.శంకర్‌నాయక్‌, జిల్లా అధికారి వాణిశ్రీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: ప్రతి స్కానింగ్‌ సెంటర్‌పై నిర్దిష్టమైన చెక్‌లిస్ట్‌ ఆధారంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యాన లింగ నిర్ధారణ నిరోధక చట్టం జిల్లా సలహా కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు. జిల్లాలోని 99 స్కానింగ్‌ సెంటర్లను పర్యవేక్షణలో ఉంచడానికి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ఎప్పటి కప్పుడు తనిఖీలు, మార్గదర్శకాలు అందజేస్తున్నామని తెలిపారు. లింగ నిర్ధారణ నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెండు సెంటర్లకు రెన్యువల్‌ సర్టిఫికెట్లు, మూడు స్కానింగ్‌ సెంటర్లకు మార్పులు (మోడిఫికేషన్‌) సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ ప్రేమ చంద్‌, లింగ నిర్ధారణ నిరోధక చట్టం జిల్లా సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి సిటీ: ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా మూడు రోజుల నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ముగిసింది. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మారావు హాజరై విజేతలకు బహుమతులు, ధ్రువీకణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృకథంతో ఉండాలన్నారు. బాలుర విభాగంలో విశాఖపట్నం రీజియన్‌ విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను గెలుచుకొన్నారు. బాలికల విభాగంలో ఓవరాల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ చాంపియన్‌ షిప్‌ను కృష్ణా జిల్లా విద్యా ర్థినులు కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామకృష్ణారావు, ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, డాక్టర్‌ ద్వారకనాథ్‌రెడ్డి, ఎస్వీ కుమార్‌, ఎస్‌.శ్రీనివాసులు, ఎస్వీయూ పీడీ డాక్టర్‌ ఎం శివశంకర్‌రెడ్డి, హరిప్రసాద్‌, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, 100 మంది పీడీలు పాల్గొన్నారు.

అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు 1
1/1

అనిగండ్లపాడులో ఐర్లాండ్‌ ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement