జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతు సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జంతు సంరక్షణ పక్షోత్సవాలను పుస్కరించుకుని పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జంతు సంరక్షణ అంశంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జంతు సంరక్షణపై పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ వక్తృత్వ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో విజేతలను అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకోవాలని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పోటీల్లో జిల్లా స్థాయిలో బహుమతులు పొందిన నందిగామ పాఠశాల విద్యార్థి ఎస్.కె సాహెబ్, చందర్లపాడు పాఠశాల విద్యార్థి ఎం. శ్రీలేఖ, విజయవాడ సీవీఆర్ హైస్కూల్ విద్యార్థులు షర్మిల, ఎస్.శ్రీవల్లి, ఎం.రాజవెంకట్, వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు పాఠశాల విద్యార్థులు ఎస్. సాయి ఉత్తజ్, పి. రోహిత్ కుమార్, పి. సాయి జస్పత్‌లకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి ఎం.హనుమంతరావు, ఉప సంచాలకులు డా. చంద్రశేఖరరావు, మోజస్ వెస్లీ, ఎం వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు డాక్టర్ సునంద తదితరులు హాజరయ్యారు.


