ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జగదీష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ జగదీష్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఆయుర్వేద వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.ల్లయ్య, డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల జ్యోతి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జగదీష్ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. సూపరింటెండెంట్‌ను పలువురు వైద్యాధికారులు, అసోసియేషన్ సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ)ను బలోపేతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు తాము నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సంఘాలు విలువ ఆధారిత ఉత్పత్తులు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు, వివిధ వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. సంఘంలోని సభ్యులు తమకున్న విస్తీర్ణంలో కొంత భాగం తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు సైతం ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మామిడిలో నాణ్యత పెరగడానికి కాయ చిన్న దశలోనే కవర్లు కట్టి పండిస్తున్న ఎఫ్‌పీఓను కలెక్టర్ అభినందించారు. ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న ఎఫ్‌పీఓలను అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి, డీఏఓ, డీసీఓ, పీడీ ఆత్మ, డీఆర్‌డీఏ పీడీ, జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేరస్తులపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని పోలీస్ కమిషన్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. నేరస్తులకు విజయవాడ సురక్షితం కాదనే సందేశాని ఇస్తున్నామన్నారు. భవానీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయం సెంటర్‌లో శని వారం డ్రగ్స్‌పై దండయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మరిపాలెం నుంచి నాలుగు స్తంభాల సెంటర్, చెరువు సెంటర్ మీదుగా జీఎన్నార్ స్కూల్, సితార జంక్షన్, కాబేళా, ఊర్మిళా నగర్, చర్చ్ సెంటర్ మీదుగా శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఇక్కడ సభ అనంతరం స్వాతి మీదుగా గొల్లపూడి పంచాయతీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్‌లో జరిగిన సభలో సీపీ రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ ఎన్.వి.దుర్గారావు, ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జగదీష్
ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జగదీష్


