టమాట వినాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

టమాట వినాల్సిందే!

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

టమాట

టమాట వినాల్సిందే!

చల్లపల్లి: అతి తక్కువే ధరకే టమాటా దొరుకుతున్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటిని తీసుకోవాలని అధికారులు హుకుం జారీ చేయడంతో రైతుబజార్‌లో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురువారం చల్లపల్లి రైతు బజారులో చోటుచేసుకుంది. చల్లపల్లిలోని రైతుబజార్‌ వ్యాపారుల్లో ఎక్కువ మంది మోపిదేవి మండలానికి చెందిన రైతులే. ఆ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొని, మరికొందరు సొంత పొలంలో పండించుకున్న కూరగాయలు ఇక్కడ విక్రయిస్తుంటారు. మోపిదేవి మండలంలో 500 ఎకరాలకు పైగా టమాటా సాగు అవుతోంది. సగటున 29 కిలోలు ఉన్న టమాటా బాక్సు ధర రూ.160 పలుకుతోంది. అంటే కేజి ఆరు రూపాయలు పడుతోంది. మార్కెట్లో బోర్డు రేటు ప్రకారం టమాటా కిలో ధర రూ.17 ఉంది. కిలోకు రైతు బజారు వ్యాపారులకు రూ.11 వరకూ లాభం పొందుతున్నారు.

పాడైన టమాటా తీసుకోవాలంటూ ఒత్తిడి

అయితే గురువారం ఒక్కొక్కటి 15కిలోల బరువున్న టమాటా బాక్సులు 40 వరకూ చల్లపల్లి మార్కెట్‌కు వచ్చాయి. వీటిలో చాలా వరకు పాడైపోగా కొన్ని కుళ్లిపోయాయి. ఈ 15 కిలోల బాక్సులను ఒక్కొక్కటీ రూ.200 చొప్పున తీసుకోవాలని మార్కెట్లోని టమాటా వ్యాపారులకు అధికారులు హుకుం జారీ చేశారు. వాటి ధర కిలోకు రూ.14 వరకూ పడుతోంది. రైతు బజారులో మొత్తం 10 వరకూ టమాటా దుకాణాలు ఉన్నాయి. నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు తిరస్కరించారు. అధికారులు ఒత్తిడి చేయడంతో అసహనం వ్యక్తం చేశారు.

ఆ రైతుబజార్లకు కూడా..

జిల్లాలో ఏడు రైతు బజారులు ఉండగా చల్లపల్లి రైతుబజారుతో పాటు మచిలీపట్నం, పెడన, పామర్రు, గుడివాడ, గన్నవరం రైతు బజారులకు కూడా ఈ నాసిరకం టమాటాను అధికారులు పంపినట్లు సమాచారం. దీనిపై చల్లపల్లి రైతు బజారు కార్యదర్శి చంద్రమోహన్‌ను వివరణ కోరగా పైనుంచి వద్దన్నా టమాటాలు పంపించారని ఇకనుంచి తీసుకోబోమని చెప్పారు. మోపిదేవి ప్రాంతాల్లోని టమాటా దిగుబడులను అన్ని మార్కెట్లకు పంపిచే ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ ఇక్కడి వాటిని కాదని దూర ప్రాంతాల నుంచి టమాటాలు తీసుకరావడంపై ఎందుకు స్పందించడం లేదని రైతులు అంటున్నారు.

తీసుకోవాల్సిందే అని చల్లపల్లి రైతుబజార్‌లో అధికారుల హుకుం!

మా పొలంలో టమాటాలే ఉన్నాయి ఎలా కొనాలి

మాకు సొంత పొలాలు ఉన్నాయి. అందులో టమాటానే పండిస్తున్నాం. ఇక్కడ చాలా తక్కువ రేటుకే మంచి టమాటాలు వస్తున్నాయి. బయట నుంచి తెచ్చి తీసుకోమంటే ఎలా తీసుకోవాలి. రేటు కూడా గిట్టుబాటు కాదు. నాణ్యత కూడా లేదు.

–ఉప్పల బుల్లెమ్మ, దుకాణదారు, రైతుబజార్‌, చల్లపల్లి

టమాట వినాల్సిందే!1
1/1

టమాట వినాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement