సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడిచేసిన విషయం విదితమే. దాడి చేయడంతోపాటు పెట్రోలు బాంబులు విసిరి ఇంటికి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరతారు. కనకదుర్గ వారధి, ఎం. హోటల్, సత్యంగారి హోటల్ సెంటర్, ఆర్టీసీ బస్‌స్టాండు, రాజీవ్ గాంధీపార్క్, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిసెంటర్, దర్గాసెంటర్, గొల్లపూడి వై–జంక్షన్, వన్‌సెంటర్, గుంటుపల్లి, తుమ్మల పాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం తాడేపలిలోన్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘరాం పరిశీలించారు. జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించారు.
నేడు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన


