మిషన్ వాత్సల్యతో చిన్నారుల భవిష్యత్‌కు బాట
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య కింద జిల్లాలో 551 మందికి ఆర్థిక సహాయం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. మిషన్ వాత్సల్య చిన్నారుల భవిష్యత్‌కు బాట వేస్తుందన్నారు. మిషన్ వాత్సల్య జిల్లా స్పాన్సర్షివ్ అండ్ పోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో మిషన్ వాత్సల్య లక్ష్యాలు, పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ పిల్లలు, కోవిడ్ ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు ఆటంకం కలుగకుండా మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ప్రొటెక్షన్ ఆఫీసర్ జాన్సన్, డీసీపీయూ క్రాఫ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబి, మేనేజర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ టౌన్: స్థానిక కేబీఆర్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. నరేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల ఈ కోర్సు ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కోర్సులో చేరడానికి విద్యార్థులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు చదివి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 98488 19682, 96666 54641లో సంప్రదించాలని పేర్కొన్నారు.


