ఉయ్యూరు: అశేష భక్తజన తిరుగుడు గండ దీప హారతుల నడుమ ఉయ్యూరు వీరమ్మతల్లి ఊయల ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.
మెట్టినింటి నుంచి గ్రామోత్సవంగా బయలుదేరిన అమ్మవారు గురువారం పట్టణంలో ఊరేగారు.శ్రీ కనక చింతయ్య సమేతంగా వీరమ్మతల్లి పల్లకీలో ముందుకు సాగగా.. దారిపొడవునా భక్తులు హారతులు ఇచ్చి పసుపు నీరు ఓరబోసి పసుపు కుంకుమ సమర్పించారు.
కాటూరు రోడ్డు, సాయి మహల్ సెంటర్, కౌండిన్య ప్రాంగణం, కాపుల రామాలయం సెంటరు, కొబ్బరి తోట, సుందరమ్మపేట, శివాలయం రోడ్డులో అమ్మవారి పల్లకికీ పూలతో స్వాగతం పలికారు.
యువత బాణసంచా కాలుస్తూ విద్యుత్ కాంతులతో బ్రహ్మరథం పట్టారు. వైభవంగా గ్రామోత్సవం పూర్తి చేసుకున్న అమ్మవారు ఊయలస్తంభాల వద్దకు చేరుకోగా.. అక్కడ ఊయల ఉత్సవం జరిపించారు.


