బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన (Wings India 2026) ఆకట్టుకుంటోంది. రెండో రోజు గురువారం సూర్యకిరణ్, మార్క్ జాఫ్రీస్ వైమానిక విన్యాసాలు సందర్శకులను అబ్బురపరిచాయి.
నిప్పులు చిమ్ముతూ.. ఆకాశంలోకి దూసుకెళ్లి.. అమాంతం కింద పడుతుందేమో అన్నట్లు పైలట్లు చేసిన ఫీట్లు ముచ్చటగొలిపాయి. కాగా.. శుక్ర, శనివారాల్లో సాధారణ ప్రజలు విమాన ప్రదర్శనలను తిలకించవచ్చు. ప్రవేశ రుసుము రూ.1,022గా నిర్ణయించారు.


