breaking news
Wings India
-
సందడిగా వింగ్స్ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)
-
వింగ్స్ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం
రష్యాకి చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ శుభకర్ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.ఈ విమానాలను పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్ వివరించారు.ఇండో–పసిఫిక్ ఏవియేషన్‌కి అవార్డుజెట్సెట్గో అనుబంధ సంస్థ ఇండోపసిఫిక్ ఏవియేషన్‌కి ‘బెస్ట్ ఎన్‌ఎస్‌వోపీ–ఫిక్సిడ్ వింగ్స్’ పురస్కారం దక్కింది. నాన్–షెడ్యూల్డ్ ఏవియేషన్ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరుకు గాను సంస్థ ఈ అవార్డును దక్కించుకుంది. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా జెట్‌సెట్‌గో ఫౌండర్ కనికా టేక్రివాల్కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పురస్కారాన్ని అందజేశారు. రెండోసారి ఈ అవార్డును దక్కించుకోవడమనేది కచ్చితత్వానికి, భద్రతకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని కనిక తెలిపారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే -
బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)
-
ఇన్నోవేషన్స్.. కేరాఫ్ వింగ్స్ ఇండియా
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2026 విమానయాన ప్రదర్శనలో విమానాల సాంకేతికతతోపాటు డ్రోన్లలో వచ్చిన ఆధునిక మార్పులు వావ్ అనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టీరోటర్ మావీయోమ్ ఎక్స్4 డ్రోన్ ద్వారా గూగుల్ ఎర్త్‌కు సంబంధించి యూఏవీ ఫొటోలను ఎలా సేకరించవచ్చో, అగ్రికల్చర్ రీసెర్చ్ ఫారెస్ట్ ట్రాకింగ్, సర్వైలెన్స్, డిటెక్షన్, పొల్యూషన్ డిటెక్షన్, మ్యాపింగ్, మైనింగ్ ప్రాంతాల గుర్తింపు, 3డీ ల్యాండ్ మోడలింగ్ ఇలా డ్రోన్లను ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలిపే వినూతన స్టాల్స్ వెలిశాయి. ఈ ప్రదర్శనలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన తిహన్ ఇన్నోవేషన్ హబ్ అభివృద్ధి చేసిన అత్యాధునిక డ్రోన్ సాంకేతికత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రోన్ ప్రధానంగా అటానమస్ నావిగేషన్ సాంకేతికతపై పనిచేస్తుందని తిహన్ సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న షేక్ జానీ బాషా తెలిపారు. భూమిపై నడిచే వాహనాలు, గగనతలంలో ప్రయాణించే డ్రోన్లకు స్వయంచాలక మార్గనిర్దేశం చేయడమే దీని ప్రత్యేకత. ఈ డ్రోన్‌ను ముఖ్యంగా సైనిక అవసరాల కోసం ఆయుధాలు లేదా సరుకులు రవాణా చేయడానికి రూపొందించినప్పటికీ, అవసరాన్ని బట్టి వాణిజ్య అవసరాలకూ వినియోగించవచ్చన్నారు. ఈ డ్రోన్ గరిష్టంగా 150 కిలోల బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. 19 సీట్ల సామర్థ్యం కలిగిన హిందూస్తాన్ 228 విమానం అచ్చంగా దేశీయ తయారీ విమానం. దీనికి సంబంధించిన ప్రతి ముడి ఉత్పత్తిని భారత్‌లోనే రూపొందించారు. విమానయాన రంగంంలో సగర్వంగా భారత కీర్తిని చాటిచెప్పే ఈ విమానం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు ఉత్సుకత కనబరిచారు. దీని టేకాఫ్ వెయిట్ 6,200 కిలోలు, ఫ్యూయల్ కెపాసిటీ 2,250 కిలోలు. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్ బృందంలో సభ్యురాలిగా ఉన్న మహిళా పైలట్ కన్వల్ సంధు, మరోపైలట్ సంజయ్‌లు వైమానిక విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. విమానయాన రంగంలో మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువతులు ధైర్యంగా ముందడుగు వేయాలని కన్వల్ సంధు ‘సాక్షి’కి తెలిపారు. వింగ్స్ ఇండియా–2026లో శుక్ర, శనివారాల్లో సాధారణ ప్రజానీకానికి అనుమతి కల్పించారు. బుక్ మై షోలో గానీ, విమానాశ్రయంలో ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద గానీ రూ.వెయ్యి చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
బేగంపేట్ : అట్టహాసంగా వింగ్స్ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)
-
త్వరలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విస్క్ సంస్థ స్వయంచాలకంగా పనిచేసే తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అభివృద్ధి దశలో కీలక ముందడుగు వేసింది. పైలట్ అవసరం లేకుండా ప్రయాణించగల ఈ విమానం పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఎయిర్ ట్యాక్సీ పూర్తిగా అటానమస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వింగ్స్ ఇండియా–2026లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 15 నిమిషాల టర్న్ అరౌండ్ టైమ్.. విమానంపై అమర్చిన ఆధునిక సెన్సర్లు గాల్లోని ఇతర విమానాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పైలట్ ఉన్నట్లే పరిసరాలను ‘ఎలక్ట్రానిక్ విజన్’ ద్వారా చూసే ఈ సిస్టమ్ ల్యాండింగ్ సమయంలో నేలను సైతం గుర్తించి భద్రంగా దిగేలా చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా మానవ జోక్యం లేకుండానే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. ఈ స్వయంచాలక టెక్నాలజీ వల్ల ఒకే గగనతలంలో ఎక్కువ విమానాలు ఒకేసారి ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాంతో అధిక సంఖ్యలో విమానాలు నిర్వహించవచ్చు. ప్రతి ప్రయాణం అనంతరం కేవలం 15 నిమిషాల టర్న్ అరౌండ్ టైమ్‌తో మళ్లీ సేవలకు సిద్ధం చేయాలన్నది సంస్థ లక్ష్యం. పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తితో పనిచేసే ఈ ఎయిర్ ట్యాక్సీ కోసం వేగవంతమైన చార్జింగ్ టెక్నాలజీని కూడా ‘విస్్క’ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా నగరాల మధ్య రోడ్డు ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వైద్య సరఫరాలు వంటి అత్యవసర సేవలను వేగంగా చేరవేయొచ్చని సంస్థ చెబుతోంది. ‘ఈ దశాబ్దం ముగిసేలోపు అమెరికాలో ఎఫ్ఏఏ సర్టిఫికేషన్ పూర్తిచేసి, ముందుగా అమెరికాలో సేవలు ప్రారంభిస్తాం. అనంతరం భారత్ వంటి ఇతర మార్కెట్లకు విస్తరించాలన్నది మా ప్రణాళిక. భారత్‌లో వసతులు అద్భుతంగా ఉన్నాయి.. ఎయిర్ కండిషనింగ్ నుంచి తయారీ ప్రమాణాల వరకు అన్నీ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ చూసిన కొన్ని ఉత్పత్తులను అమెరికాలోని మా బృందానికి సూచించాలనుకుంటున్నాను’’ అని విస్క్ ఆసియా పసిఫిక్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఫిలిప్ స్విన్స్బర్గ్ చెప్పారు. -
విమానయానరంగానికి కోపైలట్‌గా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారత విమానయాన రంగం గత దశాబ్ద కాలంలో చరిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఒకప్పుడు దేశంలో విమానయానం కొద్దిమందికే పరిమితం కాగా.. నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగిందని చెప్పారు. విమాన తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, విమాన లీజింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని.. వీటిని పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి భారత విమానయాన రంగానికి కోపైలట్‌గా ఉండాలని చెప్పారు. రాబోయే కాలంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగి పెట్టుబడులకు విస్తృత అవకాశాలు దొరుకుతాయన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2026’ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. గత పదేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణ అభివృద్ధి సాధించిందని, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విమానయాన సంస్థలు 1,500కు పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల భాగస్వాములకు వింగ్స్ ఇండియా సదస్సు ఎంతో కీలకమన్నారు. రెండో దశ ‘ఉడాన్’ స్కీమ్’విమాన ప్రయాణాన్ని ప్రత్యేక హక్కుగా కాకుండా ప్రతి పౌరుడికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేశామని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండగా, ప్రస్తుతం అవి 160కిపైగా చేరాయని, పదేళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కువ విమానాశ్రయాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రాంతీయ, ఎయిర్ కనెక్టివిటీ, స్లీ–ప్లేన్ ఆపరేషన్స్ కోసం రెండో దశ ‘ఉడాన్ స్కీమ్’ ఉంటుందన్నారు. ప్రతీ పౌరుడు సులభంగా విమానయానం చేసేందుకు వీలైన చర్యల్లో భాగంగా సరసమైన విమాన చార్జీల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కోటిన్నర మంది ప్రయాణికులు, గతంలో లేని మార్గాల్లో కూడా ప్రయాణించారని తెలిపారు. 2047 నాటికి దేశంలో 400కు పైగా విమానాశ్రయాలు ఉండనున్నాయని, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ముందుకెళ్తున్నందున విమాన అనుసంధాన విస్తరణ మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. పర్యాటక రంగంపైనా దృష్టిదేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని ప్రధాని మోదీ చెప్పారు. విమాన డిజైన్, తయారీ, మరమ్మతులు–నిర్వహణ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. భారత్ ఇప్పటికే విమాన భాగాల తయారీలో కీలక దేశంగా మారిందని, దేశీయంగానే సైనిక, రవాణా విమానాలను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. పౌర విమానాల తయారీ దిశగానూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. భౌగోళికంగా భారత్‌కు ఉన్న వ్యూహాత్మక స్థానం, విస్తృత దేశీయ అనుసంధాన వ్యవస్థ, భవిష్యత్తులో పెద్దఎత్తున విమాన సేవల విస్తరణ భారత్‌కు పెద్ద బలమని పేర్కొన్నారు. భారత్‌లో రూపొందించి తయారుచేసిన ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) విమానాలు త్వరలోనే దేశీయ విమానయాన రంగాన్ని మార్చబోతున్నాయని, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు.గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీసస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్‌పై భారత్ గట్టిగా పని చేస్తోందని, భవిష్యత్తులో గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ, ఎగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విమానయాన రంగంలో సంస్కరణల వల్ల భారత్ గ్లోబల్ సౌత్‌కు, ప్రపంచానికి మధ్య ప్రధాన విమాన ద్వారంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడిదారులు, తయారీదారులకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విమానయానంతో పాటు ఎయిర్ కార్గో రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కార్గో రవాణా వేగవంతం, సులభతరం చేయడానికి సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. భారత్ త్వరలో అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్‌గా మారుతుందని, గిడ్డంగులు, ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, ఈ–కామర్స్ రంగాల్లో అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నేటి నుంచి వింగ్స్ ఇండియా షో (ఫొటోలు)
-
రేపట్నుంచి ఆకాశాన విన్యాసాలు
హైదరాబాద్: రంగురంగుల పొగలు.. తీరొక్క ఆకృతులు.. రకరకాల విన్యాసాలు.. ఇవీ నగర గగనతలంలో రేపట్నుంచి కనువిందు చేసే దృశ్యాలు. కేంద్ర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నాయి. విన్యాసాలను వీక్షించేందుకు మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్యవేత్తలకు, తరువాతి రెండు రోజులు సామాన్యులకు అనుమతిస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్, మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు నాలుగు రోజులపాటు ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలు చేయనున్నాయి. విమాన విన్యాసాల వేళలు... నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11.00–11.30 గంటల వరకు సూర్యకిరణ్ టీమ్, మధ్యాహ్నం 12.00–12.30, సాయంత్రం 4.00–4.30 వరకు మార్క్జెఫ్రీ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ప్రారంభ రోజైన బుధవారం మాత్రం అదనంగా రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు మార్క్ జెఫ్రీ బృందం ప్రదర్శనతో పాటు సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు డ్రోన్ షో కనువిందు చేయనుంది. మొత్తంగా 13 సార్లు విమాన విన్యాసాలు, ఒక డ్రోన్ షో నిర్వహించనున్నారు. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వింగ్ ఇండియా–2026 వర్గాలు పేర్కొంటున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఇండియన్ ఏవీయేషన్–2026ను ప్రారంభించనున్నారు. 200లకు పైగా ప్రధాన కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్‌బస్, సీఎస్ఐఆర్–ఏఎన్ఎల్, ఆర్కా ఏవియేషన్ దస్సాల్ట్ తమ విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనకు రానున్నాయి. -
వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్‌బస్
జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2026లో 'ఎయిర్‌బస్' తన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు & వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్‌ను ప్రదర్శించనుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్-ఐల్ విమానం A321neo, దేశీయ & అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్‌చేంజర్‌గా నిలిచిన A220 విమానాలతో పాటు H160, H125 హెలికాప్టర్లు స్టాటిక్ డిస్ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి.ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. H125 హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెమగల్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద అసెంబ్లీ కానుంది. కాగా హాల్ Aలోని స్టాండ్ 11 వద్ద A321XLR, H145 మోడళ్లను ఎయిర్‌బస్ పరిచయం చేయనుంది.పబ్లిక్ డేస్‌లో ఎయిర్‌బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక ‘మీట్-అండ్-గ్రీట్’ రిక్రూట్మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది. డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు. ముఖ్యంగా బిగ్ డేటా, ఐఓటీ, అవియానిక్స్ సాఫ్ట్వేర్, ఎయిర్‌ఫ్రేమ్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్‌బస్ కోరుకుంటోంది. -
Wings India 2024 Air Show Photos: రెండో రోజూ ‘వింగ్స్ ఇండియా-2024’ (ఫొటోలు)
-
బేగంపేట్ ఎయిర్ పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా-2024 షో
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్‌గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్‌ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
Wings Airshow 2024 Photos: అదిరిపోయే ఎయిర్ షో..బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా-2024’ (ఫొటోలు)
-
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్‌బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
-
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
హైదరాబాద్‌లో వింగ్స్ 24 ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
విజయవంతంగా ముగిసిన ఏవియేషన్ షో (ఫొటోలు)
-
లోహ విహంగాల హంగామా.. 'వింగ్స్ ఇండియా' (ఫోటోలు)
-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
WINGS INDIA 2022 : రెక్కలు తొడిగిన గగనం (ఫొటోలు)
-
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
అత్యాధునిక ఇండియన్ హెలికాప్టర్
-
గగనమంత ఉత్సాహం: ఆకట్టుకున్న ‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ షో (ఫొటోలు)
-
20 ఏళ్లు.. 2,210 విమానాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ రెమి మెలార్డ్ ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్‌పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్‌కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ .. సర్వీస్ సామర్థ్యాలు, ట్యాక్సేషన్ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు. అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు. 34 వేల మంది పైలట్లు కావాలి విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్‌లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు. భారత్‌లో ఎయిర్‌బస్ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్ నుంచి 650 మిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్ డెలివర్ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్ చేయగా ఇందులో 10% ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్ అని తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
WINGS INDIA 2022 : నేటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ షో (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో
సాక్షి, హైదరాబాద్: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ పరిశ్రమపై రౌండ్ టేబుల్ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్ ఫైనాన్సింగ్– లీజింగ్ డ్రోన్స్, ఏవియేషన్ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. చివరి 2రోజులూ సందర్శకులకు... ఈ ఈవెంట్లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ ) విహంగాలు.. విశేషాలు.. ఈసారి ఎయిర్ షోలో సరికొత్త ఎయిర్ బస్ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్ బస్ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్ కు చెందిన ఎంబ్రార్స్ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్స్ట్రేషన్ టూర్లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన సారంగ్ టీమ్ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
‘వింగ్స్ ఇండియా-2020’ ప్రదర్శనలో కేటీఆర్
-
బేగంపేట ఎయిర్పోర్ట్ : ఆకాశవీధిలో ఆహా!
-
ఆకాశవీధిలో ఆహా!
రాజహంస(ఎమిరేట్స్) రాజసం లేదు.. ఖతర్ మెరుపులు లేవు.. ఎతిహాడ్ హోయలు అసలే కనిపించలేదు.. ఎయిర్ ఏషియా(మలేషియా), థ్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్కో(టీఎస్సీ–003), ఇండిగో (ఏ320–నియో)ల సోయగాలు లేనే లేవు.. ఔను గతంలో సందర్శకులను మైమరిపించిన విమానాలు ఈ ఏడాది కనిపించలేదు. చిన్నా చితకా విమానాలే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద విమానాలు రాకపోవడంతో సందర్శకులను ఉసూరుమన్పించింది. ఇదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2020’లోని సీన్.. అయితే ఎయిరోబాటిక్(వైమానిక విన్యాసాలు) మాత్రం సందర్శకులను కనురెప్ప వాల్చనీయలేదు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు కాస్తా ఊరటనిచ్చాయి. కరోనా ప్రభావం ‘వింగ్స్ ఇండియా’పై స్పష్టంగా కనిపించింది. గతంతో పోలిస్తే సందర్శకుల(బిజినెస్మెన్) సందడి తక్కువగా కనిపించింది. పట్టుమని 10 విమానాలు కూడా షోకు రాలేదు. అందులోనూ ప్రాఫిట్ హంటర్, ఎయిర్‌బస్ విమానం మినహాయిస్తే మిగతావాన్నీ బుల్లి విమానాలే. ఈ ఏడాది కొత్తగా ‘ప్రాఫిట్ హంటర్’ మాత్రమే వచ్చిచేరింది. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఈ షోకు ఆదివారం వరకు సమయం ఉండటంతో మరికొన్ని వచ్చి చేరే అవకాశం లేకపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ‘వింగ్స్ ఇండియా’ను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సారి ఏవియేషన్ షో కేవలం బిజినెస్‌కే పరిమితమైంది. ఆదివారం వరకు జరిగే ఈ షోకు వివిధ విమానయాన సంస్థలతో పాటు తయారీ సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే కరోనా వైరస్ భయం కారణంగా గురువారం షోకు హాజరైన కొంతమంది సందర్శకులతో పాటు అక్కడ ఉన్న భద్రత సిబ్బంది మాస్క్‌లు ధరించి కనిపించారు. గగనంలో విన్యాసాలు.. గగనంలో గింగరాలు తిరిగే ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. పొగలు చిమ్ముకుంటూ నింగిలో రకరకాల ఆకృతులను ఆవిష్కరించిన దృశ్యాలు కనువిందు చేశాయి. ఏవియేషన్ షో అంటే ముందుగా గుర్తొచ్చేది గగనంలో విన్యాసాలే. ఊపిరి బిగపట్టుకుని కళ్లార్పకుండా విన్యాసాలు వీక్షించేవారు. పొగలు కక్కుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లుగా అనిపించినంతలోనే.. అమాంతం కిందపడుతుందేమోనని భయంతో చూసేవారికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే మళ్లీ వేరే డైరెక్షన్లో విమానం దూసుకుపోవడం.. దాని వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోయి కిందపడుతున్నాయోనని ఒళ్లంతా గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలు అబ్బురపరిచాయి. సారంగ్ టీమ్ బృందం నాలుగు ‘ధ్రువ’ హెలికాప్టర్లతో, మార్క్జెఫ్రీ బృందం మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో వేర్వేరుగా చేసిన ఎయిరోబాటిక్స్ అలరించాయి. ప్రదర్శనకు ఉంచిన విమానాలు ఇవే.. మొత్తం తొమ్మిది విమానాలు ప్రదర్శనలో ఉంచారు. వీటిలో హోండా ఎన్271బీబీ, హెచ్ఏఎల్ ధ్రువ్ (ఏఎల్‌హెచ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ హెలికాప్టర్, హెచ్ఏఎల్ డీఓ–228, ప్రాఫిట్ హంటర్, ఎయిర్ ఇండియా, వీటీ–జీహెచ్ఎల్కు చెందిన జీబీఎల్ హెలికాప్టర్, వీటీ–వీబీబీ ఎయిర్‌క్రాప్ట్, డీఏ 42–వీ1 విమానం, ప్రాఫిట్ హంటర్ ఈ195–ఈ2 హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంచారు. ప్రాఫిట్ హంటర్ అదుర్స్.. వింగ్స్ ఇండియా 2020లో ప్రదర్శనకు ఉంచిన విమానాల్లో ఆకట్టుకున్నది ప్రాఫిట్ హంటర్ ఈ 195 ఈ2.. 146 మంది వరకు సీటింగ్ కెపాసిటీ గల ఈ విమానంలో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇతర విమానాల్లా కాకుండా కొంచెం అప్‌గ్రేడ్ చేస్తూ ‘ద కింగ్ ఆఫ్ ద స్కై’గా పిలిచే ఈ విమానంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లను 29 ఇంచుల నుంచి 35 ఇంచుల వరకు ఉండేలా చూశారు. సీటులో వెనుకకు ఒరిగి పడుకున్న ఇతరులకు ఇబ్బంది లేకుండా రూపకల్పన చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పెట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువగా శబ్దం వినబడదు. ఇంధనం కూడా మిగతా వాటికంటే కాస్తా తక్కువగానే ఖర్చవుతుంది. బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రార్ తయారుచేసిన విమానం ప్రపంచంలోనే మూడో అతి పెద్దది కావడంతో బిజినెస్ విజిటర్స్ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. గంటలకు 833 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానం 1,450 మీటర్ల నుంచి టేకాఫ్, 1,240 మీటర్ల నుంచి ల్యాండ్ అవుతుందని పైలట్ లూయిస్ సొగారో తెలిపారు. విమాన యాక్సెసరీస్‌కే కంపెనీల పెద్దపీట.. ఏవియేషన్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎక్కువ శాతం విమాన ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు సంస్థలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఇంజిన్ ఉత్పత్తుల నుంచి ప్రయాణికులు దిగేందుకు ఉపయోగించే మూవింగ్ స్టెప్స్ వెహికల్ వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీ సంస్థలు ప్రచారానికి పెద్దపీటనే వేశాయి. విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. అలాగే ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు స్సైస్ జెట్, స్పైస్ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ను ఎగ్జిబిషన్లో ఉంచారు. ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయ్సే, ప్రట్ అండ్ వైట్నీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే జెట్ ఎయిర్వేస్, కార్పొరేట్స్ జెట్స్ వంటి స్టాళ్ల ద్వారా విమానాలు, హెలికాప్టర్ మోడళ్లపై ప్రచారం కల్పిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏరోస్పేస్ సైట్స్ ఇన్ తెలంగాణ, సీఎస్ఐఆర్ నేషనల్ ఏరో స్పేస్ లేబరేటరీస్, గుజరాత్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ, టర్బో ఎయిర్‌బస్ హెలికాప్టర్ వంటి సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటుచేసి తమ సేవలను వివరించాయి. మురిపిస్తోన్న బుల్లి విమాన నమూనాలు.. బుల్లి విమాన నమూనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎగ్జిబిషన్లో వివిధ స్టాల్స్‌లో ఈ విమాన నమూనాల ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉంచారు. వివిధ పరిమాణాల్లో చూడముచ్చటగా వీటిని తీర్చిదిద్దారు. ఏ–380 ఎయిర్‌బస్ విమాన నమూనా రూ.4,040కు విక్రయిస్తున్నారు. అలాగే బోయింగ్ విమానం రూ.23,955, ఎక్స్‌ప్రెస్ విమానం రూ.3 వేలకు లభ్యమవుతున్నాయి. మరోవైపు ఆయా విమాన, హెలికాప్టర్ కంపెనీలకు చెందిన ఎయిర్ హోస్టెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విమాన నమూనాలతో పాటు సందర్శకులతో ఫొటోలకు ఫోజులివ్వడం కనిపించింది. విమాన పైలెట్లను అప్రమత్తం చేస్తుంది విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్ అవడం, టేక్ ఆఫ్ సేవల కోసం ఏవియేషన్ వెదర్ మానిటర్ సిస్టమ్ పనిచేస్తోంది. పొగమంచు బాగా కురిసిన సమయంలో, వర్షం బాగా కురిసిన సమయంలో విమాన సేవలు కొనసాగించాలా, వద్దా అన్న దానిపై అక్కడి వాతావరణాన్ని బాగా అధ్యయనం చేసి ఏటీసీకి చేరవేస్తోంది. మనమిచ్చే సమాచారాన్ని ఆయా విమాన పైలెట్లకు పంపించి అప్రమత్తం చేస్తారు. అలాగే మైన్లను గుర్తించేందుకు మాగ్నెటోను కూడా ఈ ఏడాది మరింత అప్డేట్ చేశాం. ఐదు కిలోమీటర్ల కమ్యూనికేషన్ రేంజ్లో ఇది పనిచేసేలా అభివృద్ధి చేశాం. – కులకర్ణి, సీఎస్ఐఆర్ ప్రతినిధి విమానరంగంలో మహిళలకు బాసట ఇండియన్ ఉమెన్ పైలెట్స్ అసోసియేషన్(ఐడబ్ల్యూపీఏ)లో 300 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. విమాన రంగంలోకి వివిధ హోదాల్లో అడుగిడే మహిళా ఉద్యోగులకు మెళకువలు నేర్పుతున్నాం. ఈ రంగంలో వచ్చే ఆధునిక సమాచారం, అభివృద్ధిని కూడా విశదీకరిస్తాం. అలాగే పాఠశాలు, కాలేజీల్లో విమానరంగంపై అవగాహన కలిగిస్తాం. అలాగే ఉపకార వేతనాలు అందిస్తున్నాం. ఇలా ముఖ్యంగా మహిళలు ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహం అందిస్తున్నాం.– డింపుల్ వాలీ, ఐబ్ల్యూపీఏ కమిటీ మెంబర్ -
వింగ్స్ ఇండియా -2020
-
అద్భుతంగా ‘సారంగ్’ టీమ్ విన్యాసాలు
సనత్‌నగర్: బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా వింగ్స్ ఇండియా–2020 గురువారం ప్రారంభమైంది. ఇందులో సారంగ్ టీమ్ వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సారంగ్ టీమ్ నాలుగు రోజుల పాటు గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు వైమానిక విన్యాసాలు చేయనున్నారు. ఈ టీమ్ ప్రధానంగా భారత వైమానిక దళం వైపు యువతను ప్రేరేపించే దిశగా ప్రదర్శనలు ఇస్తుంటుంది. సారంగ్ హెలికాప్టర్ 2003లో బెంగళూరులో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎవాల్యుషన్ ఫ్లైట్ వారు రూపొందించారు. దీన్ని ‘ధ్రువ్’గా పిలుస్తారు. ఇది ఇండియన్ ఏవియేషన్ సెక్టార్‌కు మూల స్తంభంగా నిలబడింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)చే డిజైన్ చేయబడింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఛేదించే మల్టీ–మిషన్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్‌గా ఖ్యాతి గడించింది. భారతీయ వైమానిక దళం వృత్తి నైపుణ్యాన్ని, భారత విమానయాన పరిశ్రమ సాధించిన మైలురాళ్లను ప్రదర్శించే లక్ష్యానికి ఈ హెలికాప్టర్లు మార్గం సుగమం చేశాయి. ఈ హెలికాప్టర్ల బృందానికి సారంగ్ అని నామకరణం చేశారు. సారంగ్ అంటే సంస్కృతంలో నెమలి. ఈ బృందం భారతీయ వైమానిక దళం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తోంది. 2004 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఏరోస్పేస్ ఎయిర్ షోలో సారంగ్ బృందం తన తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత అదే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆల్ ఐన్ గ్రాండ్ ప్రిక్స్, 2008 మేలో బెర్లిన్‌లో జరిగిన ఇండో–జర్మన్ ఎయిర్ షోలో పాల్గొని బెస్ట్ ఏరోబాటిక్ టీమ్‌గా పేరుతెచ్చుకుంది. రాజెడ్ 90వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్లో, ఆ తరువాత ఆర్ఏఎఫ్ ఫెయిర్పోర్ట్లోని రాయల్ ఇంటర్నేషనల్ ఎయిర్ టాటూలో ప్రదర్శనలు ఇచ్చారు. 2008లో ప్రఖ్యాత ఫార్న్‌బరో ఎయిర్‌షో, 2016 జవనరిలో అల్ సఖీర్ ఎయిర్‌బేస్ వద్ద జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో, 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా 2018 మార్చిలో మారిషస్‌లో సారంగ్ టీమ్ ఎయిర్ షోలు చేసింది. అవే కాకుండా ఫోఖ్రాన్‌లో ఫైర్ పవర్ డిమానిస్ట్రేషన్ వంటి ఉత్సవ సందర్భాల్లో వైమానిక విన్యాసాలను చేయడంతో పాటు బెంగళూరులోని ఏరో ఇండియా ఎయిర్ షోలో ఈ బృందం క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ప్రెసిడెన్షియల్ ప్లీట్ రివ్యూ, నేవీ డే, వరల్డ్ మిలటరీ గేమ్స్, కామన్వెల్త్ యూత్ గేమ్స్ వంటి ఉత్సవ సందర్భాల్లో ఎయిర్ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. షోల ప్రదర్శన మాత్రమే కాకుండా యువతను వైమానిక దళం వైపు మళ్లించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాధ్యతాయుతమైన పాత్ర 2006లో గుజరాత్లో వైబ్రంట్, 2008లో ముంబాయిలో మెరైన్ డ్రైవ్, 2014లో అరుణాచల్ ప్రదేశ్‌లోని పసిఘాట్, బిజు పట్నాయక్ శతాబ్ది ఉత్సవాల్లో ఈ బృందం తమ సందేశాలను అందించింది. వీరి విన్యాసాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జాతీయ శక్తిని నలుదిశలా చాటిచెప్పేందుకు ఒక సాధనంగా నిలుస్తాయి. సేవా ›కార్యక్రమాల్లో కూడా ఈ బృందం ముందంజలో ఉంది. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల సమయంలో హెచ్ఏడీఆర్ మిషన్‌లో ఈ బృందం చురుగ్గా పాల్గొంది. ఈ బృందం వెయ్యి మందిని రక్షించింది. 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 12 టన్నుల సహాయక సామగ్రిని అందించాయి. అలాగే గత డిసెంబర్ 17న ఓఖీ తుఫాను, 2018 మార్చిలో తేనిలో జరిగిన అటవీ మంటల వ్యాప్తిని నిరోధించడంలో ఈ బృందం స్పందించిన తీరు అద్భుతం. 2018 ఆగస్టులో కేరళలో సంభవించిన వరదల సమయంలో తమ సామర్థ్యంతో 320 మందిని రక్షించారు. కేరళ ప్రజలకు సహాయంగా 77 టన్నుల సహాయక సామగ్రిని అందించారు. వరదలతో బాధపడుతున్న ప్రజలకు సహాయాన్ని అందించడంలో ఈ బృందం బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూనే ఉంది. నాలుగు రోజులపాటు ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2020 ఏవియేషన్ షో ఇవాళ్ట నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో సరంగ్, మార్క్ జెఫ్రీ బృందాలు విమాన విన్యాసాల రిహార్సల్స్‌తో బుధవారం అలరించాయి. నింగిలో అబ్బురపరిచే విన్యాసాలతో కిరాక్ పుట్టించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. నింగిలో విన్యాసాలను చూసేందుకు రహదారుల పైనే తమ వాహనాలను నిలిపి రిహార్సల్స్‌ను చూసి ఎంజాయ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా ‘వింగ్స్ ఇండియా–2020’
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడికి అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడికి అవకాశాలున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగాలు తెలంగాణలో ప్రాధాన్య రంగాలని చెప్పారు. కేంద్రం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏరోస్పేస్ షో ‘వింగ్స్ ఇండియా–2020’కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమం లో పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల అత్యున్నతస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. వింగ్స్ ఇండియా–2020తో పాటు గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పనితీరు వల్ల ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏరోస్పేస్ తయారీ రంగంలో బోయింగ్, జీఈ, సఫ్రాన్, రఫేల్, లాక్ హీడ్ మార్టిన్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో 4 ఏరో స్పేస్ పార్కులు ఉన్నాయని, అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హర్డ్‌వేర్ పార్కులు, టెక్నా లజీ సెజ్‌లు ఉన్నాయని వివరించారు. మరింత అభివృద్ధి చెందాలి.. ఏరోస్పేస్ రంగానికి సైతం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏటీఎఫ్‌పై పన్ను 16 శాతం నుంచి 1 శాతానికి తెలంగాణ తగ్గించిందని పేర్కొన్నారు. దీని వల్ల ప్రాంతీయంగా విమానయానం వృద్ధి చెందుతుందని తెలిపారు. ‘ఫ్లయింగ్ ఫర్ ఆల్’ అనే నినాదంతో జరిగే వింగ్స్ ఇండియా–2020 కార్యక్రమ స్ఫూర్తి మేరకు ఏరో స్పేస్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ పలు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎయిర్ బస్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, బీఏఈ కంపెనీల ఇండియా అధిపతులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఎయిర్ బస్ ఇండియా సీఈవో ఆనంద్ స్టాన్లీ, సాఫ్రాన్ ఇండియా సీఈవో పియర్రీ డికెలీ, బే సిస్టమ్స్ ఎండీ నిక్ కన్నా, జీఈ ఏవియేషన్ ఇండియా అధినేత (కంట్రీ హెడ్) విక్రమ్ రాయ్, తలాస్ కంపెనీ ఉపాధ్యక్షుడు కపిల్ కిశోర్, యునైటెడ్ టెక్నాలజీస్ ప్రాంతీయ డైరెక్టర్ సమిత్ రే పాల్గొన్నారు. పీయూష్ గోయల్‌తో కేటీఆర్ భేటీ ఫిబ్రవరిలో తెలంగాణలో నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ఆహ్వానించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో గురువారం రాత్రి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా 2 పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయాలని, వరంగల్–హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్–బెంగళూరు–చెన్నైని కలుపుతూ దక్షిణాది పారిశ్రామిక కారిడార్ కావాలని మరోసారి నివేదించారు. అంతకుముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాదే తెలంగాణలో ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించబోతున్నామని, తొలుత ఒక ఇన్స్టిట్యూట్గా ప్రారంభించి, తరువాత అంతర్జాతీయ స్థాయి సంస్థగా, యూనివర్సిటీగా విస్తరించబోతున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
బై బై ఎయిర్ షో....


