జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2026లో 'ఎయిర్‌బస్' తన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు & వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్‌ను ప్రదర్శించనుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్-ఐల్ విమానం A321neo, దేశీయ & అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్‌చేంజర్‌గా నిలిచిన A220 విమానాలతో పాటు H160, H125 హెలికాప్టర్లు స్టాటిక్ డిస్‌ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. H125 హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెమగల్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద అసెంబ్లీ కానుంది. కాగా హాల్ Aలోని స్టాండ్ 11 వద్ద A321XLR, H145 మోడళ్లను ఎయిర్‌బస్ పరిచయం చేయనుంది.
పబ్లిక్ డేస్‌లో ఎయిర్‌బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక ‘మీట్-అండ్-గ్రీట్’ రిక్రూట్‌మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది. డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు. ముఖ్యంగా బిగ్ డేటా, ఐఓటీ, అవియానిక్స్ సాఫ్ట్‌వేర్, ఎయిర్‌ఫ్రేమ్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్‌బస్ కోరుకుంటోంది.


