టెన్త్‌ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు | Governor Shiv Pratap Shukla Extends Best Wishes To 10th Students | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

Mar 13 2026 7:03 PM | Updated on Mar 13 2026 7:14 PM

Governor Shiv Pratap Shukla Extends Best Wishes To 10th Students

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి  మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement