ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత | Former United AP DGP H.J. Dora Passes Away | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

Mar 13 2026 4:29 PM | Updated on Mar 13 2026 4:52 PM

Former United AP DGP H.J. Dora Passes Away

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు.కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆయన్ను నిమ్స్‌లో చేర్చగా.. ఈ రోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

హెచ్‌జే దొర.. ఆయన పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలు అందించి, క్రమశిక్షణతో పాటు ప్రజల భద్రత కోసం కృషి చేశారు. దశాబ్దాలపాటు పోలీస్‌ వ్యవస్థలో కీలక పదవుల్లో పనిచేసి, అనేక సంస్కరణలకు మార్గదర్శకుడయ్యారు. ప్రధానంగా గ్రేహౌండ్స్‌ బలోపేతానికి హెచ్‌జే దొర విశేషంగా కృషి చేశారు. 

ఆయన మరణం రాష్ట్రానికి, పోలీస్‌ శాఖకు పెద్ద నష్టం అని పలువురు భావిస్తున్నారు. సహచరులు, శిష్యులు ఆయనను క్రమశిక్షణా ప్రియుడిగా, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తుచేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement