హైదరాబాద్: ఉద్యోగంలో చేరిన రోజే చనిపోతానేమోనని భయమేసిందని టెలీకాలర్ కీర్తన ఆందోళన వ్యక్తం చేసింది. మధురానగర్‌లోని వారాహి కన్సెల్టెన్సీలో మంగళవారం జరిగిన శశికిరణ్‌రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను ఆమె పోలీసులకు తెలిపింది. వివరాలివీ... వారాహి కన్సెల్టెన్సీ నిర్వాహకులు శశికిరణ్‌రెడ్డిని కత్తితో పొడిచి... కత్తితో స్టాఫ్‌ను బెదిరిస్తూ బయటికొచి్చన ప్రభుకుమార్ ఎదురుగా ఉన్న రిసెప్షనిస్టు లయ (అక్షయ)ను కత్తితో పొడిచినట్టు పేర్కొంది. మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి చెందిన కీర్తన అదే రోజు (మంగళవారం) ఉద్యోగంలో చేరింది.
ఉదయం 9 గంటలకు ఉద్యోగంలో చేరిన ఆమె మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరగడం భయమేసిందని తెలిపింది. శశికిరణ్‌రెడ్డి గదిలోంచి పెద్దగా కేకలు వినిపించాయి. రిసెప్షనిస్టు లయ తలుపులు కొడుతూ ఉందని, కొంత సేపటికి తర్వాత యువకుడు కత్తితో బయటకు వచ్చాడని తెలిపింది. లయను కూడా పొడిచాడంది. నిందితుడు కిందకు పరిగెత్తగానే కీర్తన శశికిరణ్‌రెడ్డి ఆఫీస్‌లోకి పరిగెత్తి చూడగా ఆయన ఒళ్లంతా రక్తంతో నిండిపోయిందని, ఆయన ఏదో చెబుతున్నాడని అర్థం కాలేదని పేర్కొంది. ధైర్యం చేసి 100కు ఫోన్ చేసినట్టు తెలియజేసింది. వివరాలను మధురానగర్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


