నంబర్ ప్లేట్‌కే లక్షలు ఖర్చు.. ‘0009’ కోసం 10.5 లక్షలు! | RTA Fancy Numbers Auction Khairatabad 10-5-lakh For 0009 | Sakshi
Sakshi News home page

నంబర్ ప్లేట్‌కే లక్షలు ఖర్చు.. ‘0009’ కోసం 10.5 లక్షలు!

Mar 13 2026 9:32 AM | Updated on Mar 13 2026 11:03 AM

RTA Fancy Numbers Auction  Khairatabad 10-5-lakh For 0009

సాక్షి, హైదరాబాద్ జిల్లా: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై వాహనదారులు క్రేజ్‌ చాటుకున్నారు. గురువా రం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ప్రత్యేక నంబర్‌లపైన రూ.31,14,730 లభించినట్లు జేటీసీ రమేష్‌ తెలిపారు. ‘టీజీ 09 ఎల్‌ 0009’ను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.10,50,000 చెల్లించింది. 

‘టీజీ 09 ఎల్‌ 0007’కు పెద్దింటి తిరుపతిరావు అనే వ్యక్తి రూ.3,19,999 చెల్లించారు. రూ.2,00,005తో ‘టీజీ 09 ఎల్‌ 0005’ను అనిరుధ్‌ ఆగ్రో ఫారమ్స్, రూ.1.5 లక్షలతో ‘టీజీ 09 కె 9999’ను ముప్పా హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, రూ.1.24 లక్షలతో ‘టీజీ 09ఎల్‌ 0024’ను తిక్కవరపు మంజులారెడ్డి, రూ.లక్ష ‘టీజీ 09 ఎల్‌ 0001ను  అర్జున్‌ పటేల్‌ అనే వాహనదారు దక్కించుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement