ఆదిలాబాద్‌టౌన్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు గురువా రం బీఆర్డీయూ అనుబంధ తెలంగాణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ పద్మ మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేల వేతనాలు చెల్లించాలని, లెప్రసీ, టీ బీ కేసులకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల ఆశ వర్కర్లు పద్మ, జ్యోతి, ఈశ్వరి, ఇందిర, ప్ర త్యూష, గోదావరి, రేఖ పాల్గొన్నారు.


