సర్పంచులు, కౌన్సిలర్ల చేతుల్లోనే జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సర్పంచులు, కౌన్సిలర్ల చేతుల్లోనే జిల్లా అభివృద్ధి

Mar 13 2026 7:50 AM | Updated on Mar 13 2026 7:50 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: గ్రామం, వార్డుల అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఆదిశగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్‌ కౌ న్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల పాటు అమలు చేయనున్న కార్యక్రమాల కార్యాచరణను పవర్‌ పాయింట్‌ ప్రజంటేష న్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణతో గ్రామాలు, వార్డుల రూపురేఖలను మార్చేలా విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్‌ 2న అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, ప్రతీ వార్డులో వార్డు సభ నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్షించాలని సూ చించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ అధికారులతో ఘర్షణ వాతావరణానికి వెళ్లకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు ఉచితంగా అందించేందుకు రూ.500 విలువగల ఐదు రకాల కూ రగాయల విత్తనాల కిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బండారి అనూష, జెడ్పీ సీఈవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, అదనపు ఎస్పీలు సురేందర్‌ రావు, మౌనిక, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రోహిత్‌, తదితరులు పాల్గొన్నారు.

జనగణన పారదర్శకంగా నిర్వహించాలి

కై లాస్‌నగర్‌: హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ సెన్సస్‌ ప్రక్రి య పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. జనగణన–2027 లో భాగంగా గురువారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకురా లు రాథోడ్‌ పంచపూల, తదితరులు పాల్గొన్నారు.

‘బడికి సెలవులొచ్చాయి’ ఆవిష్కరణ

సాత్నాల: భోరజ్‌ మండలంలోని మండగడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు జైకర్‌ రచించి గానం చేసిన ‘బడికి సెలవులొచ్చాయి’ సీడీని కలెక్టర్‌ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం పాటను రచించి, గాత్రం చేసిన జైకార్‌ను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ, అభవ్‌ కుమార్‌, నారాయణ, స్వాతి, అనిత, మాళవిక, అశోక్‌, నాందేవ్‌, గణేశ్‌, చింతామణి, శైలేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం

కై లాస్‌నగర్‌: జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ‘ఇన్నోవేషన్‌ పంచాయత్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలా బాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన యువ త, విద్యార్థులు, ఆవిష్కర్తలు తమ వినూత్న ఆలోచనలను నిపుణుల ముందుంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 91006 78543 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement