సాత్నాల: విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. భోరజ్ మండలం బాలాపూర్‌లో ఈజీఎస్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించనున్న కిచెన్ షెడ్ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలో దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సుమారు 3,500 మంది పేద విద్యార్థులకు ఉచితం విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావత్ అచ్యుత్, జక్కుల వేణు, భగవాన్లు, రాజశేఖర్, శంకర్, విట్టల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.


