నేరడిగొండ: అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బొరిగామలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఘటనలో నాలుగు ఇళ్లు, మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైన జాదవ్ ప్రేమ్‌సింగ్‌కు వ్యక్తిగతంగా రూ.30వేలు తక్షణ సహాయంగా అందజేశారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు.


