Hyderabad: పెరుగూ కల్తీ | Curd Adulteration Scam Busted in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: పెరుగూ కల్తీ

Mar 13 2026 9:29 AM | Updated on Mar 13 2026 7:24 PM

Curd Adulteration Scam Busted in Hyderabad

హైదరాబాద్: కాదేదీ కల్తీకి అనర్హం అన్నచందంగా మారింది హైద‌రాబాద్‌ నగరంలో నిత్యావసరాల వస్తువుల పరిస్థితి. గురువారం జీహెచ్‌ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి అంబర్‌పేటలోని ఓ దుకాణంలో 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట రహత్‌నగర్‌కు చెందిన నరేష్‌ రాఘవేంద్ర ఆరు నెలలుగా స్థానికంగా ఎన్నార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట పాల వ్యాపారం చేస్తున్నారు. 

వీరు కల్తీ పెరుగు తయారు చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో.. జీహెచ్‌ఎంసీ టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఎన్నార్‌ ఎంటర్‌ప్రైజ్‌పై దాడి చేశారు. అక్కడ లభించిన 2,500 కిలోల అనుమానిత కల్తీ పెరుగును సీజ్‌ చేశారు. పెరుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. జీహెచ్‌ఎంసీ టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement