నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల | PM Kisan Funds to be Released Today | Sakshi
Sakshi News home page

నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

Mar 13 2026 7:48 AM | Updated on Mar 13 2026 10:29 AM

PM Kisan Funds to be Released Today

నేడు ( శుక్రవారం) 22 వ విడత పీఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేయనుంది. అసోంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ నొక్కి వీటి విడుదల చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది ఖాతాల్లో రూ. 18,640 కోట్లు జమకానున్నాయి. కాగా గతేడాది నవంబర్‌లో కేంద్రం 21వ విడత నిధులను తమిళనాడు వేదికగా విడుదల చేసింది. 
 

కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ధికోసం ప్రతీ ఏడాది రూ. 6 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. ప్రతీ ఏడాది తొలి విడత సొమ్మును ఫిబ్రవరిలో జమ చేసేవారు.  పీఎం కిసాన్ లబ్దిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి 1.30 లక్షల మంది అనర్హులను గుర్తించి వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఈ ప్రక్రియ వల్లనే నిధుల విడుదలలో జాప్యం జరిగిందని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement