breaking news
best wishes
-
పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు. Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
‘పారిస్ నుంచి పతకాలతో తిరిగి రండి’
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఆమె మన ఆటగాళ్లు ఎక్కువ పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ‘ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో భారత యువ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు పోటీల్లో రికార్డు సంఖ్యలో పతకాలు గెలుస్తున్నారు.కొద్ది రోజుల్లో పారిస్‌లో ఒలింపిక్స్‌లో ప్రారంభం కానున్నాయి. అందులో పాల్గొనే ప్రతీ భారత అథ్లెట్లను చూసి మేం గర్విస్తున్నాం. వారికి నా అభినందనలు’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మరోవైపు 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేసే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మన ఘనతలను మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో భారత ఒలింపిక్ సంఘం 2036 ఒలింపిక్స్ కోసం బిడ్ వేసేందుకు సిద్ధమవుతోందని ముర్ము అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జరిగే బిడ్‌లో ఖతర్, సౌదీ అరేబియా, ఇండోనేసియా లాంటి దేశాలతో భారత్ పోటీ పడే అవకాశం ఉంది. -
ఆ స్టార్ హీరోకు వెల్కమ్ చెప్పిన నితిన్.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఫిబ్రవరి17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ధనుష్‌కు టాలీవుడ్‌కు స్వాగతం అంటూ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. #SIR In cinemas, From Tomorrow!Hearing great things about the film already👏👏 Congrats to my dear Swami #VenkyAtluri & Grand Welcome to @dhanushkraja garu to Telugu. My heartfelt wishes to my hattrick producer @vamsi84 n @sitharaents , each and everyone from the Team #Sir pic.twitter.com/HcYFzxydrt — nithiin (@actor_nithiin) February 16, 2023 -
నేను, మహేశ్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే : నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల జంట ఒకరు. వెండితెరపై హీరో,హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్-నమ్రతలు 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఈ స్టార్కపుల్కి పెళ్లయి నేటితో 18 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. '18 ఏళ్ల ప్రయాణం ఎంతో క్రేజీగా, ప్రేమగా ముందుకు సాగింది. ఎప్పటికీ ఇలాగే ముందుకు సాగాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. అంటూ పోస్ట్ చేశారు. ఇక నమ్రతా కూడా ఇన్‌స్టాలో క్యూటెస్ట్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మా జీవితంలో మేం తీసుకున్న అత్యత్తుమ నిర్ణయం ఇదే' అంటూ మహేశ్‌తో దిగిన అరుదైన ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇంతకాలం ప్రేమికులుగా కలిసున్న వీళ్లు ఏడడుగులు వేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే.. ఇక కొత్త జంటకు నెటిజన్లు సహా పలవురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్‌లు న్యూ కపుల్‌కి బెస్ట్ విషెస్ అందజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. 'మీ ఇద్దరికి కంగ్రాట్స్. ఆల్ ది లవ్ అండ్ హ్యాపీనెస్' అంటూ కత్రినా ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆలియా కంటే ముందు రణ్‌బీర్.. దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. దీపికా రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడితే, కత్రినా విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. చదవండి: 'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్ చేసిన ఆలియా -
IND Vs PAK: 13-0 చూడాలనుంది.. గెలవడం కన్నా మానసికంగా
టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. టి20 ప్రపంచకప్ 2021 నేటి నుంచే ప్రారంభమవుతున్నప్పటికీ అందరి కళ్లు భారత్- పాక్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. హై వోల్టేజ్‌గా సాగే ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనేది రేపటితో తేలిపోనుంది. ఇప్పటికైతే టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ టి20ల్లో మరింత బలంగా తయారైంది. వన్డే ప్రపంచకప్‌లలో పాక్‌పై 7-0, టి20 ప్రపంచకప్‌లలో 5-0తో టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు.. టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''టీమిండియా 13-0తో పాకిస్తాన్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలిచి రికార్డును టీమిండియా పదిలంగా ఉంచుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం టీమిండియాలో అందరూ మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు. ఇక ఈ జట్టు 10 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను గెలిచి నిరీక్షణకు తెర దించుతుందని ఆశిస్తున్నా. అలా అని పాకిస్తాన్‌ను తక్కువ చేసి చూడలేం. రేపటి మ్యాచ్‌లో ఇరు జట్లలో ఏ ఇద్దరు ఆటగాళ్లు మంచిగా ఆడితే విజయం వారిదే అవుతుంది. అయితే మ్యాచ్ గెలవడం కన్నా మానసికంగా దెబ్బతీయడం ముఖ్యం. నా దృష్టిలో ఇండియా- పాక్ మ్యాచ్ గొప్పవాటిలో ఒకటిగా మిగిలిపోనుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Sourav Ganguly feels that winning the mental battle is very important and India can once again beat Pakistan in the T20 World Cup.#T20WorldCup #India #Pakistan pic.twitter.com/5jZevq5fHy — Sportskeeda India (@Sportskeeda) October 23, 2021 -
సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీవీ సింధు
సాక్షి, అమరావతి: జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరఫున పాల్గొననున్న ఒలింపియన్స్ పీవీ సింధు, ఆర్ సాత్విక్‌సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో పీవీ సింధు తదితరులు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కేటాయించిన రెండెకరాల భూమికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం జగన్ పీవీ సింధుకు అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్న సీఎం జగన్‌కు ఇవే నా ధన్యవాదాలు అని పేర్కొంది. ‘మా మూలాలను గుర్తించి, మమ్మల్ని గౌరవిస్తూ.. మీరిచ్చే ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు I am honoured and proud of my roots and I would like to thank Hon’ble CM @ysjagan for constantly supporting and encouraging the growth and development of sports 🙏🏽 https://t.co/CI4haGw7iM — Pvsindhu (@Pvsindhu1) June 30, 2021 -
మహిళలు అద్భుతాలు చేయగలరు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జనాభాలో సగం వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలకపాత్ర అని పేర్కొన్నారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవుదినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. గవర్నర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా మన వారసత్వం, సంస్కృతి, సం ప్రదాయాలు మహిళలను ఆదిశక్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకు లింగ సమానత్వపు స్ఫూర్తి పెంపొందించడం, మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. కోవిడ్–19 మహ మ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన, త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
మహిళలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. నామినేటెడ్ పోస్టులతోపాటు నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ వివరించారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక భూమిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ సాక్షి, అమరావతి: జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించడంలో భారతీయ మహిళలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజాభివృద్ధిలో మహిళలు స్ఫూర్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా మహమ్మారిపై పోరులో మహిళా శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు సాధారణ మహిళలు కూడా ముఖ్య భూమిక వహించారన్నారు. -
నూతన వధూవరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి/తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మేనల్లుడు జగదీష్ వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులు జగదీష్, జాక్లిన్ రోజ్ దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. (చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి) రాబడి పెరగాలి: సీఎం జగన్ -
హార్టీ కంగ్రాట్స్ టీమిండియా: సీఎం జగన్
బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో స్టన్నింగ్ విజయం సాధించడంపై పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. భారత బ్యాట్స్మెన్ల అసమాన పోరాటం అందరిని ఆకట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆసీస్‌ను వరుసగా రెండోసారి సొంతగడ్డపై ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'హార్టీ కంగ్రాట్స్ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్‌లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది.' అని తెలిపారు. చదవండి: టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు.ఈ సందర్భంగా కెప్టెన్ రహానేతో పాటు జట్టు సభ్యులను కేసీఆర్ అభినందించారు. టీమిండియా విజయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం.. టీమిండియా ఆటగాళ్లు భారత్‌ను గర్వించేలా చేశారు. కీలక ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లతోనే అద్భుతం చేసి చూపించారు. 2021 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించారు 'అని కేటీఆర్ అన్నారు.చదవండి: చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం -
వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు అందజేయాలంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు వివిధ పద్దతుల్లో అభినందనలు తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్ ఘన విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగువారంతా సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సేవా కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ విషెస్ జననేతకు చేరాలని ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల శుభాకాంక్షలను వైఎస్ జగన్‌కు చేరవేసేందుకు ‘సాక్షి’ సిద్దమైంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మీ ప్రేమాభిమనాలను కురిపించారు. ఇప్పుడు మీ శుభాకాంక్షలు అందించండి. మీ తరఫున సాక్షి వారికి విషెస్ అందిస్తుంది. మరో కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న మీ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మీ సందేశాలను వీడియో లేదా ఆడియో ఫార్మాట్లో రికార్డు చేసి మీ పేరు, ఊరు పేర్కొంటూ 99127 90699 నెంబరుకు వాట్సాప్ చేయండి. లేదా సాక్షి దినపత్రికలో పేర్కొన్న విధంగా బాక్స్‌లో మీ శుభాకాంక్షలు రాసి, కత్తిరించి మీ దగ్గరలోని సాక్షి కార్యాలయంలో కేటాయించిన బాక్స్‌లో వేయండి. -
ఎమ్మెల్సీ కత్తికి అభినందనలు
కడప ఎడ్యుకేషన్: పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించిన ఉద్యమనేత, సంఘనాయకుడు కత్తి నరసింహారెడ్డికి యూటీఎఫ్ నేతలు అభినందనలు తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్, సుబ్బరాజు , ఎస్టీయూ జిల్లా నాయకులు రఘునాథరెడ్డి, రాష్ట్రనాయకులు జయరామయ్య ప్రసంగించారు. జిల్లా హెచ్ఎం సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు జాబీర్, రవికుమార్, నరసింహారావు, గంగన్న ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఇలియాస్‌బాషా, బీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. -
శుభాకాంక్షల ‘వర్షం’
సహ నటీనటులు, అభిమానుల శుభాకాంక్షలతో నటి త్రిష తడిసి ముద్దవుతున్నారు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామకు మూడు పదులు దాటాయి. ఈ చెన్నై సుందరి తన జీవిత భాగస్వామిని వెతుక్కున్నారు. కాదూ, లేదూ, అంటూనే తాను పెళ్లి పీటలెక్కనున్న విషయాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్‌మణియన్‌తో ఖుషీగా షికార్లు కొడుతున్న ఈ బ్యూటీ ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 23న నిశ్చితార్థం జరగనుంది. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు సహ నటీనటులతోపాటు, ఇతర సాంకేతిక నిపుణులు, అభిమానులు త్రిషను శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోష సాగరంలో తేలిపోతున్నారు త్రిష. ఆమెకు ఎవరెవరో ఎలా శుభాకాంక్షలు చెప్పారో చూద్దాం. ప్రియమణి : శుభాకాంక్షలు త్రిష శింబు : శుభాకాంక్షలు త్రిష. మీరు, వరుణ్ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కార్తీక: 2015లో అధికారిక పూర్వకంగా ప్రకటించిన తొలి శుభవార్త ఇది. చాలా సంతోషంగా ఉంది. వరుణ్మణియన్తోపాటు పలువురి హృదయాల భగ్నానికి మీరే కారణం. కుష్భు : హృదయ పూర్వక శుభాకాంక్షలు త్రిష. మరింత ఆనందం పొందాలని కోరుకుంటున్నా. తిరు: మీ ఇరువురికి శుభాకాంక్షలు...జీ... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ : హే త్రిషా... శుభాకాంక్షలు. మెలోడీ డాన్సింగ్తో కూడిన శుభాకాంక్షలు. హన్సిక : ప్రేమ పూరిత శుభాకాంక్షలు. మీ నూతన ఆరంభానికి శుభాకాంక్షలు. రాధిక : శుభాకాంక్షలు త్రిష. మీకు వరుణ్మణియన్కు మంచి భవిష్యత్తు అమరాలని కోరుకుంటున్నా. ఛార్మి : ఓ..బేబీ శుభాకాంక్షలు. సంతోషంగా ఉంది. అంటూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు త్రిషకు శుభాభినందనాల వర్షం కురిపిస్తున్నారు. -
కుమార్తెకు రజనీ అభినందనలు
తన కుమార్తె ప్రతిభను జనులు పొగుడుతుండగా, ఆ ఆనందానుభూతిని పొందుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దర్శకురాలు సౌందర్యను అభినందించా రు. కన్న తండ్రి సినిమాకు కుమార్తె దర్శకత్వం చేయడం అనేది అపూర్వమైన, అరుదైన విషయం. అది ఒక అద్భుత ప్రయోగంతో చిత్ర రూపకల్పన చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు అసాధారణ విషయాలను సుసాధ్యం చేశారు. రజనీకాంత్. ఆయన రెండవ కూతురు సౌందర్య. వీరి అద్భుత సృష్టి కోచ్చడయాన్. ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. విజయం అనేది అంత సులభంగా రాదు. దానికి నిరంతర కృషి, పట్టుదల, శ్రమ అవసరం. కోచ్చడయాన్ చిత్రం రూపకల్పన వెనుక ఇవన్నీ ఉన్నాయి. చిత్రం విడుదల తల్లి పురుటి నొప్పులతో సమానం అంటారు. కోచ్చడయాన్ చిత్రం విడుదలకు ముందు చాలా ప్రతి ఘటనలను ఎదుర్కొంది. ఎన్నో వదంతులకు గురైంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితిలో విడుదల తేదీ వాయిదా పడితే చిత్రంపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అలాంటి అవరోధోలను దాటి కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ టాక్‌ను రాబట్టుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్లలో కోచ్చడయాన్ ప్రశంసల పరంపర కొనసాగుతోంది. చిత్ర యూనిట్లో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. ఒక పక్క కోచ్చడయాన్ చిత్రానికి అభినందలు వెల్లువెత్తుతుంటే మరో రజనీకాంత్ ఈ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన తన కూతురు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను, చిత్ర కళాకారులను సాంకేతిక వర్గాన్ని ప్రంశంసించారు. వదంతులను తిప్పికొట్టింది వదంతులను తిప్పికొట్టి అలాంటివి ప్రచారం చేసిన వారికి కోచ్చడయాన్ విజయం సరైన బుద్ధి చెప్పిందని రజనీ అభిమానులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్చడయాన్ బొమ్మల చిత్రం అంటూ ఎద్దేవా చేసిన వారికి చిత్ర విజయమే సమాధా నం చెప్పిం దన్నారు. చెన్నై రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు రామదాస్, రవి, సూర్య తదితరులు విడుదల చేసిన ఈ ప్రకటనలో పేర్కొంటూ తమ తలైవర్ (నాయకుడు) నటించిన కోచ్చడయాన్ విజయం సాధించిందన్నారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు రజనీ కాంత్ అభిమాన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం పైరసీకి గురికాకుండా రజనీ అభిమానులంతా అప్రమత్తంగా ఉండి అలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని కేసీఆర్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుడిమల్ల రవికుమార్, సూరం నర్సింహస్వామి, కార్యవర్గ సభ్యులు గురి, రంజిత్‌కుమార్, ఎన్.వసంతియాదవ్, సురేష్, న్యాయవాదులు ఉన్నారు.


