వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు అందజేయాలంటే..

Convey Your Best Wishes To YS Jagan Mohan Reddy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు వివిధ పద్దతుల్లో అభినందనలు తెలియజేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఘన విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగువారంతా సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సేవా కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ విషెస్‌ జననేతకు చేరాలని ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల శుభాకాంక్షలను వైఎస్‌ జగన్‌కు చేరవేసేందుకు ‘సాక్షి’  సిద్దమైంది.

ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మీ ప్రేమాభిమనాలను కురిపించారు. ఇప్పుడు మీ శుభాకాంక్షలు అందించండి. మీ తరఫున సాక్షి వారికి విషెస్‌ అందిస్తుంది. మరో కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న మీ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మీ సందేశాలను వీడియో లేదా ఆడియో ఫార్మాట్లో రికార్డు చేసి మీ పేరు, ఊరు పేర్కొంటూ 99127 90699 నెంబరుకు వాట్సాప్‌ చేయండి. లేదా సాక్షి దినపత్రికలో పేర్కొన్న విధంగా బాక్స్‌లో మీ శుభాకాంక్షలు రాసి, కత్తిరించి  మీ దగ్గరలోని సాక్షి కార్యాలయంలో కేటాయించిన బాక్స్‌లో వేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top