సాక్షి, తాడేపల్లి: నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎస్పీ బాలుకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో.. చిరస్థాయిగా నిలిచిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి, భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆయన మన తెలుగు జాతికి గర్వకారణం. నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
ఇదీ చదవండి: రెడ్‌బుక్ పాలనలో మరో అంకం..


