హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు రానీయండి | Supreme Court Comments On case of Sai krishna Case | Sakshi
Sakshi News home page

హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు రానీయండి

Sep 25 2026 5:58 AM | Updated on Sep 25 2026 5:58 AM

Supreme Court Comments On case of Sai krishna Case

అవసరమైతే అప్పుడు జోక్యం చేసుకుంటాం 

కాపు యువకుడు సాయికృష్ణ కేసులో సుప్రీంవ్యాఖ్యలు.. అక్టోబర్‌ 26కు తదుపరి విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌కు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన అనంతరం, అవసరమైతే ఈ అంశంపై జోక్యం చేసుకుంటామని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు దోషులు, ఉన్నతాధికారుల పాత్రను తేల్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. 

‘ఏపీ హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ముగింపు దశలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడడం సబబు’ అని వ్యాఖ్యానించింది. అంతక్రితం  విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్‌ గురుమూర్తి తరఫున సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్, న్యాయవాదులు అల్లంకి రమేష్‌, రాళ్ల మమత వాదనలు వినిపిస్తూ, ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సాయికృష్ణ కనిపించకపోవడంపై తల్లి దాఖలుచేసిన హెబియస్‌ కార్పస్, అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement