breaking news
Custodial Death
-
కొట్టి చంపేసి.. బతికున్నట్టు నమ్మించే కిరాతకం
కాపు యువకుడు గాదె సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా పోలీసులు కస్టడీలో ఉంచి చిత్రవధ చేశారు. కొట్టి చంపేసిన తర్వాత కూడా సాయికృష్ణ సజీవంగానే ఉన్నాడని నమ్మించే కిరాతకానికి పాల్పడ్డారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను మార్చేశారు. 18 నెలలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి తమకు ఏమి తెలియనట్లు వ్యవహరించారు.విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విజయవాడ కోర్టుకు సీబీఐ సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్ఐఆర్) సారాంశం ఇదీ!సాక్షి, అమరావతి: ‘కాపు యువకుడు గాదె సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు కస్టడీలో ఉంచి చిత్రవధ చేశారు. కొట్టి చంపేసిన తర్వాత కూడా సాయికృష్ణ సజీవంగానే ఉన్నాడని నమ్మించే కిరాతకానికి పాల్పడ్డారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేశారు.’అని విజయవాడ కోర్టుకు సీబీఐ సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్ఐఆర్)లో స్పష్టం చేసింది. గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ నెల 22న ఆర్సీ 035/2026/ఎస్/0011 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదుతో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రై మ్ నంబర్ 107/2026 కేసు హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి బదిలీ అయిన నేపథ్యంలో అప్పటి సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురిపై సీబీఐ కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీనిపై ఇప్పటికే సిట్ నుంచి సేకరించిన దర్యాప్తు వివరాలు, పలు ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ సీబీఐ విజయవాడ కోర్టుకు 102 పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్లో అనేక అంశాలు ప్రస్తావించింది. సాయికృష్ణను విజయవాడ పోలీసులు తీసుకురావడం దగ్గర్నుంచి జరి గిన పరిణామాలు, విజయవాడ సీపీకి విజయలక్ష్మి రాసిన విన్నపం, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ ఎఫ్ఐఆర్లో సుదీర్ఘంగా వివరించడంతోపాటు వాటికి సంబంధించిన రాతపూర్వక ఆధారాలను కూడా జత చేసింది. కొట్టి చంపి సాక్ష్యాలు లేకుండా చేశారు..సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి పోలీసులు తీవ్రంగా కొట్టడం, అతడి మరణానికి కారణమైన పరిస్థితులు, మృతదేహం ఆచూకీ లేకుండా చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నట్టు సీబీఐ పేర్కొంది. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను మార్చడం, ఫుటేజీ అందుబాటులో లేకుండా చేయడం, సాయికృష్ణ మొబైల్ ఫోన్‌ను ఇతరుల ద్వారా వినియోగించడం లాంటి అంశాలను ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచని పోలీసులుమార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణను 2026 మే 6న తెల్లవారుజామున సుమారు 3 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయని సీబీఐ తెలిపింది. అదే రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి సిబ్బందికి అప్పగించారు. అనంతరం అతడి కస్టడీని అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఎస్వివి నాగరాజుకు అప్పగించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది.చట్టప్రకారం నిర్ణీత గడువులోగా సాయికృష్ణను సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచలేదని, పోలీసుల కస్టడీ నుంచి కూడా విడుదల చేయలేదని దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైనట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే సాయికృష్ణపై దాడి చేసి కొట్టినట్టు విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది. మే 8న పోలీస్‌స్టేషన్‌లోనే సాయికృష్ణను పరీక్షించిన ఆర్ఎంపీ వైద్యుడు అతడి శరీరంపై గాయాలు, వాపులు ఉన్నాయని తెలిపినట్టు సీబీఐ ప్రస్తావించింది. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు ఎందుకు మార్చారు?ఈ కేసులో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ వ్యవస్థ అత్యంత కీలకమని సీబీఐ పేర్కొంది. స్టేషన్‌లోని నెట్వర్క్ వీడియో రికార్డర్ (ఎన్వీఆర్)లోని నాలుగు హార్డ్‌డిస్క్‌లను తొలగించి వాటి స్థానంలో వేరే డిస్క్‌లను అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎఫ్ఐఆర్లో తెలిపింది. సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటుచేసిన అధీకృత సంస్థ ఆ డిస్క్‌లను తాము సరఫరా చేయలేదని, వాటిని మార్చటానికి సంబంధించి తమ అనుమతితో ఎలాంటి పనులు జరగలేదని తెలిపినట్లు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న ఎన్వీఆర్లో సంబంధిత కాలానికి చెందిన ఫుటేజీతో పాటు అంతకుముందు 18 నెలల ఫుటేజీ కూడా అందుబాటులో లేదని ఫోరెన్సిక్ పరిశీలనలో గుర్తించారు. మే 6 నుంచి 9 వరకు సాయికృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయానికి సంబంధించిన దృశ్యాలు లేకుండా చేయడానికే సాక్ష్యాలను మాయం చేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పేర్కొంది. బతికే ఉన్నట్లు నమ్మించే యత్నం..సాయికృష్ణ చనిపోయిన తర్వాత కూడా అతడి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డు వినియోగంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరో వ్యక్తి సాయికృష్ణ ఫోన్, సిమ్‌ను ఉపయోగించి గోవాలో వాటిని యాక్టివేట్ చేసినట్లు సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), టవర్ లొకేషన్ వివరాలు సూచిస్తున్నాయని ఎఫ్ఐఆర్లో సీబీఐ నివేదించింది. మే 30 నుంచి జూన్ 9 వరకు సాయికృష్ణ ఫోన్‌ను గోవాలో వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించారని, తద్వారా సాయికృష్ణ బతికే ఉన్నాడని, పరారీలో ఉన్నాడని నమ్మించే ప్రయత్నం జరిగిందని వెల్లడించింది. అతడి కుటుంబ సభ్యులను రాజీకి ఒప్పించేందుకు ఒత్తిడి చేయడం, బెదిరించడం లాంటి అంశాలనూ దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు.మృతదేహం దహనం చేసినట్లు ఆరోపణలుసాయికృష్ణ మరణించిన తర్వాత మృతదేహాన్ని మాయం చేశారనే ఆరోపణ ఈ కేసులో అత్యంత తీవ్రమైనది. ఈ కేసులో నాలుగో నిందితుడైన గులివిందల సురేష్ ఇచ్చినట్లు పేర్కొన్న వాంగ్మూలం ఆధారంగా మే 12న మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాయికృష్ణ మరణించినట్లు, అనంతరం మృతదేహాన్ని తరలించి పారవేయాలని అప్పటి సీఐ నాగరాజు ఆదేశించినట్లు దర్యాప్తు నివేదికలో ప్రస్తావించారు.మే 12–13 మధ్య రాత్రి మృతదేహాన్ని విజయవాడలోని స్వర్గపురి శ్మశానవాటికకు తీసుకెళ్లి మే 13 అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ 18న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాయికృష్ణను దహనం చేసినట్టు చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించింది. అయితే ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహం, దానికి సంబంధించిన అవశేషాలు లభించలేదని దర్యాప్తు వివరాలను ప్రస్తావించింది. ఏడుగురు నిందితులు.. కీలకంగా మారిన ఆధారాలుసీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అప్పటి కృష్ణలంక సీఐ ఎస్ఎస్వివి నాగరాజుతోపాటు ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్, హోంగార్డు, ఓ ప్రైవేటు వ్యక్తిని నిందితులుగా చేర్చారు. అక్రమ నిర్బంధం, హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల విధ్వంసం, ఎలక్ట్రానిక్ ఆధారాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తికి నష్టం లాంటి ఆరోపణలకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 61(2), 305, 3(5), 103(1), 127(4), 127(6), 238, 316(5) సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ 65, 66, పబ్లిక్, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం పరిరక్షణ యాక్ట్ కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అసలు సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు? అతడి ఫోన్‌ను ఎవరు, ఎందుకు వినియోగించారు? పోలీస్‌స్టేషన్‌లో అతడిని ఎవరు చూశారు? సాయికృష్ణ లాకప్ డెత్ విషయం ఉన్నతాధికారులకు వాస్తవాలు ఎప్పుడు తెలిశాయి? తదితర పలు కీలక ప్రశ్నలకు సీబీఐ దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది.సాయికృష్ణ కేసులో సీబీఐ దూకుడురెండో రోజు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారణసాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్.. లాకప్‌డెత్.. మృతదేహాన్ని మాయం చేసిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ నెల 22న పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు 23న విజయవాడ చేరుకున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం నాటి కృష్ణలంక సీఐ నాగరాజును ఏ 1గా పేర్కొంది. మిగిలిన వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సాయికృష్ణ తల్లి గతంలో పోలీస్ కమిషనర్, కృష్ణలంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు.. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ నరేందర్‌దేవ్ ఆధ్వర్యంలోని బృందం రెండో రోజు కృష్ణలంక పోలీసుస్టేషన్లో విచారణ నిర్వహించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు స్టేషన్‌కు తెచ్చారు? ఎందుకు? ఎక్కడ ఉంచారు? ఎన్ని రోజులు? ఎవరికి అప్పగించారు? ఏ అంతస్తులో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు? లాంటి అంశాలపై క్షుణ్ణంగా విచారిస్తోంది. సాయికృష్ణను లాకప్‌లో తీవ్రంగా కొట్టిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న సమయంలో వారధి సమీపంలోని పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లినట్లు సిట్ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకుని శాంపిల్స్ సేకరించినట్లు తెలిసింది.దాదాపు రెండు గంటలపాటు భవనం పరిసరాలను శోధించి ఆధారాల కోసం గాలించారు. పాడుబడిన భవనాన్ని పరిశీలించిన అనంతరం సీబీఐ బృందం తిరిగి కృష్ణలంక స్టేషన్‌కు చేరుకుని రాత్రి 8.30 గంటల వరకు అన్ని ఫ్లోర్లను నిశితంగా అన్వేషించినట్లు తెలిసింది. స్టేషన్లో కొన్ని రికార్డులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే సిబ్బందిని ఎవరినీ విచారించలేదని తెలిసింది. కాగా సాయికృష్ణ కేసును విచారించిన సిట్ అధికారులు శనివారం స్వర్గపురి వద్దకు చేరుకుని ఆదివారం సీబీఐ అధికారులు అక్కడకు వస్తారని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.ఆ అధికారుల్లో ఆందోళన!దేశవ్యాప్తంగా పెను సంచనలం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేయడంతో ఈ ఘటనతో ప్రమేయం ఉన్న కొందరు పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైంది. సాయికృష్ణను ఎందుకు తీసుకొచ్చారు? ప్రాణాలు పోయేలా ఎందుకు హింసించారు? అనే విషయాలను ఇన్నాళ్లుగా సిట్ తేల్చలేదు. సాయికృష్ణ పోలీసుల దెబ్బలతో మరణించాడని మాత్రమే తేల్చింది. ఎందుకు అంతలా కొట్టారో సిట్ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితులతో పాటు మరికొందరిని సీబీఐ చేర్చుతుందా? సాయికృష్ణ డెడ్‌బాడీని గుట్టుగా దహనం చేయాలనే ఆలోచన ఎవరిది? ఉన్నతాధికారులకు తెలిసే చేశారా? సాయికృష్ణను తేవడంలో ఇతరుల పాత్ర ఉందా? లాంటి అంశాలపై సీబీఐ దృష్టిసారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సాయికృష్ణ కేసు సీబీఐకి..
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఖాకీల కర్కశత్వానికి బలైపోయిన తన కుమారుడి కోసం ఓ తల్లి చేసిన న్యాయ పోరాటం ఫలించింది. కనీసం బూడిద కూడా దొరకుండా తన కుమారుడిని అత్యంత అమానవీయంగా కస్టడీలో దారుణంగా హింసించి చంపేసిన ఘటనపై ఆ తల్లి మొరను హైకోర్టు ఆలకించింది. తన కుమారుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వేడుకుంటూ మృతుడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై రాష్ట్ర పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే అవకాశం లేనే లేదని తేల్చి చెప్పింది. సిట్ విశ్వసనీయతను కూడా తాము శంకిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ కస్టడీ మరణానికి సంబంధించి తక్షణమే కేసు నమోదు చేసేలా చూడాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ దర్యాప్తును సీబీఐకి చెందిన ఒక సీనియర్ అధికారికి అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు బాధ్యులైన అధికారులను గుర్తించడంతోపాటు సాయికృష్ణ తల్లికి రూ.25 లక్షలను నష్టపరిహారంగా చెల్లించాలని చంద్రబాబు సర్కార్‌ను ఆదేశించింది. నేటి నుంచి నాలుగు వారాల్లో ఆ మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేసి తీరాలని తేల్చి చెప్పింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ప్రత్యేక మెసెంజర్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందచేయాలని డీజీపీని ఆదేశించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు కారణమైన అధికారులపై సర్వీసు నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం శుక్రవారం 89 పేజీల సంచలన తీర్పు వెలువరించింది.పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..‘కోర్టుకు సమర్పించిన రికార్డుల్లోని ఆధారాలు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం.. మృతుడు సాయికృష్ణని 06.05.2026 ఉదయం సుమారు 7 గంటలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మొదట స్టేషన్ సెంట్రీకి, ఆ తర్వాత అతడిని మొబైల్ ఫోన్‌తో సహా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమైనదే అయినప్పటికీ, బీఎన్ఎస్ఎస్ చట్టం కింద నిర్దేశించిన వ్యవధి లోపు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం లేదు. అదే సమయంలో అతడిని కస్టడీ నుంచి విడుదల కూడా చేయలేదు. తద్వారా పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది’ అని ధర్మాసనం పేర్కొంది.పోలీసుల దారుణ హింస వల్లే చనిపోయాడు...‘అంతేకాకుండా విచారణ సమయంలో సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ, డిజిటల్ ఆధారాల ప్రకారం మృతుడు చట్టం అనుమతించిన పరిమితికి మించి పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. కస్టడీలో సాయికృష్ణపై హింస జరిగిందని, తద్వారా అతడికి స్పష్టంగా కనిపించే గాయాలయ్యాయని తేలింది. అతడు చివరిసారిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సజీవంగా కనిపించాడు. కస్టడీలో దారుణ హింస కారణంగా తీవ్రమైన గాయాల పాలై మరణించాడు. విచారణలో తేలిన విషయమేమిటంటే.. 19.06.2026న కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఎన్వీఆర్ ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశీలనలో సాయికృష్ణ కస్టడీలో ఉన్న కీలక సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు, దానికి ముందు ఉన్న 18 నెలల ఫుటేజ్ కూడా అందుబాటులో లేదని తేలింది. ఇది ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా పూర్తిగా నాశనం చేయడాన్ని స్పష్టంగా సూచిస్తోంది.’ అని ధర్మాసనం తేల్చింది.మృతదేహం గురించి కూడా సిట్ తెలుసుకోలేకపోయింది..‘08.05.2026 నుంచి 26.05.2026 మధ్య కాలంలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తులు, గుర్తుతెలియని శవాలకు సంబంధించిన వివరాలను ప్రైవేటు ఆసుపత్రుల రికార్డులతో సహా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల వల్ల సాయికృష్ణ మృతదేహాన్ని గుర్తించడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ కోర్టుకు సిట్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లోని 14వ పేరా ప్రకారం సాక్షుల విచారణలో భాగంగా సాయికృష్ణకు లాకప్‌లో చికిత్స అందించిన ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను విచారించారు. 08.05.2026న అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణను పరీక్షించారు. అతని శరీరంపై అనేక చోట్ల గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బంది తనపై దాడి చేసినట్లు మృతుడు స్వయంగా తనకు వెల్లడించారని ఆ డాక్టర్ దర్యాప్తు అధికారులకు చెప్పారు’ అని తీర్పులో ధర్మాసనం ప్రస్తావించింది.ఆధారాలన్నీ కస్టోడియల్ డెత్‌గా నిర్ధారిస్తున్నాయి...‘మృతుడి కస్టడీ, అతడి శారీరక స్థితి, ఆ తర్వాత వేరొక వ్యక్తి అతడి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేలా పోలీసులు చేయడం... నేరం జరిగిన గది రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు లాంటి కీలక అంశాలను, సాంకేతిక, మెడికల్, ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ధ్రువీకరించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలను కూడా ఇవి ప్రాథమికంగా రుజువు చేస్తున్నాయి. వీటన్నింటి ఆధారంగా సాయికృష్ణది పోలీసుల కస్టడీలో జరిగిన మరణంగా తేలింది.అంతే కాదు అతడి మృతదేహం లేదా దాని అవశేషాలు ఇంకా లభించలేదని కూడా నిర్ధారణ అయింది. కోర్టు ముందున్న ఆధారాలు.. సాయికృష్ణ కస్టడీ హింసకు గురయ్యాడని, పోలీసు కస్టడీలోనే మరణం సంభవించిందని, మృతదేహాన్ని కూడా మాయం చేశారని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని పిటిషనర్ విజయలక్ష్మీకి తెలియజేయలేదు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 22(1), (2) కింద సాయికృష్ణకు లభించిన ప్రాథమిక హక్కును హరించడమే’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.సీబీఐ దర్యాప్తునకు ఆదేశించదగ్గ అసాధారణ పరిస్థితులున్నాయి...‘ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఆదేశించడానికి తగ్గ అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. వాటి విషయంలో మేం సంతృప్తి చెందాం. ఇది కస్టడీ హింస, కస్టడీ మరణానికి సంబంధించిన కేసు. ఈ కేసులో పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. పిటిషనర్ విజయలక్ష్మీ (సాయికృష్ణ తల్లి) హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఒరిజినల్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను తొలగించి వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్క్‌లను ఉంచినట్లు స్పష్టమవుతోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో హింసించడం, తద్వారా అతడి మరణం, అనంతరం మృతదేహాన్ని మాయడం చేయడానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడం, మాయం చేసే ఉద్దేశంతోనే హార్డ్‌డిస్క్‌ల మార్పిడి జరిగింది. సాయికృష్ణ జీవించి ఉన్నప్పుడే పరారైనట్లు చిత్రీకరించేందుకు, నేరం జరిగిన గది రూపురేఖలను మార్చడానికి, మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. సిట్ దర్యాప్తు పక్షపాతంగా ఉండే అవకాశం ఉండటంతో బాధితుడి కుటుంబంలో, సమాజంలో పలు అనుమానాలు కలుగుతాయి. విరుద్ధ ప్రయోజనాలు ఉన్నందున రాష్ట్ర పోలీసుల చేతుల్లో నిష్పాక్షికమైన విచారణ జరగడం అసాధ్యం. ఈ నేపథ్యంలో సిట్ విశ్వసనీయతను శంకించాల్సి వస్తోంది’ అని ధర్మాసనం తన తీర్పులో ప్రముఖంగా పేర్కొంది.కస్టడీ మరణాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం కోర్టుల బాధ్యత...‘తగిన కేసులలో ప్రత్యేకించి పోలీసు కస్టడీలో.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, కస్టడీ హింస, పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సంభవించే కస్టడీ మరణాల వంటి కేసులలో సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం, పరిధి, రాజ్యాంగపరమైన విధి, బాధ్యత ఈ కోర్టుకు ఉంది. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర కూడా విస్మరించలేం. బాధితుడి ప్రయోజనాలతో పాటు దర్యాప్తుపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించడం. చట్టబద్ధమైన పాలనను కాపాడటమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. తద్వారా నిష్పాక్షిక, పక్షపాతరహిత దర్యాప్తు సాధ్యమవుతుంది. నిష్పాక్షిక విచారణ పొందే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. నిష్పాక్షిక విచారణలో నిష్పాక్షిక దర్యాప్తు కూడా ఒక భాగం. న్యాయస్థానం ఎల్లప్పుడూ సత్యం, న్యాయం కోసం జరిగే అన్వేషణలో భాగస్వామిగా ఉండాలి. న్యాయ వ్యవస్థ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడటానికి, ప్రజల్లో విశ్వాసాన్ని నింపడానికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఇది అత్యంత ఆవశ్యకం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.నిష్పాక్షిక దర్యాప్తు బాధితుల హక్కు...‘అధికరణ 226 కింద కోర్టుకున్న అధికారం అత్యంత అసాధారణమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రకమైన అధికారాన్ని ఉపయోగించడంలో గణనీయమైన స్వీయ నియంత్రణ ఉండాలి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అనేది చాలా అరుదుగా, జాగ్రత్తగా, కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే జరగాలి. పక్షపాతం లేని, నిష్పాక్షిక దర్యాప్తు పొందే ప్రాథమిక హక్కు బాధితులకు ఉంది. తీవ్రమైన నేరం జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వొచ్చు’ అని హైకోర్టు పేర్కొంది.చార్జిషీట్ దాఖలు సీబీఐ దర్యాప్తునకు అడ్డంకి కాదు..‘సిట్ ఇప్పటికే ఏర్పాటైందని, పారదర్శకతతో కూడిన సమగ్ర దర్యాప్తు జరిపిందని, దానిని ప్రశ్నించడానికి లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఛార్జిషీట్ కూడా దాఖలు చేశామని, అందువల్ల సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదిస్తున్నారు. అయితే తగిన కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఛార్జిషీట్ దాఖలు ఎంత మాత్రం అడ్డంకి కాదు. నిష్పాక్షిక దర్యాప్తుపై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టడానికి, తద్వారా ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి, చట్టబద్ధమైన పాలనను కాపాడటానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వొచ్చు’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.పోలీసులపైనే ఆరోపణలున్నాయి.. అందుకే సీబీఐ దర్యాప్తు అనివార్యం...‘రుబాబుద్దీన్ షేక్ కేసులో ఛార్జిషీట్ సమర్పించినప్పటికీ నేరానికి పాల్పడింది ఏ మూడో వ్యక్తి కాకుండా స్వయంగా పోలీసు సిబ్బందే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. ‘న్యాయం జరగడం మాత్రమే కాక, న్యాయం జరిగినట్లు స్పష్టంగా కనిపించాలి’ అనే సూత్రానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరారోపణలు ప్రభుత్వాధికారులపైనే ఉన్నప్పుడు.. బాధితులతో పాటు ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే సరైన చర్య అవుతుంది. వీటన్నింటి దృష్ట్యా సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అనివార్యం’ అని జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం పేర్కొంది.పౌరుల హక్కులను ప్రభుత్వాధికారులు హరిస్తే.. పరిహారం ఇవ్వాల్సిందే‘రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాధికారులు హరించినప్పుడు, దానికి పరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని ఆదేశించడమే సరైన, సమర్థవంతమైన పరిష్కారం. కస్టడీ మరణం, కస్టడీ హింస లేదా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన నిరూపితమైన సందర్భాలలో ఈ కోర్టు అధికరణ 226 కింద విచారణ జరిపి పరిహారం మంజూరు చేయవచ్చు. ప్రాథమిక హక్కులు ఖైదీకి కూడా అందుబాటులోనే ఉంటాయి. ఆ హక్కులను ఎవరూ రద్దు చేయలేరు. శిక్ష అనుభవిస్తున్న లేదా విచారణలో ఉన్న ఖైదీ ఎవరైనా సరే జైలులో ఉంచినంత మాత్రాన వారు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిని కూడా అతని ప్రాథమిక హక్కుల నుండి వేరు చేయలేరు. అటువంటి వ్యక్తి అసాధారణ మరణానికి గురైతే అతని కుటుంబీకులకు పరిహారం అందించాలి. కస్టడీ హింస లేదా మరణానికి గురైన బాధితుడు ఒక నేరంలో నిందితుడైనంత మాత్రాన అతని కుటుంబానికి పరిహారం నిరాకరించలేరు. ఇటీవల లహ్రా బాయి తామ్రే వర్సెస్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కేసులో కస్టడీ మరణం సంభవించినందున తాత్కాలిక ఉపశమనంగా రూ. 25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే తీర్పును మేం ఇక్కడ కూడా అనుసరిస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.‘‘రాష్ట్ర పోలీసుల చేతుల్లో నిష్పాక్షికమైన విచారణ జరగడం అసాధ్యం.. సిట్ విశ్వసనీయతను శంకించాల్సి వస్తోంది..’’‘‘కస్టడీలో జరిగే హింస, వేధింపులు, లాకప్‌లలో సంభవించే మరణాలు చట్టబద్ధమైన పాలనకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. పౌరులను కాపాడవలసిన పోలీసు సిబ్బందే వేటగాళ్లుగా మారి ఇటువంటి చర్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది’’‘‘కస్టడీ వేధింపులు అనేవి మానవ ఆత్మగౌరవానికి బహిరంగ విఘాతమే కాదు తీవ్రమైన అవమానం కూడా. అది వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. గౌరవానికి భంగం కలిగితే మానవ నాగరికత ఒక అడుగు దిగజారినట్లే (డి.కె. బసు కేసు తీర్పును పునరుద్ఘాటిస్తూ..)’’ – సాయికృష్ణ కేసులో హైకోర్టు వ్యాఖ్యలుసాయికృష్ణ కేసులో హైకోర్టు తీర్పు బాబు సర్కారుకు చెంపపెట్టు» సీబీఐ విచారణను స్వాగతించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ » తన ప్రభుత్వ బాధ్యత నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకోలేరు » డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్రపైనా విచారణ జరగాలి »బాధ్యులందరికీ శిక్ష పడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటాం సాక్షి, అమరావతి: విజయవాడలో పోలీస్ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని చంద్రబాబు సర్కారును ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు అని పేర్కొన్నారు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారని, పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని.. డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు.. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు.వాస్తవాలు వెలికి తీయాలి..సాయికృష్ణ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవరి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే.. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం అండగా నిలబడతాం. -
లాకప్ హత్యపై భేషైన తీర్పు!
ఎన్డీయే కూటమి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ చిత్రహింసల కొలిమిగా మారిన నేపథ్యంలో మొన్న మే నెలలో పోలీసు యమకింకరుల చేతుల్లోబడి మాయమైన 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశం హర్షించదగింది. దీంతోపాటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి నాలుగు వారాల్లోపు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. కాపుల మద్దతు పుష్కలంగా ఉన్నదని చెప్పుకునే జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ అదే కులానికి చెందిన యువకుణ్ణి విజయవాడ కృష్ణలంక పోలీసులు లాకప్‌లో కొట్టి చంపి, బూడిద కూడా మిగలకుండా చేశారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన కుమారుణ్ణి మొన్న మే నెల మొదటి వారంలో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా హింసిస్తున్నారని తెలిసి, రోజుల తరబడి తల్లి స్టేషన్ చుట్టూ తిరిగారు. పోలీసు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ క్రమంలో ఒకరోజు సాయికృష్ణ ఆర్తనాదాలు వినబడి పరుగున వెనక్కివెళ్లి విలపించారు. అయినా వాళ్లు కనికరించలేదు. ‘కనీసం బూడిదైనా ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటాం...’ అని అడిగినా జవాబిచ్చే దిక్కులేదు. చివరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే... ఆ తల్లిని ఏమార్చటానికి కోర్టు వెలుపల ఎన్ని ప్రయత్నాలు జరిగాయో జనమంతా చూశారు. ఏపీ పోలీసులకేమైంది? కొట్టి చంపి, శవాన్ని మాయం చేసేంత అపరాధం ఆ యువకుడు ఏం చేశాడు? చట్టప్రకారం అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో సమీప మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాలి. కానీ బాబు ఏలుబడిలో ఇది సక్రమంగా అమలైంది లేదు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపైనా, నాయకులపైనా అక్రమ కేసులు పెట్టిఅరెస్టు చేయడం, రోజుల తరబడి అక్రమ నిర్బంధంలో ఉంచటం, బెయిలొస్తే వేరే కేసులో తిరిగి నిర్బంధంలోకి తీసుకోవటం రివాజుగా మారింది. చివరకు కూటమి పాలన అవకతవకలపై పోస్టులు పెట్టే సాధారణ జనాన్ని కూడా వదలడం లేదు. వేలమందిగూండాలనూ, రౌడీలనూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులకు పంపడం, చేయాల్సిన విధ్వంసమంతా పూర్తయ్యాక పోలీసులు బాధితులనే అరెస్టుచేయడంబాబు తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయం. ఈ వాతావరణమే పోలీసులకు ధైర్యాన్నిచ్చింది. తమను అడిగేవాడు లేడని విర్రవీగే స్థాయికి చేర్చింది. వాస్తవానికి పోలీసు ఆగడాలకు బలైంది సాయికృష్ణ మాత్రమే కాదు... వారి చిత్రహింసలకు తాళలేక తనువు చాలిస్తున్నానంటూ దళిత యువకుడు క్రాంతికుమార్ వీడియోలో ప్రకటించి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందూ, ఆ తర్వాతా గంగమ్మ, తిరుపతమ్మ అనే మహిళల్ని సైతం లాకప్‌లో కొట్టి చంపినట్టు ఆరోపణలొచ్చాయి. మరో మహిళ కళావతి కూడా వీరి వేధింపులవల్లే ఆత్మహత్య చేసుకున్నదని కథనాలు వచ్చాయి. ఇలా పలువురు మరణించిన సందర్భాలున్న నేపథ్యంలో కేవలం సాయికృష్ణ అదృశ్యంపై సీబీఐ దర్యాప్తు చేస్తే సరిపోదు. మిగిలిన కేసుల్ని సైతం ఈ దర్యాప్తు పరిధిలోకి చేర్చాలి. అప్పుడు మాత్రమే ఈ ధోరణి కాస్తయినా తగ్గుతుంది. నారా వారి ఏలుబడి ముందూ మునుపూ కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో నక్సలైట్లను అణచే పేరిట తెలంగాణ పల్లెల్లో యువకుల్ని మాయం చేయటం, ఎన్కౌంటర్లలో హతమార్చటం, చట్టబద్ధమైన ఉద్యమాలపై కత్తిగట్టి ప్రైవేటు ముఠాల్ని ప్రోత్సహించి హత్యలు చేయించటం ఆ కాలంలో నిత్యకృత్యం. ఈ ప్రతీకార వాతావరణంలోనే అలిపిరి దగ్గర చంద్రబాబుపై హత్యాయత్నం జరిగింది. చిత్రమేమంటే దీనివల్ల సానుభూతి వెల్లువెత్తుతుందని భ్రమించి ఎన్నికలకు పోతే జనం టీడీపీని మాత్రమే కాదు... జాతీయ స్థాయిలో టోకున ఎన్డీయే కూటమిని చిత్తుగా ఓడించారు. ‘పీడకు పిశాచం తోడైనట్టు...’ ఇప్పుడు కొడుకు చేతికందిరావటంతో ఆ అరాచకాలు మరిన్నిరెట్లు పెరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గురుమూర్తి ఈ కేసుకు సంబంధించిదాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గత నెలలో ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు వేగవంతంగా పూర్తయి దోషులకు కఠిన శిక్షలు పడితేనేఈ మాదిరి అరాచకాలు ఆగుతాయి. -
హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు రానీయండి
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన అనంతరం, అవసరమైతే ఈ అంశంపై జోక్యం చేసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు దోషులు, ఉన్నతాధికారుల పాత్రను తేల్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీ హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ముగింపు దశలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడడం సబబు’ అని వ్యాఖ్యానించింది. అంతక్రితం విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్, న్యాయవాదులు అల్లంకి రమేష్, రాళ్ల మమత వాదనలు వినిపిస్తూ, ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సాయికృష్ణ కనిపించకపోవడంపై తల్లి దాఖలుచేసిన హెబియస్ కార్పస్, అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
నిజమేంటో తేలుస్తాం!.. లాకప్‌డెత్ కేసుపై సుప్రీంకోర్టు సీరియస్
పోలీస్ స్టేషన్లో ఏకంగా నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? గాఢంగా నిద్రపోతున్నారా? కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే మే 28న బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా జూన్ 19 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఈ అసాధారణ జాప్యమే ఏం జరిగిందో స్పష్టంగా చెబుతోంది. ఒక సాధారణ నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయడానికి స్థానిక పోలీసులు కాకుండా, ఏకంగా కమిషనర్ పరిధిలో పనిచేసే టాస్క్‌ఫోర్స్ బృందం ఎందుకు వెళ్లింది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై నెపం నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకోలేరు. ఈ వ్యవహారంలో పై అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే. పోలీసు కస్టడీలో ఓ పౌరుడు మృతి చెందడం ముమ్మాటికీ చట్టవ్యతిరేక చర్యే. ఈ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఇంప్లీడ్ చేస్తాం. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. తదుపరి విచారణలో సీబీఐని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చే విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటాం.ఈ లాకప్‌డెత్ కేసు విచారణను ఇకపై నేరుగా మేమే పర్యవేక్షిస్తాం. ఏపీ హైకోర్టులో డీజీపీ, సీపీ, ఏసీపీ దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల స్థితిగతులను తెలుసుకుని మాకు చెప్పాలి.సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపేసి, గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తగలబెట్టేసి, కనీసం చితాభస్మం కూడా దక్కకుండా చేసిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, సౌత్ జోన్ ఏసీపీ మానస పాత్రపై సమగ్ర విచారణ జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లాకప్‌డెత్ వ్యవహారంలో వారి పాత్ర ఏంటో తేలుస్తామంది. ఇంత పెద్ద ఘాతుకానికి కింది స్థాయి అధికారులే బాధ్యులని చెప్పి, తప్పును వారిపై నెట్టేస్తారా అని ప్రశ్నించింది. అలా నెట్టేసినంత మాత్రాన ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏదో తీవ్రమైన తప్పిదం జరిగినట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఉన్నతాధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. కేవలం కింది స్థాయి అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదంది. ఈ లాకప్ డెత్ విషయంలో నిజా నిజాలను నిగ్గు తేలుస్తామని స్పష్టం చేసింది. నెల రోజులు సీసీకెమెరాలు పనిచేయకపోతే నిద్రపోతున్నారా? పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఓ పౌరుడు ఇప్పటి వరకు కనిపించలేదంటే, ఇంత కన్నా తీవ్రమైన చట్ట ఉల్లంఘన ఏదీ ఉండదని తేల్చి చెప్పింది. అంతేకాక ఇది ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమైన చర్యేనని వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్లో నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే నిద్రపోతున్నారా? అంటూ ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగింది. కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సుదీర్ఘ జాప్యం ఎందుకు జరిగింది? అని వారిని నిలదీసింది. మే 28న సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే, జూన్ 19 వరకు కేసు నమోదు చేయలేదని, ఈ అసాధారణ జాప్యమే ఏం జరిగిందో స్పష్టంగా చెబుతోందని వ్యాఖ్యానించింది. ఇకపై ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని తెలిపింది. ఇదే సమయంలో ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కూడా సుప్రీంకోర్టు ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ వ్యాజ్యాలన్నీ మేమే విచారిస్తాం.. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ మానస తదితరుల పాత్ర ఉందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కింది కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మూడు వ్యాజ్యాలను తమకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఎవరెవరు పిటిషన్లు వేశారు.. వాటి స్థితిగతులు ఏంటి? అన్న వివరాలపై స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లకు సంబంధించిన స్థితిగతులను కూడా తెలియచేయాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం మొదటి కేసుగా దీనిని విచారిస్తామని తెలిపింది. ఇదే సమయంలో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ నెలాఖరు లోపు తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. అంతేకాక గురుమూర్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఉన్నతాధికారులపై ఎంపీ గురుమూర్తి న్యాయ పోరాటం... కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి విజయవాడ రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సాయికృష్ణ అక్రమ నిర్భంధం, లాకప్ డెత్, మృతదేహం, చితాభస్మం మాయం చేసిన వ్యవహారంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసల పాత్ర ఉందని, వారికి అన్ని విషయాలు తెలుసునని, అందువల్ల వారిని నిందితులుగా చేర్చాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు, ఫిర్యాదిదారు అయిన గురుమూర్తిని వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఆదేశించింది. అలాగే ఆ రోజున సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదు చేస్తామని తెలిపింది. విజయవాడ కోర్టు నిర్ణయంతో కంగుతిన్న ముగ్గురు అధికారులు... విజయవాడ కోర్టు నిర్ణయంతో డీజీపీ, విజయవాడ కమిషనర్, ఏసీపీలు కంగుతిన్నారు. వాంగ్మూలాలు నమోదు చేస్తే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని భావించిన ఈ ముగ్గురు ఉన్నతాధికారులు కూడా విజయవాడ కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ గత ఆగస్టు 13న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన గురుమూర్తి హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ గురుమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ వాదనలు వినిపించారు. అందరూ కలిసి సాయికృష్ణను చంపేశారు... పిటిషనర్ ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓ పాత కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) అమలు పేరుతో మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురంలో టాస్‌్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్‌బీడబ్లు్య ఉత్తర్వులను అమలు చేయాల్సింది స్థానిక పోలీసులు. ఇందులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. అయితే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు పరిధిలో పనిచేస్తున్న టాస్‌్కఫోర్స్ సిబ్బంది సాయికృష్ణను పట్టుకొచ్చారు. కృష్ణలంక ఇన్స్పెక్టర్కు అప్పగించారు. సాయికృష్ణను నిబంధనల ప్రకారం కోర్టు ముందు హాజరుపరచలేదు. ఆ తరువాత ఆ యువకుడు ఏం అయ్యారో ఎవరికీ తెలియదు. స్టేషన్లోనే చిత్రహింసలు పెట్టి హత్య చేసి, శవాన్ని తగులబెట్టేశారు. కనీసం చితాభస్మం కూడా లేకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు.’ అని గోయల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తప్పు చేయకుంటే..హైకోర్టుకెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నట్లు..? ‘మే 28న బాధిత యువకుడి తల్లి నేరుగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. పోరాటం చేయగా చేయగా, జూన్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉన్నతస్థాయి అధికారుల ఆమోదం లేకుండా ఓ వ్యక్తిని చంపేసి, కాల్చేసి, చితాభస్మం కూడా లేకుండా చేసే ధైర్యం కింది స్థాయి అధికారులకు ఉండే అవకాశమే లేదు. అంతా కూడా డీజీపీ, విజయవాడ కమిషనర్, సౌత్ ఏసీపీలకు తెలిసే జరిగింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విజయవాడ కోర్టు నిర్ణయిస్తే, దానిపై ఈ ముగ్గురు కూడా హైకోర్టుకెళ్లి మొత్తం ప్రక్రియను ఆపేయించారు. తప్పు చేయకుంటే హైకోర్టుకెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారు? న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం సడలకుండా ఉండాలంటే ఈ ముగ్గురు అధికారుల పాత్రపై ఈ కోర్టు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.’ అని గోయల్ ధర్మాసనానికి వివరించారు. సాయికృష్ణ ఆచూకీ తెలియదని హైకోర్టునే తప్పుదోవ పట్టించారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి గాదె విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో జూన్ 4న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు పోలీసుల వివరణ కోరింది. సాయికృష్ణ ఆచూకీ తెలియదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామంటూ పోలీసులు హైకోర్టునే తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. ఇవన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారుల పాత్రను సూచిస్తున్నాయి. కేవలం దిగువ స్థాయి పోలీసులపైనే చర్యలు తీసుకుని ఉన్నతాధికారులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది.’ అని గోయల్ కోర్టుకు తెలియచేశారు. సిట్ ఏర్పాటు చేశాం... రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఎస్హెచ్ఓగా ఉన్న ప్రధాన నిందితుడైన కృష్ణలంక ఇన్స్పెక్టర్తో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు, మరో ప్రైవేట్ వ్యక్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపాం. చార్జిషీట్ కూడా దాఖలు చేశాం. సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనలో కింది స్థాయి అధికారులదే పూర్తి బాధ్యత. ఉన్నతస్థాయి అధికారుల ప్రమేయం ఏమీ లేదు‘ అని వాదించారు.హైకోర్టు విచారణపై స్టే.. గురుమూర్తి ఫిర్యాదు మేరకు విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను తమకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ కేసుల రికార్డులను వెంటనే తమ రిజిస్ట్రీకి పంపాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ముగిసే వరకు ముగ్గురు ఉన్నతాధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఎలాంటి విచారణ జరపరాదని ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు విచారణపై స్టే విధించింది. లాకప్‌డెత్ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు, ఇతర రికార్డులన్నింటినీ ఈనెల 30లోపు సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. గురుమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసలకు నోటీసులు జారీ చేసింది.సీబీఐని ప్రతివాదిగా చేరుస్తాం... ఈ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఇంప్లీడ్ చేస్తామంది. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణలో సీబీఐని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చే విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.ఇకపై సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును మేమే పర్యవేక్షిస్తాం... ఈ లాకప్‌డెత్ కేసు విచారణను ఇకపై నేరుగా తామే పర్యవేక్షిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టులో డీజీపీ, సీపీ, ఏసీపీ దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల స్థితిగతులను తెలుసుకుని తమకు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసిందని సిద్దార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. తమ ముందు ఉన్నతాధికారులపై పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ (సాయికృష్ణ తల్లి) వేర్వేరు వ్యక్తులు కదా అని ప్రశ్నించింది. ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలతో స్టేటస్ రిపోర్టును గురువారం ఉదయం 10.30 గంటల కల్లా తమ ముందు ఉంచాలని పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఉన్నతాధికారులను బాధ్యులను చేయరాదని రోహత్గీ వాదన ఉన్నతాధికారుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ‘పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎస్హెచ్ఓ, ఇతర కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పులకు డీజీపీ, సీపీ స్థాయి ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం సరికాదు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనడం చట్టవిరుద్ధం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదు.’ అని తెలిపారు. మరి సీసీ కెమెరాలు పనిచేయకపోతే గాఢంగా నిద్రపోతున్నారా?ఈ వాదనలపై త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లో ఏకంగా నెల రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వీరంతా గాఢంగా నిద్రపోతున్నారా?‘ అని కోర్టు నిలదీసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతే మే 28న బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా జూన్ 19 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఒక సాధారణ నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయడానికి స్థానిక పోలీసులు కాకుండా, ఏకంగా కమిషనర్ పరిధిలో పనిచేసే టాస్‌్కఫోర్స్ బృందం ఎందుకు వెళ్లింది. కేవలం కింది స్థాయి సిబ్బంది (ఇన్స్పెక్టర్ తదితరులు)పై నెపం నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకోలేరంది. ఈ వ్యవహారంలో పై అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసు కస్టడీలో ఓ పౌరుడు మృతి చెందడం ముమ్మాటికీ చట్టవ్యతిరేక చర్యేనని మండిపడింది. -
రాణీగారి తోటలో చంపేశారు
విజయవాడ లీగల్: కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. విజయవాడ రాణీగారితోటలోని పాడుబడిన భవనంలో సాయికృష్ణను దారుణంగా కొట్టి చంపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. తనను చంపేందుకే కొడుతున్నారని సాయికృష్ణ తీవ్ర గాయాలతో దయనీయంగా వాపోయినప్పటికీ నిందితులు కనికరం చూపలేదని స్పష్టమైంది. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్‌పై శ్మశానవాటికకు తరలించి దహనం చేశారని, మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు ప్రధాన నిందితుడు సీఐ నాగరాజుతో సహా నిందితులు అందరూ అక్కడే ఉన్నారని వెల్లడైంది. అరెస్టయిన ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న విస్తుపోయే సంచలన అంశాలు... ‘మే 7న పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని దారుణంగా సాయికృష్ణను కొట్టారు. గాయాలపాలైన సాయికృష్ణను సీఐ నాగరాజు ఆదేశాలతో రాణిగారి తోటలోని పాత పాడుబడిన భవనానికి తరలించారు. మే 12న సీఐని కలవడానికి వెళ్లిన తాను రాణీగారితోట పాత భవనంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సాయికృష్ణను చూసినట్లు ఏ4 సురేష్ పేర్కొన్నాడు. తనను చంపేందుకే కొడుతున్నారని సాయికృష్ణ తీవ్ర గాయాలతో దయనీయస్థితిలో తనకు చెప్పినట్లు కూడా వెల్లడించాడు. సురేష్ తో మాట్లాడుతున్న సమయంలోనే సాయికృష్ణ స్పృహతప్పి పడిపోయి మరణించాడు. మే 12న అర్ధరాత్రి సాయికృష్ణ మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై దుప్పట్లో చుట్టి స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, సురేష్ కలిసి దహనం చేశారు. మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు వారు స్వర్గపురిలో ఉన్నారు. మే 18న సురేష్ స్వర్గపురికి వెళ్ళి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా? అని పరిశీలించి వచ్చాడు. సీఐ నాగరాజు ఆదేశాలతోనే సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను డిలీట్ చేశాడు. సురేష్ సీఐ నాగరాజుతో కలిసి నైట్రౌండ్స్కు కూడా వెళ్లేవాడు. నాగరాజుతో సురేష్ కు 2010 నుంచి పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య సన్నిహిత స్నేహం ఉంది. హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని బాధితుడి బంధువులను కూడా నిందితులు బెదిరించి ప్రలోభపెట్టారని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్‌ను సురేష్ సంప్రదించి రాజీకి ప్రయత్నించాడు. మే 31న కొలనుకొండ గ్రామంలోని మోడల్ డెయిరీ వద్ద నవరంగ్‌ను సురేష్ కలిసి మాట్లాడారు. పరిహారంపై మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే నవరంగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కేసు నమోదు, ఎ–1 అరెస్టు అనంతరం సురేష్ , ఎ–2, ఎ–3 కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లారు. తన మొబైల్ ఫోన్ ద్వారా పోలీసులు తన ఆచూకీ తెలుసుకోకుండా ఉండేందుకు దానిని మార్గమధ్యంలో కాలువలో పడేసినట్లు సురేష్ వెల్లడించాడు. సెపె్టంబర్ 18న సురేష్ ను రాణిగారితోటలోని పాత భవనం వద్దకు తీసుకెళ్లగా, సాయికృష్ణను ఉంచిన ప్రదేశాన్ని అతడు గుర్తించాడు. అనంతరం స్వర్గపురి శ్మశానవాటికలోని కలప దహన ప్రాంతంలో మృతదేహాన్ని దహనం చేసినట్లు సురేష్ గుర్తించాడు. సురేష్ ఇచ్చిన సమాచారంతో రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సురేష్ వెల్లడించిన వివరాలకు కాల్ డీటైల్ రికార్డులు , సాంకేతిక విశ్లేషణ, సంబంధిత కాలంలో ఎ–1, ఎ–2, ఎ–4 మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, అలాగే మోడల్ డెయిరీ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ సాయికృష్ణను స్టేషన్లోనే కొట్టి చంపారనే అభిప్రాయం ఉండగా, ఇప్పుడు ఒక పాడుపడిన భవనంలో చంపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.రిమాండ్‌కు సురేష్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మూడు నెలలుగా పరారీలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ–4 గులివిందల సురేష్ ను సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ కావడంతో సిట్ ఎదుట లొంగిపోయిన సురేష్ ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అనంతరం 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ కోర్టులో ప్రవేశ పెట్టారు. సాక్షులను ప్రభావితం చేయకుండా నిందితుడికి రిమాండ్ విధించాలని కోరారు. దీంతో ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ ఎస్.శ్రీకాంత్ నిందితునికి సెపె్టంబర్ 24 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని నూజివీడు జైలుకు తరలించారు. -
ఈ ప్రశ్నలకు బదులేది..?
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్్క ఫోర్స్ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు. వారెంట్ పెండింగ్ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్‌డెత్) మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్‌పై డెడ్‌బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు. సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్లో ఆర్ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్‌లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది. సమాధానాలు లేని ప్రశ్నలు... సిట్ చేస్తున్న విచారణ తీరును చూస్తే కేవలం సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల అరెస్టులతో సరిపెట్టేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కేసులో సీఐ స్నేహితుడు సురేష్ హస్తం ఉందని ముందునుంచే వార్తలు వస్తున్నప్పుడు అతను అదృశ్యం అయ్యే వరకూ పోలీసులు ఎందుకు వేచి ఉన్నారు. ఈ కేసులో ఉన్న కానిస్టేబుళ్లు పరారీలో ఉన్న సమయంలో డబ్బుల కోసం తమ ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశామని కట్టుకథ చెబితే దాన్ని ఎందుకు ఛేదించలేదు. పోయిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బాధితులకు ఇస్తున్న తరుణంలో పోలీసు కానిస్టేబుళ్లు అమ్మేసిన ఫోన్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు. సిట్ ఇప్పటివరకూ ఈ కేసుపై అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు. అసలు సాయికృష్ణ ఏమయ్యాడో తేల్చేందుకు మరెన్ని రోజులు కావాలి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఇప్పటికే బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. కేసును కాలయాపన చేస్తూ నీరుగార్చి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తారా? అసలు ఈ కేసులో ఉన్న పెద్దల్ని ఎందుకు కాపాడుతున్నారు. దీని వెనుక ఏ వ్యవహారం ఉందన్న విషయంపై ఎందుకు విచారణ జరపడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు సాయికృష్ణ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసినప్పటి నుంచి జరుగుతున్నట్లు స్వయంగా సాయికృష్ణ పిన్ని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాయికృష్ణ తల్లితో హెబియస్ కార్పస్ పిటీషన్ విత్‌డ్రా చేసేందుకు పిటీషన్ కూడా వేయించిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఒక హోంగార్డు మాయం చేశాడని నెపం అతనిపై వేసేశారు. పోలీస్‌స్టేషన్ సీసీ ఫుటేజ్ సరే.. ఆ స్టేషన్ రోడ్డులోని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం అయి ఉంటాయి కదా.. అక్కడ ఫుటేజీ ఏమైందన్న విషయాన్ని సిట్ తేలుస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు...ఇంకా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. -
దివ్యాంగుడి కస్టోడియల్ డెత్! విజయ్ సర్కార్ మౌనంపై ఆగ్రహం
తమిళనాడును మరో లాకప్‌డెత్ మరణం కుదిపేస్తోంది. దివ్యాంగుడైన శబరివర్మన్ పోలీసుల కస్టడీలో ఉండగా మృతి చెందడం వివాదాస్పదమైంది. అతని ఒంటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులు హింసించి చంపారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్ దివ్యాంగుడు. గుట్కా, పాన్ మసాలా అక్రమ విక్రయాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. అయితే సోమవారం తెల్లవారుజామున జైల్లో శబరివర్మన్ మృతి చెందాడు.మృతదేహంపై గాయాలు.. జైల్లో ఏం జరిగింది?శబరివర్మన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మొత్తం 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జైల్లో అతడిపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అనంతరం సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకే ఆగ్రహం.. సీఎం విజయ్‌కు ప్రశ్నలుశబరివర్మన్ మృతి రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లిన తర్వాత గాయాలతో ఎలా మృతి చెందాడని ప్రశ్నించారు. దివ్యాంగుడన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాడి చేశారన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.అంతేకాదు.. ఇటీవల గుట్కా కేసులో ఓ టీవీకే నేత అరెస్టై అదే రోజు బెయిల్ పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సామాన్యులకు ఒక చట్టం, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా? అంటూ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. గతంలో లాకప్‌డెత్‌ల సమయంలో విజయ్ వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు అధికారంలో మౌనం వహించడం సరికాదని అంటున్నారు.తమిళనాడులో కస్టడీ మరణాలపై మళ్లీ చర్చశబరివర్మన్ ఘటనతో తమిళనాడులో కస్టడీ మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. 2020లో తూత్తుకుడిలో జరిగిన జయరాజ్, బెన్నిక్స్ తండ్రీకొడుకుల కస్టడీ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే శివగంగైలో అజిత్ కుమార్, తిరుప్పూర్‌లో మారిముత్తు కస్టడీ మరణాల ఘటనలు కూడా తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఇప్పుడు నాగర్‌కోయిల్ ఘటనలో దివ్యాంగుడి మృతి, మృతదేహంపై గాయాల అంశం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే శబరివర్మన్ మృతికి దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
లాకప్ డెత్ కేసులో కోర్టు సంచలన తీర్పు
ముంబై: సుదీర్ఘ కాలం పాటు సాగిన ఒక కస్టోడియల్ డెత్ కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.2011, మే 10వ తేదీ అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో పార్ధి సామాజిక వర్గానికి చెందిన బేగ్యా పవార్ (23) అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు వారి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పవార్ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.పోలీస్ స్టేషన్లో పవార్‌ను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్య పరీక్షలలో కూడా పవార్ శరీరంపై అనేక చోట్ల ఎముకలు విరిగినట్లు తేలడంతో, కస్టడీలో జరిగిన హింస నిజమేనని స్పష్టమైంది. ఘటన జరిగిన అనంతరం పవార్ తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పైనే ఆరోపణలు ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు.దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, పార్ధి సామాజిక వర్గ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి నిస్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.బాధితుల ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. సీఐడీ దర్యాప్తు అధికారి లోతుగా విచారణ జరిపి, కస్టడీలో యువకుడిని తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని నిర్ధారిస్తూ కోర్టులో నివేదిక (చార్జ్‌షీట్) దాఖలు చేశారు.గత 15 ఏళ్లుగా సాగిన ఈ కేసు విచారణ చివరకు ముగిసింది. నాటి రిసోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులను కోర్టు దోషులుగా తేల్చింది. నిందితుల్లో ఇన్ఛార్జ్ ధాండేతో సహా ఇద్దరు పోలీసులు ఇప్పటికే సర్వీస్ నుండి రిటైర్ అయ్యారు. కాగా, కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దోషులైన తొమ్మిది మందిని వాషిమ్ జైలుకు తరలించారు. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వారిని అమరావతి జైలుకు తరలించనున్నారు.కోర్టు తీర్పుపై పవార్ వృద్ధ తల్లిదండ్రులు స్పందిస్తూ..15 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది అని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ.. తన కొడుకు ఎలాంటి నేరం చేయలేదని, కేవలం ప్రశ్నించడానికే తీసుకెళ్లి చంపేశారని పవార్ తల్లి కన్నీరు మున్నీరైంది. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన కోర్టుకు, ప్రాసిక్యూషన్‌కు, సీఐడీ దర్యాప్తు బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
కస్టడీలో కొట్టడంవల్లే సాయికృష్ణ మృతి
విజయవాడలీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కైతేపల్లి బాబురావు (ఏ–5), గొరిపర్తి సాంబయ్య (ఏ–6)కు ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనంతరం బాబురావును అవనిగడ్డ సబ్‌జైలుకు, సాంబయ్యను గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.విజయవాడలోని సిటీ పోలీసుగెస్ట్‌హౌస్ వద్ద మంగళవారం ఉదయం వీరిరువురినీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజర్ మెమో ద్వారా జప్తుచేశారు. సిట్ అధికారుల విచారణలో నిందితులు ఇరువురు ఎలాంటి సహకారం అందించకుండా మౌనంగా ఉండిపోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలు..‘సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, కస్టడీలో ఉండగా తీవ్రంగా కొట్టడం వల్ల అతడు మరణించాడు. అనంతరం నిందితులంతా కలిసి నేరాన్ని దాచడానికి సాక్ష్యాలను తుడిచివేసి, మృతదేహాన్ని మాయం చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ఏ–1 సీఐ నాగరాజు, ఎ–2 పొట్లంక అశోక్‌కుమార్, ఏ–3 జంగం నానిని నిందితులుగా చేర్చారు. కృష్ణలంక పోలీసుస్టేషన్లో సీఐతోపాటు నలుగురు నిందితుల సమక్షంలో సాయికృష్ణను విచారించినట్లు సీడీఆర్ డేటాలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కృష్ణలంక పోలీసుస్టేషన్‌లోని నెట్వర్క్ వీడియో రికార్డును పరిశీలించగా, అందులో గత 18 నెలల సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. నిందితులు తమ చట్టవిరుద్ధ నిర్బంధాన్ని, కస్టడీ హింసను దాచడానికి ప్రభుత్వ ఆస్తి అయిన అసలు హార్డ్ డిస్కులను దొంగిలించి, వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్కులను ఉద్దేశపూర్వకంగా మార్చారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపిస్తూ నిందితులు పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో ఉన్నందున, వారు బయట ఉంటే సాక్షులను (సహచర సిబ్బందిని) బెదిరించే లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన, సున్నితమైన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ దశలో ఉందని, ఈ నేపథ్యంలో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. సీఐ నాగరాజు కస్టడీపై తీర్పు వాయిదావిజయవాడ లీగల్: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపించారు. కీలకమైన ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించలేదన్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు 12 రోజులపాటు పోలీసు కస్టడీ కోరారు. నాగరాజుకు పూర్తి భద్రత కల్పించామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి దీనికి సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం డిఫెన్స్ తరఫు న్యాయవాదులు దిట్టకవి రామ్‌చంద్, గుడిశేవ సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుడు పోలీసులకు పూర్తిగా సహకరించాడన్నారు. పోలీసు కస్టడీకి కేవలం రెండు రోజుల సమయం సరిపోతుందన్నారు.రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని, వీడియో, ఆడియో రికార్డులను భద్రపరచి న్యాయస్థానంలో సమర్పించాలని, న్యాయవాది సమక్షంలోనే నిందితుని విచారణ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని, అందుచేత రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ జరపాలని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనల అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీకాంత్ తీర్పును గురువారానికి వాయిదా వేశారు. -
సాయికృష్ణ కేసు: హైకోర్టు విచారణ వేళ రాజకీయ మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కాపు యువకుని లాకప్‌డెత్ కేసు సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్‌మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్‌కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.కృష్ణలంక, టాస్‌్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్‌తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. -
బాసు, బిగ్‌బాసే సూత్రధారులు
సాక్షి, అమరావతి: సంచలనం కలిగిస్తున్న గాదె సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే వ్యవహారం వెనుక సూత్రధారి విజయవాడ పోలీస్ బాసేనన్నది స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ఆదేశాలతోనే పోలీస్ బాస్ చెలరేగిపోయారన్నది తాజాగా వెలుగులోకి వస్తోంది. బిగ్ బాస్, విజయవాడ బాస్ సూత్రధారులుగా పాల్పడిన ఈ దారుణంలో పలువురు పోలీసు అధికారులు పాత్రధారులుగా వ్యవహరించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌లుగా చెలరేగిపోతున్న ఆ ఇద్దరు అధికారులే కర్త, కర్మ, క్రియగా మొత్తం వ్యవహారం సాగిందన్నది బట్టబయలవుతోంది.సీఐ నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా సరే.. అసలు కథ నడిపించింది పోలీస్ బాస్లేనన్నది నిగ్గు తేలుతోంది. ఈ దారుణంతో కూటమి ప్రభుత్వ దురాగతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దాంతో మూడు రోజుల తర్వాత తీరుబడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశమై వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడకు తెరతీశారు.విచారణ పేరుతో కాలయాపన చేసి, విషయాన్ని మరుగున పరచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం సాయికృష్ణ లాకప్ డెత్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వెనుక విశ్వసనీయ సమాచారం మేరకు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ బాస్ ఆదేశాలతోనే పోలీసు అధికారుల బరితెగింపు ఓ కేసులో సాయికృష్ణను నేరం అంగీకరించేలా చేయాలని పోలీస్ బాస్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మీరేం చేస్తారో చేయండి.. అతను నేరాన్ని ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ కేసుపై బిగ్‌బాస్ తరచూ అడుగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. దాంతో ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం సాయి కృష్ణను అదుపులోకి తీసుకుంది.అతడిని కొన్ని రోజులపాటు పోలీసు శైలిలో చిత్రహింసలకు గురి చేసిన అనంతరం సీఐకి అప్పగించారు. అప్పటికే కొన్ని రోజులపాటు చిత్రహింసలకు గురైన ఆయనపై సీఐ ఆధ్వర్యంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక సాయికృష్ణ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు హడావుడిగా చికిత్స చేయించేందుకు పోలీసులు యత్నించినట్టు సమాచారం. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఇక చేసేదేమీ లేదన్నది స్పష్టమైంది. కథ నడిపించిన పోలీస్ బాస్ విషయన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతోనే సాయికృష్ణను కనిపించకుండా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కాగా మాయం చేశారు. ఏకంగా జిల్లా దాటించి అజ్ఞాత ప్రదేశంలో తతంగాన్ని పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై బిగ్‌బాస్‌కు కూడా ముందస్తుగా పూర్తి సమాచారం ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఒక్కటై గుట్టు చప్పుడు కాకుండా సాయి కృష్ణను ‘మాయం’ చేశారు. అసలు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోనే లేదని నమ్మించేందుకు బరితెగించారు.కాగా, తమ కొడుకు సాయికృష్ణను పోలీసులు అపహరించారని, కనిపించకుండాపోయాడని ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసుల కుట్ర కథ అడ్డం తిరిగింది. దీంతో బెంబేలెత్తిన ఓ మహిళా పోలీసు అధికారి ఈ విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘ఏం పర్వా లేదు. అంతా నేను చూసుకుంటా..’ అని వ్యాఖ్యానించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. బిగ్ బాస్ కూడా ఈ విషయంలో ఏం ఆందోళన వద్దు.. అంతా మేం చూసుకుంటాం.. అని భరోసా ఇచి్చనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీస్సులు ఉండటం వల్లే వారు ఇలా భరోసా ఇచి్చనట్లు తెలుస్తోంది. నన్ను ఇరికిస్తే.. మొత్తం బయట పెడతా సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో విజయవాడ పోలీసు వర్గాలు హడలి పోతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి, ముగించాలని పోలీస్ బాస్ ఎత్తుగడ వేశారు. అందుకే ఆయన్ను వీఆర్‌కు పంపించి విషయాన్ని కప్పిపుచ్చే ఎత్తుగడ వేశారు. కానీ సాయికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు మానవ హక్కుల వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు పోలీసుల తీరుకు ఎదురు తిరిగాయి. సాయికృష్ణను చూపించాల్సిందేనని పట్టుబట్టాయి.బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందుకు బాధ్యత వహించాలని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం, విజయవాడ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొత్త ఎత్తుగడకు తెరతీశాయి. సీఐ నాగరాజు వరకు కఠిన చర్యలు తీసుకుని.. విషయాన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని సీఐ నాగరాజు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. పోలీసు శాఖ తీసుకునే కఠిన చర్యలను వ్యతిరేకించవద్దని, సహకరించాలని సూచించినట్టు సమాచారం. కొన్ని నెలల్లోనే మళ్లీ పోస్టింగు ఇస్తామని, ఏమీ కంగారు పడవద్దని ఆయనకు హామీ ఇచి్చనట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారాన్ని కేవలం తన ఒక్కడి మెడకే చుడితే సమ్మతించేదే లేదని ఆయన చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యవహారం వెనుక ఉన్న పోలీస్ బాస్తోపాటు అందరి పేర్లు బయట పెడతానని ఆయన చెబుతున్నారన్నది కూడా విశ్వసనీయ సమాచారం. పోలీస్ బాస్‌ల ఆదేశాలను పాటించిన తానొక్కడినే ఎందుకు బాధ్యుడిని కావాలని ఆయన ప్రశి్నస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది పోలీసు వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాపులంటే అంత చిన్నచూపాఅడవుల్లో, మారుమూల గ్రామాల్లో వినే లాకప్ డెత్‌లు ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున చేయడం కూటమి ఘనకార్యం. లాకప్‌లో చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు మాయం చేయడం నా అనుభవంలో మొదటిసారి. బాధిత కుటుంబం కోర్టుకు వెళితే తప్ప కేసు కదలేదు. ఇదేనా మార్పు? ఇదేనా మంచి పరిపాలన. కందుకూరులో కాపు యువకులపై కారు ఎక్కించిన ఘటనను 15 రోజులు దాచిపెట్టారు. పేద కులాలు, బీసీ, ఎస్సీ వర్గాలంటేనే చిన్నచూపా? ఈ దుర్మార్గాలను అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. – దాసరి రాము, కన్వీనర్, తెలగ, బలిజ, కాపు జేఏసీ పవన్‌కళ్యాణ్ నోరు విప్పాలికాపు యువకుడు సాయికృష్ణ కేసును పక్కదారి పట్టించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని అప్పగించి అతడి కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సైతం నోరు విప్పాలి. – అపోజీ, అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం, చిత్తూరుకాపులపై దాడులు, హత్యా రాజకీయాలుకాపు సామాజిక వర్గం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం దాడులు, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ దుర్మార్గం. కాపులపై టీడీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నా పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త నిజాలు బయటకు రావాలివిజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనలో నిజాలు బయటకు రావాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయం జరిగే వరకూ ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగుతుంది. – పన్నాస పూర్ణచంద్రరావు, ఆంధ్ర–తెలంగాణ రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాళ్లపాలెం, కలిదిండి మండలంగెలిపించిన వారినే చంపుతారా?కాపులతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చాక కాపుల్ని విస్మరించడం తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తక్షణమే స్పందించి సాయికృష్ణ లాకప్‌డెత్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మామిడి శ్రీకాంత్, వైఎస్సార్సీపీ తూర్పుకాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానిదే బాధ్యతకాపు కులానికి చెందిన గాదె సాయికృష్ణను వెంటనే అతని కుటుంబానికి అప్పగించాలి. రాష్ట్రంలో కాపులను ద్వితీయశ్రేణి పౌరులుగా ప్రభుత్వం చూస్తోంది. సాయికృష్ణకు ఏదైనా జరిగితే దానికి పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. – కొండాల గణేష్, తూర్పుకాపు సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళంపూర్తిస్థాయిలో విచారణ చేయాలికాపు యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యుల్ని శిక్షించాలి. యువకుడు కనిపించకపోవడం దారుణమైన విషయం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – కొక్కిరాల సంజీవకుమార్, జిల్లా అధ్యక్షుడు, కాపు సంఘం, ఒంగోలు కాపులకు రక్షణ లేదుకూటమి ప్రభుత్వంలో కాపులకు రక్షణ లేదు. సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపటం దుర్మార్ఘం. ఇటీవల గుంటూరులోనూ ఓ వ్యక్తిని ఇలాగే చంపారు. పది రోజులు గడవకుండానే విజయవాడలో మరో ఘోరం జరగటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. – తాడిశెట్టి శ్రీనివాసరావు, కాపు సంఘ నాయకుడు, పామర్రు, కృష్ణాజిల్లా రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాపులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా విజయవాడలో సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. రెడ్‌బుక్ రాజ్యాంగం వల్ల జనసేన కార్యకర్తలు కూడా బాధితులుగా మారుతున్నారు. – సలాది సతీష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, విలసవిల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
లాకప్‌డెత్‌తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్‌డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్‌కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్‌కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్‌కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్‌డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్‌లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్‌తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్‌ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్‌కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
కౌతాళంలో లాకప్ డెత్!
ఆదోని: తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను, ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించిన మహిళ మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా కౌతాళంలో సిట్ పోలీసులు కొట్టడం వల్లే మాల గంగమ్మ అనే మహిళ మరణించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 నవంబర్ 13న పొలానికి మందులు పిచికారీ చేయడానికి వెళ్లిన తన కుమారుడు మాల రవీంద్ర ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి గంగమ్మ కౌతాళం పోలీసులను ఆశ్రయించింది. అయితే, కౌతాళం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినా.. దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం విచారణకు ఆదేశించగా.. గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది.కాగా.. సిట్ అధికారులు విచారణ పేరిట మాల గంగమ్మను విపరీతంగా కొట్టడం వల్లే ఆస్పత్రి పాలై మరణించినట్టు సమాచారం. ఆమె మరణంతో కంగుతిన్న పోలీసులు పోస్టుమార్టం చేయించకుండా మృతదేహానికి దహన సంస్కారాలు ముగించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ కేసు లాకప్ డెత్ రూపంలో తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతో సిట్ పోలీసులు ముందుజాగ్రత్తగా గంగమ్మ కుమార్తె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గంగమ్మ ఇంటివద్ద ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో చికిత్స నిమిత్తం ఆస్పతికి తీసుకు వచ్చినట్టు, చికిత్స పొందుతూ గంగమ్మ మరణించినట్టు పోలీసులు ఆమె కుమార్తె నుంచి వాంగ్మూలం రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పవద్దు!
తమిళనాడు ‘తండ్రీ కొడుకుల లాకప్ డెత్’ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. దీనికి బదులు యావజ్జీవ శిక్ష వేయడం సబబు అనే చర్చ మొదలవ్వడం గమనార్హం. ఈ కేసు నేపథ్యంలోకి వెళితే... జయరాజ్, బెన్నిక్స్ తండ్రీ కొడుకులు. తమిళనాడు తూత్తుకుడిలోని ‘సాత్తాన్ కుళం’లో మొబైల్ షాప్ నడిపేవారు. 2020 జూన్ ‘లాక్డౌన్’లో వాళ్ళు మొబైల్ షాప్ తెరిచి ఉంచారు. ఈ నేరానికి ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇంకోసారి తీయకుండా సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోబెట్టొచ్చు, ఎంతోకొంత జరిమానా వేయొచ్చు. ఇవేవీ పోలీ సులు చేయలేదు. వాళ్ళను కొట్టారు. ‘ట్రామాటిక్ షాక్’ అంటే ‘అపస్మారక స్థితి’లోకి ఆ తండ్రీ కొడుకులు వెళ్లిపోయారు. హాస్పిటల్లో చనిపోయారు.సాత్తాన్‌కుళం (Sathankulam) పోలీసులు... ‘వారు అరెస్ట్‌కు ప్రతిఘటించారు (రెసిస్టెడ్ అరెస్ట్)’. ‘స్వల్పంగా బలవంతం (మైల్డ్ ఫోర్స్) చేయవలసి వచ్చింది’. ‘చిన్నపాటి గాయాలు మాత్రమే జరిగాయి’ అంటూ ‘ప్రాథమిక సమాచార నివేదిక’ను అబద్ధాలతో నింపారు. ప్రజల్లో ఆగ్రహమూ, ఆందోళనా పెరిగాయి. మద్రాస్ హైకోర్టు దీన్ని ‘సుమోటో’గా తీసుకుంది. కోవిల్పట్టి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. భారతీదాసన్‌ను విచారణ జరిపి నేరుగా ధర్మాసనానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తరు వాత ఎఫ్ఐఆర్ మారింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 302 (హత్య), 342 (అక్రమ నిర్బంధం), 201 (సాక్ష్యాల నాశనం) కింద కొత్త సెక్షన్లతో కేస్‌ని మళ్లీ కట్టారు. మద్రాస్ హైకోర్టు ‘ఈ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చెయ్యమంటూ’ సీబీఐకి అప్పజెప్పింది. సీబీఐ ఆ పనిని సవ్యంగానే చేసింది.సస్పెన్షన్, ఎక్స్‌గ్రేషియాలతో ప్రజల నిరసనల్ని ఆపలేమని అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామికి అర్థమయ్యింది. అందుకే ఈ కేసును సీరియస్‌గా తీసుకోవలసి వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఉన్న మిగిలిన సిబ్బంది చేత సాక్ష్యం చెప్పించింది. దాని ఫలితంగా తొమ్మిది మంది పోలీసులకు ‘మరణ శిక్ష’ పడింది. కారణాలు ఏవైనా ఈ శిక్ష ‘పోలీస్ హింస’కు ఒక జవాబును ఇచ్చినట్లే. చదవండి: ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!ఆ తండ్రీ కొడుకుల్ని ఆ తొమ్మిది మంది పోలీసులు చంపేశారు. ఇప్పుడు కోర్టులు ఆ తొమ్మిది మందినీ చంపబోతున్నాయి. ‘ఆదిమ ప్రతీకార నీతికి ఆఖరి అవశేషం మరణ శిక్ష’ అని మానవ హక్కుల నేత బాలగోపాల్ (Balagopal) అన్నారు. ‘చట్టానికి చంపే హక్కు ఉండకూడదు. చనిపోయిన వారిలో నిర్దోషులు ఉంటే వాళ్ళు ఇంక తిరిగి రార’నీ అన్నారు. ఇలాంటి వాదాలతో మానవ హక్కుల సంఘాలు మరణ శిక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. తొమ్మిది మందికీ (ఇంకా అలాంటి క్రూర పోలీసులకీ) తాము ఎంతటి దయాహీనులమో తెలియాలి అంటే వాళ్ళ తలల్ని ‘తలారీ’కి అప్పజెప్పడం కాదు; వాళ్లను జీవించనిద్దాము! జీవించినంత కాలమూ శిక్షిద్దాము!– నన్నూరి వేణుగోపాల్ మానవ హక్కుల కార్యకర్త -
‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు
తమిళనాడులో సంచలనం రేపిన అజిత్ కుమార్ (29) కస్టడీ డెత్(Custodial Death) కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్ కుమార్ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్ కుమార్ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్‌లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్‌కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్‌స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్ కుమార్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. ఏం జరిగిందంటే.. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్ ఆలయానికి జూన్ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్‌కుమార్(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్‌కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్ చేశారు. అజిత్ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నాకు భద్రత ఇవ్వండిఅజిత్ కుమార్‌ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్ డీజీపీకి లేఖ రాశారు.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025 -
అజిత్ కుమార్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) పరామర్శించారు. బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.తమిళనాట యువకుడు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. అజిత్‌పై పోలీసుల అమానుషంవిచారణ పూర్తి కావడంతో అజిత్‌ను పోలీసులు వదిలేశారు. మళ్లీ మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ కుమార్ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్‌లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది. సివిల్ డ్రెస్‌లో పోలీసులు..అజిత్‌పై దాడిమరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్ కుమార్ పోలిస్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అజిత్ కుమార్‌ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు అజిత్ కుమార్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు, కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్‌ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.మరోవైపు లాకప్ డెత్‌లో మరణించిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి. -
ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది. -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
కస్టోడియల్ మరణం విచారకరం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ మరణం విచారకరమని, ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. గచ్చిబౌలి పోలీస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పత్రికల్లో వచ్చిన కస్టోడియల్ మరణం వార్తపై స్పందించి న్యాయవాది రాపోలు భాస్కర్.. న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు కస్టోడియల్ మరణంపై మహబూబాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థి కరుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ కస్టోడియల్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను 8 వారాల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. -
HYD: పోలీసు స్టేషన్లో కస్టోడియల్ డెత్!.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్‌స్టేషన్‌లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహార్‌కు చెందిన నితీశ్(32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు -
మెదక్‌లో ఖదీర్ ఖాన్ ‘లాకప్‌డెత్’.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మెదక్‌లో జరిగిన ఖదీర్ ఖాన్ లాకప్‌డెత్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, డీసీపీ, మెదక్ ఎస్పీలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్...గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏఏజీ రామచంద్రరావు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ...ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఖదీర్‌ను హాజరుపరిచిన 14 రోజుల తర్వాత అతను మృతి చెందాడని చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం..ఖదీర్ భార్య తన భర్తను లాకప్‌డెత్ చేశారని ఆరోపిస్తోందని, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిట్‌తో విచారణ జరిపించాలి... ఖదీర్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ అతని భార్య సిద్ధేశ్వరి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని, సీసీటీవీ ఫుటేజీ ఫ్రీజ్ చేసేలా ఎస్పీకి ఆదేశాలివ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. స్పెషల్ జీపీ సంతోశ్‌కుమార్ హాజరై.. సుమోటో పిల్ వివరాలను తెలిపారు. తదుపరి వాదనల కోసం ఈ పిటిషన్‌ను కూడా పిల్‌తోపాటే జతచేయాలని రిజిస్ట్రీకి సూచించారు. -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
హిజాబ్ హీట్
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వారం రోజుల క్రితం 22 ఏళ్ల యువతి మోరల్ పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవడంతో యువతరం భగ్గుమంది. లక్షలాది మంది అమ్మాయిలు రోడ్డెక్కి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను ఇక ధరించే ప్రసక్తే లేదని తగులబెడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం మతపరంగా తమ హక్కు అని, వాటిని ధరించే విద్యాసంస్థలకు వస్తామని డిమాండ్ చేస్తూ ఉంటే, ఇరాన్లో పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. పోలీసు కస్టడీలో ఏం జరిగింది ? కుర్దిష్ ప్రాంతంలోని సాకేజ్ నగరానికి చెందిన 22 ఏళ్ల వయసున్న మహస అమిని టెహ్రాన్‌కు వచ్చింది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో సెప్టెంబర్ 13న మోరల్ పోలీసులు మెట్రోస్టేషన్ బయట ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కొట్టే దెబ్బలకు తాళలేక నిర్బంధ కేంద్రంలో కోమాలోకి వెళ్లిపోయిన అమిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. వ్యాన్‌లోకి ఎక్కించేటప్పుడే మహిళా పోలీసులు ఆమెను చితకబాదుతూ కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అమిని అప్పటికే అనారోగ్యంతో ఉందని గుండె పోటుతో మరణించిందని పోలీసుల వాదనగా ఉంది. పోలీసుల వాదనను ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని వారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అరెస్ట్‌ల్లో అమ్మాయిల ముఖం మీద గట్టిగా కొడుతూ, లాఠీలు ఝుళిపిస్తూ, వారిని వ్యాన్లలోకి తోసేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయంటూ ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమిని మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసింది. మహిళల్ని ఎలా చూస్తారు ? ఇరాన్లో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చెయ్యడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రభుత్వ అధికారులుగా కూడా మహిళలున్నారు. కానీ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు వస్త్రధారణపై కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తారు. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించడం, శరీరం కనిపించకుండా పొడవైన వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలన్న నిబంధనలున్నాయి. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి తిరగకూడదు. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలపై ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు మహిళలు స్వేచ్ఛగా తమకిష్టమైన దుస్తులు ధరించేవారు. ఇరాన్లో అమ్మాయిల వస్త్రధారణపై ఫిర్యాదుల్ని పరిశీలించడానికి 2005లో మోరల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల మోరల్ పోలీసులు అత్యంత దారుణంగా అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2017లో హసన్ రౌహని అధ్యక్షుడయ్యాక మోరల్ పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశారు. డ్రెస్‌కోడ్ నిబంధనల్ని అమ్మాయిలు ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మత ఛాందసవాది అయిన ఇబ్రహీం రైజి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక మోరలిటీ పోలీసులు చెలరేగిపోతున్నారు. షరియా చట్టాలపై అవగాహన పెంచాల్సిన పోలీసులు అమ్మాయిలపై జులుం ప్రదర్శిస్తున్నారు. గతంలోనూ నిరసనలు ఇరాన్లో మహిళలు హిజాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ 2014లో పెద్ద ఎత్తున ఆన్లైన్ ఉద్యమం నడిపించారు. మై స్టెల్తీ ఫ్రీడమ్ పేరుతో పెద్ద సంఖ్యలో నెటిజన్ల హిజాబ్‌ను ధరించబోమంటూ ఫోటోలు , వీడియోలు చేశారు. వైట్ వెడ్నస్డేస్, గర్ల్సŠ ఆప్ రివల్యూషన్ స్ట్రీట్ అన్న పేరుతో కూడా షరియా చట్టాలకు వ్యతిరేకంగా అమ్మాయిలు ఉద్యమాలు నిర్వహించారు. నిరసనల్లో ఏడుగురు మృతి హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్లో టెహ్రాన్‌తో దాదాపు 15 నగరాలు దద్దరిల్లుతున్నాయి. అమ్మాయిలు, వారికి మద్దతుగా యువకులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో గత ఐదారు రోజుల్లో ఇద్దరు యువకులు సహా ఏడుగురు మరణించారు. నిరసనలు కుర్దిష్ వేర్పాటువాదుల పనేనని ప్రభుత్వం అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Juscti For Manikandan: సంచలన ఆదేశం.. రీపోస్ట్ మార్టం చేయాల్సిందే!
Juscti For Manikandan: పోలీసు కస్టోడియల్ మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 21ఏళ్ల విద్యార్థి ఎల్ మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీసు కస్టోడియల్ మరణమంటూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మణికందన్ మృతదేహానికి తిరిగి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. వివరాలు.. ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితుడితో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెకప్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్ సృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్ మృతిచెందాడు. మణికందన్‌కు పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు. అయితే తమ కొడుకు పోలీసులే స్టేషన్లో హింసించడం వల్ల మారణించాడని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు. సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామని, అతని(మణికందన్) స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉన్నాడని తెలిపారు. పోలీసులు హింసించారని దానికారణంగా మణికందన్ తల్లిదండ్రులు కోర్టును అశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే మణికందన్ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలీసు దౌర్జన్యం, కస్టోడియల్ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు
సాక్షి, చెన్నై: కస్టడీలో ఉన్న నిందితుడి మృతి కేసులో సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులకు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ దిండుగల్ కోర్టు తీర్పు వెలువరించింది. దిండుగల్ జిల్లా వడమదురై పోలీసులు గతంలో మెట్టినా పట్టికి చెందిన సెంథిల్‌కుమార్‌ను బెదిరింపు కేసులో అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే సమయంలో గుండెపోటు రావడంతో అతను మరణించాడు. అయితే పోలీసులు కొట్టి చంపేసినట్టుగా ఆరోపణలు రావడం, బంధువులు ఆందోళనకు దిగడంతో కేసు సీబీసీఐడీకి చేరింది. విచారణ ముగించిన సీబీసీఐడీ వడమదురై స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుమలై ముత్తుస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు అరవిందన్, పొన్రాజ్, అబ్దుల్ వహబ్‌లపై మీద కేసు నమోదు చేసింది. దిండుగల్ కోర్టు న్యాయమూర్తి శరవణన్ ఈ కేసును విచారిస్తూ వచ్చారు. సీబీసీఐడీ సమర్పించిన చార్జ్ షీట్ మేరకు 60 మంది సాక్షులను విచారించారు. వాదనలు ముగించారు. విచారణలో సెంథిల్‌కుమార్‌ను అరెస్టు చేసిన సమయంలో మెట్టినాపట్టి నుంచి వడమదురై పోలీసు స్టేషన్ వరకు దారి పొడవునా కొట్టుకుంటూ తీసుకొచ్చినట్టు తేలింది. తీవ్ర రక్తస్త్రావం జరిగినా కప్పిపుచ్చి ఆగమేఘాలపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో ఎస్ఐ తిరుమలైస్వామి, పొన్రాజ్, అరవిందన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే చెరో రూ.5 వేల జరిమానా విధించారు. అదే సమయంలో సబ్ ఇన్స్పెక్టర్కు అదనంగా ఏడాది జైలు, రూ. వెయ్యి జరిమానా విధించారు. చదవండి: 10 కిలోల బంగారు ఆభరణాలతో పరార్ -
పోలీసు కస్టడీలో మృతి?
టీ.నగర్: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్ కుమారుడు డ్రైవర్ బాలమురుగన్. అతన్ని ఒక కిడ్నాప్ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఎస్ ఆనంద్ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్ 14న రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష తిరువొత్తియూరు: ఈరోడ్ జిల్లాలో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ రోడ్డు మహిళా కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈరోడ్ జిల్లా భవానిసాగర్ తాండం పాళయానికి చెందిన జగన్ (19) అదే ప్రాంతంలో ఉంటున్న నాలుగేళ్ల బాలికపై 2019లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ శనివారం ఈరోడ్ మహిళా కోర్టులో జరిగింది. విచారణ అనంతరం జగన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు చెప్పారు. హత్య కేసులో యవజ్జీవం బాంబుతో దాడి చేసి రైతును హత్య చేసిన యువకుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. శివగంగై జిల్లా తిరుప్పాచ్చికి చెందిన ముత్తు రామలింగం (35) రైతు. ఇతనికి దూతైకి చెందిన పెరియస్వామికి వైగై నదిలో ఇసుక తరలింపులో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. 2003 అక్టోబర్ 3న బాంబు దాడిలో ముత్తు రామలింగం మృతి చెందాడు. పోలీసులు సేంగైస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శివగంగై జిల్లా సెషన్స్ కోర్టులో శనివారం న్యాయమూర్తి సుమతీ సాయి ప్రియ సమక్షంలో జరిగింది. సేంగైస్వామికి యావజ్జీవ శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో తండ్రి, కొడుకుల మరణం కేసులో విచారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల్లోపు దర్యాప్తును ముగించి తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, ఫినిక్స్ అనే తండ్రి కుమారులు జ్యుడిషియల్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా సాత్తాన్‌కులం పోలీసులు ఈ ఇద్దర్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. ఆ స్టేషన్ సీఐ, ఇద్దరు ఎస్ఐలతో పాటు పది మంది పోలీసులు అరెస్టు అయ్యారు. కేసును సీబీఐ విచారిస్తోంది. చార్జ్‌షీట్‌ను మదురై జిల్లా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ నేపథ్యంలో కింది కోర్టులో విచారణ జాప్యంపై హైకోర్టు గురువారం స్పందించింది. కేసును త్వరితగతిన విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని గడువు విధించారు. చదవండి: కస్టడీ డెత్: సీబీఐ విచారణలో విస్తుపోయే విషయాలు డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు -
చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మద్రాస్ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ‘‘రిజల్ట్స్ ఆఫ్ లాబొరేటరి అనాలిసిస్’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది. సత్తాన్‌కులం లాకప్, టాయిలెట్, ఎస్హెచ్ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు..‘‘సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్లో 19.06.2020 రోజున సాయంత్రం బెనిక్స్, జయరాజ్‌లను, నిందితులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. (చదవండి: అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ) అదే రోజు రాత్రి మరోసారి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలే వారి మృతికి కారణమయ్యాయి’’అని స్పష్టం చేసింది. ఇక బాధితులను తీవ్రంగా హింసించడమే గాకుండా, గాయాల వల్ల వారి శరీరం నుంచి కారిన రక్తం ఫ్లోర్‌పై పడితే, దానిని కూడా వారి దుస్తులతోనే శుభ్రం చేయాలంటూ అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇక కోవిల్పట్టి మెజిస్ట్రేట్ విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించినట్లు చార్జిషీట్లో పొందుపరిచింది. (చదవండి: కస్టడీ డెత్: 9 మంది పోలీసులపై చార్జిషీట్) ఆరోజు ఏం జరిగింది? సీబీఐ నివేదికలోని వివరాల ప్రకారం.. జూన్ 19న ఎస్సై బాలక్రిష్ణన్, ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, కానిస్టేబుల్ ఎం ముత్తురాజాతో పాటు మరికొంత మంది పోలీసులు కామరాజార్ చౌక్ వద్ద జయరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెనిక్స్ వెంటనే సత్తానుకులం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్సై బాలక్రిష్ణన్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతడిపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ను బెనిక్స్ నెట్టివేయడంతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై చేయి ఎత్తినందుకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెనిక్స్ను తీవ్రంగా కొట్టారు. అలా కొన్ని గంటలపాటు జయరాజ్, బెనిక్స్లను చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారిద్దరి దుస్తులు విప్పించి, మళ్లీ కొట్టడం ప్రారంభించారు. చెక్కబల్లపై వారిని పడుకోబెట్టి, కాళ్లూ, చేతులూ వెనక్కి మడిచి పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తమను విడిచిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా కనికరం చూపలేదు. తీవ్రమైన గాయాల వల్లే వీరిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. -
9 మంది పోలీసులపై సీబీఐ చార్జిషీట్
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది. ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్‌ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మధురై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై ఇటీవలే కరోనాతో మృతి చెందినట్లు సీబీఐ వెల్లడించింది. (చదవండి: ‘కొడుకు ఒంటిపై 13, తండ్రి శరీరంపై 17 గాయాలు’) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇక కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఐ అధికారులు, పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. తాజాగా తొమ్మిది మంది పేర్లను చార్జిషీట్లో చేర్చింది. -
అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ
చెన్నై: తమిళనాట ప్రకంపనలు రేపిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సీబీఐ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. సత్తాన్‌కుళంకు చెందిన జయరాజ్, బెనిక్స్ పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించారు. (చదవండి: కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి) ఈ సందర్భంగా.. తగిన ఆధారాలతో కోర్టు ముందు హాజరైన సీబీఐ అధికారి.. విచారణలో భాగంగా మురుగన్, థామస్ జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టినట్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 38 మందిని విచారించామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు తండ్రీకొడుకులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలిందన్నారు. లోతైన గాయాల కారణంగానే వారిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఇక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్ఐ పాల్దురై ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.(చదవండి:రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్‌కుళం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. -
కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో పాల్దురై మరణించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సరైన చికిత్స అందించనందు వల్లే పాల్దురై మృతి చెందారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. చిత్ర హింసలు పెట్టగా వారు మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్‌కులం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. వీరిలో పాల్దురై కూడా ఉన్నారు. -
కస్టడీ డెత్: వీడియో డెలిట్ చేసిన సింగర్!
చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ ఘటనకు సంబంధించిన వీడియోను తొలగించాలని తమిళనాడు క్రైంబ్రాంచ్ సీఐడీ(సీబీ-సీఐడీ) ప్రముఖ గాయని సుచిత్రకు విజ్ఞప్తి చేసింది. పోలీసుల కస్టడీలో చిత్ర హింసలకు గురై వారిద్దరు చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవ సంఘటనలకు ఆమె వ్యాఖ్యలకు ఏమాత్రం పొంతన లేదని కొట్టిపారేసింది. ఊహాజనిత కథనాలు జోడించి ఈ ఘటనను సంచలనంగా మార్చేందుకు సుచిత్ర ప్రయత్నించారని పేర్కొంది. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వెంటనే ఈ వీడియోను తీసివేయాలని ఆమెకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తూత్తుకుడి జిల్లా పోలీసులు ట్విటర్లో చేశారు. సీబీ-సీఐడీ విజ్ఞప్తి మేరకు సుచిత్ర తన నిరాధార కథనాలతో కూడిన వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.(రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్ సమీపంలోని సాత్తాన్‌కులం పోలీసుల దాష్టీకానికి జయరాజ్, బెనిక్స్ అనే తండ్రీకొడుకులు మరణించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన వీరు పోలీస్ కస్టడీలో దారుణంగా మృతి చెందడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణలో కూడా వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది. ఇక ఈ ఘటనపై సినీ, క్రీడా ఇతర రంగాల సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక దక్షిణాది గాయని అయిన సుచిత్ర ఘటన జరిగిన వెంటనే స్పందించి తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. అయితే అవన్నీ నిరాధార, కల్పిత కథనాలంటూ శుక్రవారం సీబీ-సీఐడీ ఆమెకు ఓ నోటీసు జారీ చేసింది. కస్టడీ డెత్ కేసు విచారణ జరుగుతున్నందున ప్రింట్, విజువల్, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దని ప్రజలను కోరింది. కాగా జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్ కేసును మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం సీబీ-సీఐడీకి అప్పగించగా.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తండ్రీకొడుకుల మృతిపై విచారణ కొనసాగుతోంది. -
కస్టడీ డెత్: మరో కీలక మలుపు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బెనిక్స్- జయరాజ్ కస్టోడియల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ కేసును ప్రస్తుతం సీబీ- సీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఐదుగురి అరెస్టు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టగా వారు మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా.. మెజిస్ట్రేట్ ఇటీవలే నాలుగు పేజీల నివేదిక అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.(కస్టడీ డెత్: పోలీసుల అరెస్టు.. స్థానికుల సంబరాలు) -
కస్టడీ డెత్: మరో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడుకు చెందిన జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఇదిలా ఉండగా.. కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్, బెనిక్స్‌లకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక ఈ హేయమైన ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్ నాలుగు పేజీల నివేదిక అందజేశారు.(కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు
చెన్నై: పోలీసులు విచక్షణారహితంగా కొట్టినందు వల్లే సత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, బెనిక్స్ మరణించినట్లు జ్యుడిషియల్ విచారణలో తేలింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై మద్రాస్ హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ మంగళవారం ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, పోలీస్ స్టేషనులోని పరిస్థితులను బట్టి పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే జయరాజ్, బెనిక్స్ మృతి చెందారని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన నివేదికలో.. ‘‘జూన్ 19 రాత్రంతా పోలీసు అధికారులు ఆ తండ్రీకొడుకులను కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితులను కొట్టేందుకు ఉపయోగించిన లాఠీలు, వారిని పడుకోబెట్టిన బల్లపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ లాఠీలను హ్యాండోవర్ చేయాల్సిందిగా నేను ఆదేశించగా.. సత్తాన్‌కులం పోలీసులు నా మాటలు వినబడనట్లు నటించారు. నేను గట్టిగా అడిగిన తర్వాత అయిష్టంగానే వాటిని ఇచ్చారు. మహరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ నా వెనుక చేరి గొణగడం మొదలు పెట్టారు. విచారణతో నేనేమీ సాధించలేది లేదని అన్నారు. ఇక మరో పోలీసు అధికారి బాధితులను వేధిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు తెలిసింది. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగులు మార్చారు. ఇవే కాకుండా ఈ కేసులో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిరక్షించే ఏర్పాట్లు చేయాలి’’అంటూ విచారణలో వెల్లడైన అంశాలను పొందుపరిచారు. (కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు షాపును తెరచి ఉంచాడని పోలీసులు జూన్ 19న జయరాజ్(59) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి అరెస్టును నిరసిస్తూ సత్తాన్‌కులం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి కొడుకు బెనిక్స్(31)ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ 188, 383,506(II)తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోవిల్ పట్టి సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్ 23న తండ్రీకొడుకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టడం వల్లే వారు మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక అమానుష ఘటనపై మండిపడ్డ మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇక మంగళవారం ఈ ఘటనపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించిన నేపథ్యంలో ఈ విషయంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
కస్టడీ డెత్: తగిన ఆధారాలు ఉన్నాయి!
చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్, బెనిక్స్‌లపై హేయమైన దాడి జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు రుజువైందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తండ్రీకొడుకులపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు లభించాయి’’అని మంగళవారం పేర్కొంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయగా... గాయాలతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం... జయరాజ్, బెనిక్స్‌ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ పుగళేందిలతో కూడిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను మంగళవారం పరిశీలించింది. బాధితుల మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొంది. (పోలీసులు కావాలనే దాడికి దిగారు) ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించే విషయం గురించి న్యాయమూర్తులు మాట్లాడుతూ..‘‘వారికి న్యాయం జరుగుతుందని జయరాం కుటుంబం నమ్ముతోంది. ఒక్క సెకన్ కూడా వృథా కావడానికి వీల్లేదు. సీబీఐ ఈ కేసును చేపట్టే లోపు తిరునల్వేలి డీఐజీ ఎందుకు విచారణ ప్రారంభించకూడదు’’అంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ విషయంపై మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణకై నియమించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ విషయంపై సంబంధిత జ్యుడిషియల్ పరిధిలోని అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు. -
కస్టడీ డెత్: పోలీసులు చెప్పినవి అబద్ధాలే
చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి) పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) -
ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకుల హత్య ఆరోపణల కేసులో ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన హరి ఇకపై అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి; ఆందోళనలు) తమిళనాడులో పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగం హీరో సూర్య ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొనగా, ప్రముఖ నటి కుష్బూ దీనిపై విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వరకర్త డి ఇమ్మన్ కూడా ఈ అమానవీయ హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ భారతదేశపు జార్జ్ ఫ్లాయిడ్స్ అంటూ ఇమ్మన్ ట్వీట్ చేశారు. కాలా దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఎలాంటి భయం లేకుండా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్న ప్రతీ పోలీసు అధికారిని నేరస్థుడిగా భావించాలన్నారు. వీరితోపాటు హీరోయిన్లు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, అలాగే హీరో విష్ణు విశాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల దారుణాన్ని ఖండించారు. కాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ (59), ఆయన కుమారుడు బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం
చెన్నై: తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి అధికార అన్నాడీఎంకే పార్టీ 25 లక్షల రూపాయల సహాయాన్ని శనివారం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని సాత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్(59), బెనిక్స్(31) కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి ఇది అదనమని పేర్కొంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరితో కలిసి సమాచార శాఖ మంత్రి సి. రాజు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తరపున ఎంపీ కనిమొళి శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ. 70 లక్షల పరిహారం ప్రకటించినట్టు అయింది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’) కాగా, ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎస్పీ శుక్రవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు నివేదిక సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కోర్టుకు వివరాలు తెలిపారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందని, అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నందున నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. మరోవైపు జయరాజ్, బెనిక్స్ మరణానికి కారకులైన పోలీసులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి) -
‘కుక్కను కొట్టినట్లు కొట్టాను.. చచ్చాడు’
ముంబై: మాజీ డీసీపీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవ్వడమే కాక.. పోలీసు కస్టడీలో సంభవించే మరణాల గురించి తాజాగా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. ముంబై మాజీ డీసీపీ భీమ్రావ్ సోనావనేకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో భీమ్రావ్ 1990 కాలంలో వర్లీ పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. రట్టు గోసావి అనే ముద్దాయిని ఎలా హింసించింది.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనావనే వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. ‘1990 సంవత్సరం అప్పుడు నేను వర్లీ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. రట్టు గోసావి అనే నేరస్తుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. అతడి మీద అప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రట్టు పోలీసులకు చిక్కాడు. అప్పుడు స్టేషన్లో నేనే ఉన్నాను. మా కస్టడీలో ఉన్న రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్ స్టేషన్ బయట గందరగోళం ప్రారంభమయ్యింది’ అన్నాడు సోనావనే. ‘దాదాపు 400 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వారి ఎదురుగా రట్టు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టం. ఎలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఉపాయం తట్టింది. స్టేషన్ బయట ఓ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాను. రట్టు చేతికి బేడీలు వేశాను. ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో రట్టును బయటకు నడిపించుకుంటూ తీసుకెళ్లాం. చూసే వారికి అతడు గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. రట్టు గురించి అడిగిన వారికి ‘తనను తాను గాయపర్చుకున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. గాయం కారణంగా నడవలేకపోతున్నాడు’ అని చెప్పాం. చేతికి బేడీలు ఉండటంతో మేం చెప్పింది నిజమని నమ్మారు. ఆ తర్వాత అతడిని కేఈఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వారు రట్టు మృత దేహాన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు’ అన్నాడు సోనావనే. ‘తర్వాత రట్టు బాడీని జేజే ఆస్పత్రిలో చేర్చాం. అతడి చేతిలో తుపాకీ పెట్టాం. రట్టు పోలీసుల మీద కాల్పులుకు పాల్పడ్డాడని.. పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. మొదటి అంతస్తు నుంచి దుకాడని.. ఈ క్రమంలో అతడు చనిపోయాడని చెప్పాం. దాని ప్రకారం ఆ తర్వాత స్టేషన్ డైరీలో కూడా మార్పులు చేశాం’ అంటూ సోనావనే చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా సోనావనే బంధువు, వ్యాపారవేత్త రాజేంద్ర ఠక్కర్ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. దాంతో సోనావనే చెప్పినవన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ వీడియో తీసుకెళ్లి ముంబై పోలీసులకు ఇచ్చి, సోనావనే మీద ఫిర్యాదు చేసింది రాజేంద్ర ఠక్కర్ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్. డబ్బుల విషయంలో ఠక్కర్‌కు, సోనావనేకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఠక్కర్ ఈ వీడియో ఫుటేజ్‌ను వర్లీ పోలీసులకు అందజేశాడు. అంతేకాక వీడియో ఆధారంగా సోనావనే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఠక్కర్ వ్యాఖ్యలను సోనావనే ఖండిస్తున్నాడు. తనపై చేసినవన్ని నిరాధారమైన ఆరోపణలని.. వ్యక్తిగత వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఠక్కర్ నకిలీ వీడియో రూపొందించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని సోనావనే పేర్కొన్నాడు. ఇక ఈ విషయం గురించి ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ‘ఈ ఘటన జరిగినప్పుడే దీని గురించి విచారణ చేశాము. ప్రస్తుతం మళ్లీ కొత్తగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మరో సారి విచారణ చేస్తాం. అలా చేయాలంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు.. మరికొన్ని బలమైన సాక్ష్యాలు కావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
మరిదిని చంపి.. వదినపై పోలీసుల గ్యాంగ్ రేప్!
సాక్షి, జైపూర్: దొంగతనం చేశారంటూ దళితులైన మరిది, వదినను అరెస్టు చేసిన కేసులో.. కస్టడీలో ఉన్న మరిది చనిపోవడం, పోలీసులు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ వదిన వాంగ్మూలం ఇవ్వడం రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్సెండ్ చేసింది. అంతేకాక, జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించింది. ’రాజస్థాన్‌లోని చురు పోలీసులు దొంగతనం కేసులో నా తమ్ముడి(22)ని జూన్ 30న అనుమానితుడిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న నా భార్య(35)ను తీసుకెళ్లారు. ఆ తర్వాత 6వ తేదీ రాత్రి నా తమ్ముడిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న నా భార్యపై సామూహికంగా అత్యాచారం చేసి, చేతి గోర్లను పీకేసి హింసించారు. ఎనిమిది రోజుల పాటు నా భార్యను అక్రమంగా నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత 10వ తేదీన విడిచిపెట్టారు’ అని మృతుని సోదరుడు మీడియాకు తెలిపారు. మృతుని సోదరి మాట్లాడుతూ.. 6వ తేదీన తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి ఇదే నీ చివరి చూపని చెప్పారని విలపిస్తూ చెప్పింది. 8 రోజుల తర్వాత వచ్చిన వదిన ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది. ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ ప్రశాంత్ కుమార్ శర్మ వెల్లడించారు. మృతుని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందనీ, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామన్నారు. సామూహిక అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామనీ, ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్ బ్రాంచ్ అదనపు డీజీపీ బీఎల్ సోనీ పేర్కొన్నారు. -
యోగి ప్రభుత్వానికి నోటీసులు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో యోగి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం జారీ నోటీసులు చేసింది. అత్యాచార బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించి నివేదికను అందజేయాలని నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేలా హామీ ఇవ్వాలని కోరింది. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఉనావో ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్చార్సీ హెచ్చరించింది. బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తున్నాం... ‘పోలీసు కస్టడీలో వ్యక్తి మరణం, అందుకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీకి ఉంటుంది. 24 గంటలు గడిచినా మాకు ఎటువంటి సమాచారం అందలేదు. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆస్పత్రిలో చేరడం, మరణించడం వరకు జరిగిన ప్రతీ అంశం గురించి పూర్తి సమాచారం అందజేయాలని, ఇందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని’ ఎన్‌హెచ్చార్సీ తెలిపింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు లాఠీలతో తన తండ్రిని కొట్టి చంపారని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతస్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
‘బాధిత మహిళ తండ్రినీ బలిగొన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ గూండా సర్కార్ నడుపుతోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆరోపించారు. బీజేపీ ఎంఎల్ఏ కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తండ్రి పోలీసు కస్టడీలో మరణించారన్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట ఆదివారం బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించిన క్రమంలో ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులు చితకబాదడం వల్లే మహిళ తండ్రి మరణించారని సుర్జీవాలా ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మరణించడం అత్యంత హేయమని ఆయన ట్వీట్ చేశారు. నేరగాళ్లను అరెస్ట్ చేయడానికి బదులు యూపీ బీజేపీ సర్కార్ బాధితులను అరెస్ట్ చేస్తోందని, అక్కడ గూండాల పాలన సాగుతోందని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ తోసిపుచ్చారు. అయితే సెంగార్, ఆయన అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించారు. అయితే పదేళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, పూర్తి విచారణ అనంతరమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
767 రోజులుగా మౌన పోరాటం...
తిరువనంతపురం : కేరళలో 767 రోజులుగా ఓ యువకుడు చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లుగా యువకుడు సెక్రటేరియేట్ ఎదుట అతను మౌన దీక్ష చేస్తున్నాడు. తన అన్న మృతి కేసులో నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం అత్యున్నత దర్యాప్తు కోసం అతను డిమాండ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుండా పోయింది. విషయం ఏంటంటే... 2014 మే నెలలో శ్రీజీవ్ అనే యువకుడిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగా అతను విషం తాగి ప్రాణాలు విడిచాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఓ అధికారి కూతురిని ప్రేమించిన కారణంగా పోలీసులే అతన్ని హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారని శ్రీజీవ్ సోదరుడు శ్రీజిత్ చెబుతున్నాడు. కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అధికారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ శ్రీజిత్ దీక్ష చేపట్టాడు. దీంతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం.. కేసులో దర్యాప్తునకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చింది. నష్టపరిహారం అందినప్పటికీ.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో శ్రీజిత్ మరోసారి తన నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. సెక్రటేరియట్ ఎదుట ఉన్న బస్టాండ్ వద్ద దీక్షను ప్రారంభించాడు. అలా రెండేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయింది. మధ్యమధ్యలో స్థానిక మీడియాలో వార్తలు వచ్చినా వాటినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఉద్యమంతో.. ఆర్పీ శివకుమార్ అనే బ్లాగ్ రచయిత శ్రీజిత్ గురించి జనవరి 1న ప్రత్యేక కథనాన్ని ప్రచురించాడు. అందులో శ్రీజిత్ ఆరోగ్యం క్షీణిస్తోందని.. అయినా అధికారులెవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అప్పుడు మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఆ వార్తను ప్రచురించాయి. దీంతో యావత్ కేరళ యువత శ్రీజిత్‌కు మద్ధతుగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు. రెండు రోజులుగా వేదిక వద్దకు వేల సంఖ్యలో యువతీయువకులు తరలి వస్తుండటంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీజిత్‌తో హీరో టొవినో.. పక్కన సంఘీభావం తెలిపేందుక చేరిన యువకులు ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శ్రీజిత్‌కు మద్ధతు ప్రకటించారు. నటులు పృథ్వీరాజ్, నివిన్ పౌలీ, టొవినో థామస్‌లు శ్రీజిత్‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శశిథరూర్, కేసీ వేణుగోపాల్ లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో మంత్రి జితేంద్ర సింగ్‌లను కలిసి సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. శ్రీజిత్, అతని తల్లి, స్నేహితులతో భేటీ అయ్యారు. సత్వరమే న్యాయం కలిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ.. అది నెరవేరే దాకా దీక్ష కొనసాగిస్తానని శ్రీజిత్ చెబుతున్నాడు. సీబీఐ విముఖత... ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు గత జూలైలో కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. అయితే అది సత్పలితం ఇవ్వలేదు. దీనికితోడు సీబీఐ కూడా తాము పనిభారంతో ఉన్నామని.. ఈ కేసును దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. -
కొంగల మందు మింగిందెక్కడ?
విజయవాడ సిటీ : అనుకోని సంఘటన జరిగితే సరిహద్దుల రాద్దాంతం చేసే పోలీసులు పుల్లా రమేష్ కస్టోడియల్ డెత్‌పై మాత్రం కిమ్మనకుండా కేసు కట్టడం చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో రమేష్ కొంగల మందు మింగినట్టు పలువురు చెబుతుండగా..అదుపులోకి తీసుకున్న ప్రాంత పరిధిలోని పటమట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు విచారణ కోసం రమేష్‌ను పోలీసు స్టేషన్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలో కొంగల మందు మింగాడు. నోటి నుంచి నురగలు రావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. రమేష్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇతను మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో పటమట పోలీసు స్టేషన్లో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసు అదుపులో చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని కస్టోడియల్ డెత్‌గా కేసును మార్చారు. ఎక్కడి వరకు వెళ్లిన తర్వాత కొంగల మందు తీసుకున్నాడనేది మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలోనే రమేష్ కొంగల మందు తీసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం పోలీసుల కథనానికి భిన్నంగా ఉంది. స్టేషన్ సమీపంలోనే రమేష్ కొంగల మందు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎవరి వాదన వాస్తవం ఉందో తెలియాలంటే అజ్ఞాతంలో ఉన్న పోలీసు ఇన్ఫార్మర్, రమేష్‌తో పాటు మోపెడ్‌పై వచ్చిన వ్యక్తులు వెలుగులోకి రావాల్సి ఉంది. లోప భూయిష్ట ఫిర్యాదు రమేష్ కస్టోడియల్ డెత్‌కు సంబంధించి పెనమలూరు ఎస్ఐ వెంకట రమణ పటమట పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు సందేహాస్పదంగా ఉంది. కస్టడీకి తీసుకున్న సమయం, ప్రాంతం, కొంగల మందు మింగితే తీసుకెళ్లిన ఆస్పత్రి వివరాలేవీ పేర్కొనలేదని తెలిసింది. -
కస్టోడియల్ మిస్టరీ!
రమేష్ మృతిపై మొదటి నుంచి పోలీసుల తీరు అనుమానాస్పదం తొలుత పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటన..ఆ తర్వాత కస్టోడియల్ డెత్‌గా నిర్ధారణ స్వాధీనం చేసుకున్న బంగారం ఎంత..? సీసీఎస్‌ను విస్మరించడంలో ఆంతర్యమేంటి..! విజయవాడ సిటీ : ఇటీవల జరిగిన కస్టోడియల్ డెత్‌పై మిస్టరీ వీడలేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితుడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పే పోలీసు అధికారులు.. ఈ కేసు విషయంలో మాత్రం కస్టోడియల్ డెత్‌గా ధ్రువీకరించారు. ఇందుకు అనుగుణంగా నిబంధనలు మాత్రం పాటించలేదు. సాధారణంగా పోలీస్ కస్టడీలో ఎవరైనా మృతిచెందితే రెవెన్యూ అధికారులకు తెలియజేసి, వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారు. అయితే, పుల్లా వెంకట రమేష్ (28) మృతిపై మాత్రం పోలీసులు తొలి నుంచి పరస్పర విరుద్ధ కథనాలు చెబుతున్నారు. దీంతో రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. మొదటి నుంచీ రకరకాలు కథలు.. ఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, రమేష్ విదిలించుకొని కొంగల మందు మింగాడంటూ చెప్పారు. వెంటనే తాము ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, మృతిచెందినట్లు తెలిపారు. అయితే, రామవరప్పాడు రింగ్ నుంచి ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. దీనిపై పలు విమర్శలు రావడంతో... రమేష్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో కొంగల మందు మింగాడని ప్రకటించారు. బెదిరించేందుకు నాటకం ఆడుతున్నాడనుకుని పోలీసులు పట్టించుకోలేదని, నోటి నుంచి నురగ రావడంతో తొలుత ప్రైవేటు ఆస్పత్రికి, ఆపై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామని చెబుతున్నారు. పోలీసులు చెబుతున్నట్టుగా చిన్ననాటి నుంచే నేర చరిత్ర కలిగిన రమేష్ పోలీసులకు చిక్కిన వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అతని బంధువులు చెబుతున్నారు. కుటుంబ కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే ఎప్పుడో చేసుకునే వాడని, పోలీసులకు చిక్కిన తర్వాతే ఎందుకు చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ముందే ఎందుకు తొందర.. చనిపోయిన వ్యక్తి ఏం మందు తీసుకున్నాడనేది పోస్టుమార్టం నివేదికలో వస్తుంది. అప్పటి వరకు వేచి చూడకుండా పంచానామా జరుగుతుండగానే కొంగల మందు తీసుకున్నాడని పోలీసులు ధ్రువీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కొంగల మందు మింగినట్టు రమేష్ చెప్పినట్లు సమాచారం. అంతే గానీ అతను మింగిందేంటనేది పోలీసులకు తెలియదు. అయినా, గ్యాంగ్‌లు నిర్వహించే రమేష్ చనిపోయేందుకు పురుగుల మందు జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల మాటలను పరిశీలిస్తే జరిగిన తప్పును సరిదిద్దుకునే చర్యలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. రమేష్ ఉంటున్న గదిలో దొరికిన ఆధారాలను బట్టి ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టినట్టుగా చెబుతున్న కొద్ది నగలను పోలీసులు మీడియాకు ప్రదర్శించారు. పెద్ద స్థాయిలో గ్యాంగ్‌లను నిర్వహించే వ్యక్తి వద్ద కొద్ది బంగారమే లభించిందని చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కమిషనరేట్ పరిధిలో నేరగాళ్ల పట్టివేత.. సొత్తు స్వాధీనం వంటి వ్యవహారాలను సీసీఎస్ పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. మరి ఈ కేసులో సీసీఎస్‌ను విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. గుడివాడ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మూడు నెలలుగా రమేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సీపీ తెలిపారు. మూడు నెలల కిందట స్నాచింగ్ ముఠాల నేత సమాచారం వస్తే సీసీఎస్ పోలీసులకు కాకుండా పెనమలూరు పోలీసులే చూడటం వెనుక భారీ గోల్మాల్ జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


