‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’ | Rachamallu Siva Prasad Reddy Comments On Saikrishna Case | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’

Jun 25 2026 2:28 PM | Updated on Jun 25 2026 6:25 PM

Rachamallu Siva Prasad Reddy Comments On Saikrishna Case

సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్‌లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్‌ డీల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు

‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement