ఆఫీసర్లు కాగితాలు చూశారు. నిబంధనలు చదివారు. కానీ ఆ కాగితాల వెనుక ఉన్న ఒక తండ్రి కన్నీళ్లను, ఒక బిడ్డ ఆకలిని చూడలేకపోయారు. తన బిడ్డను సాకే ఒక చిన్న ’ఆసరా’ కోసం ఆ తండ్రి అలిసిపోకుండా పోరాడుతున్నాడు. ఈ చిత్రంలో రైతు లక్ష్మిరెడ్డి పులివెందుల మండలం లక్ష్మయ్యవారిపల్లెలో నివసిస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డి కుమారుడికి పుట్టుకతో అంగవైకల్యం. గత ప్రభుత్వంలో పింఛన్ మంజూరు అయినా.. ఈ ప్రభుత్వంలో నాలుగు మార్లు తన కుమారుడిని మోస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఉన్నతాధికారులు మాత్రం రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిపై కనికరం చూపదా అంటూ ఆ తండ్రి పడుతున్న అవస్థలు చూసిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, కడప


