కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–19 మెన్ మల్టీడే జోనల్ మ్యాచ్‌లో మూడవ రోజు సోమవారం టీమ్–ఎ టీమ్–ఇ జట్లు ఘనంగా విజయం సాధించాయి. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సోమవారం 9 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–ఎ జట్టు 72.4 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. ఆ జట్లులోని దేవ్ ప్రమోద్ 79 , నిఖిల్ 64 పరుగులు చేశారు. టీమ్–సి జట్టులోని సాయి విఘ్నేష్ 3, ప్రియతమ్ రాజ్ 3, వికెట్లు తీశారు. దీంతో టీమ్–ఎ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వెఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–ఇ జట్టు 61.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని ఎస్‌ఎంజి ప్రభాకర్ 59, సీహెచ్ సోహన్‌రెడ్డి 74 పరుగులు చేశారు. టీమ్–డి జట్టులోని జయంత్ 3, రణదీప్ 2, పవన్‌సుతశ్రీదత్త 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–డి జట్టు 49.4 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నంద కిషోర్ 68, భాను శ్రీ హర్ష 40 పరుగులు చేశారు. టీమ్–ఇ జట్టులోని లక్ష్మీ గౌతమ్ 3, శ్యామట దినేష్ 3, సాయి చరణ్ 2, గౌతమ్ ఆర్య 2 వికెట్లు తీశారు. దీంతో టీమ్–ఇ జట్టు 207 పరుగుల తేడాతో విజయం సాధించింది.


