అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..! | High Tech Prostitution In Anantapur | Sakshi
Sakshi News home page

అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!

Aug 11 2026 9:33 AM | Updated on Aug 11 2026 9:33 AM

High Tech Prostitution In Anantapur

అనంతపురం సెంట్రల్‌: అనంతలో హైటెక్‌ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్‌ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆదివారం అర్ధర్ధరాత్రి వన్‌టౌన్‌ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్‌ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement