ఎస్‌ఐ ప్రవళ్లిక కేసులో ఒకరిని తొలగిస్తూ కోర్టుకు మెమో సమర్పించిన పోలీసులు
తేజేశ్వరరావుపై మొదట తప్పుడు కేసు నమోదు
ఆయన పంజాబ్ యూనివర్సిటీలో కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలతో నిర్ధారణ
టీడీపీ నేతల మాటల విని తప్పుడు కేసులు, సెక్షన్లు పెట్టి అబాసుపాలైన పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్‌ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే.
వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్‌లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే.
ప్రజల్లో అబాసుపాలు..
టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్‌కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్‌కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్‌లో లొంగిపోతున్నట్లు సమాచారం.
మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు..
అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం.


