breaking news
chintada Ravi Kumar
-
దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్
-
‘కూన రవి వందల నకిలీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారు’
శ్రీకాకుళం: ఏపీలో జరిగిన డీఎస్సీ అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయని ఆముదాలవలస వైఎస్సార్సీపీ సమన్వకర్త చింతాడ రవి విమర్శించారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన అక్రమాలే ఎన్నో ఉన్నాయన్నారు. తమ జిల్లాలోనే కూన రవికుమార్ వందల నకిలీ సర్టిఫికెట్లను అమ్ముకుని కోట్ల రూపాయలను సంపాదించడన్నారు. ఒకవేళ కూన రవి కుమార్ తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలంటే తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాము అడిగే ప్రశ్నలకు కూన రవికుమార్ సమాధానం చెప్పాలని చింతాడ రవి సవాల్ విసిరారు. డీఎస్సీలో ఈ వెన్నుపోటు పార్టీ చేసిన అక్రమాలు తవ్వే కొద్దే బయటకు వస్తూనే ఉన్నాయన్నారు. పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇవ్వడమనేది దేశంలోనే ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని, కానీ ఏపీలో మాత్రం అందుకు అతీతంగా ఉందని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణ అంటే ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు. ఇదీ చదవండి:అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే -
కేసుల వెనుక కుట్ర ఇదే... చింతాడ రవి సంచలన వ్యాఖ్యలు
-
నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు
-
చింతాడ రవికుమార్ కు బెయిల్
-
YSRCP నేత చింతాడ రవికుమార్‌కు బెయిల్
సాక్షి,శ్రీకాకుళం: అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు బెయిల్ లభించింది. సోమవారం ఆమదాల వలస కోర్టు చింతాడ రవికుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. చింతాడ రవికుమార్‌తో పాటు ఇతరలకు కూడా బెయిల్ లభించింది. బెయిల్ మంజూరుతో జైలు నుంచి చింతాడ విడుదలకు మార్గం సుగమమైంది. చింతాడ రవికుమార్‌కు బెయిల్ రావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లొంగిపోయినవారు ఎక్కడ ?
-
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్‌కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్‌కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
-
YSRCP చింతాడ రవికుమార్ అరెస్ట్
-
అర్ధరాత్రి వరకూ పోలీసుల అదుపులో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు
శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్‌లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.కృష్ణ, రమేష్ కుమార్‌లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. -
మహిళా SI వ్యవహారంపై చింతాడ రవికుమార్ క్లారిటీ
-
ఆ మహిళా ఎస్ఐ మా ఆడపడుచు
శ్రీకాకుళం జిల్లా: ఇటీవల జిల్లాలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైందని, దాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సూచనతో బూర్జ మండల ఎస్ఐ ప్రవళ్లికను పావుగా వాడుకొని ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించడం దారుణమని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆయన ఆదివారం ఓ వీడి యో విడుదల చేశారు. పర్యటనలో జరిగింది వేరు, మీడియాలో వచ్చింది వేరు అని ఆయన వివరించారు. ఎస్ఐ ప్రవళ్లిక గురించి కూన రవికుమార్ విలేకరుల సమావేశంలో మా ట్లాడిన మాటలు ఆమెను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెండేళ్లుగా ఎస్ఐ ప్రవళ్లిక తనకు తెలుసని, ఇప్పుడు కేసు పెట్టిన వారిలో చాలా మందికి ఆమె అక్క, చెల్లి వరుస అవుతా రని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో టాపిక్ డైవర్షన్ కోసం ఇంతకు తెగించారని చింతాడ అన్నారు. ఆ రోజు వైఎస్ జగన్ పర్యటనకు రాని వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు తమ విధుల్లో ఉన్నారని వారి పేర్లు పెట్టారని, అలాగే ఢిల్లీలో ఉన్న వ్యక్తి పేరు కేసులో పెట్టారని, ఇవన్నీ మీడియా ముందుకు తీసుకువస్తానన్నారు. కేసులకు భయపడేదే లేదు తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని చింతాడ రవికుమార్ స్పష్టం చేశారు. తాను ఎ టో పారిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను జిల్లాలోనే ఉన్నానని, తనతోపాటు మిగతా 20 మందిపై వేసిన కేసును తొలగిస్తే ఒక గంటలోనే తాను పోలీసుల వద్ద ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. కేసులకు తాము భయపడబోమని, కానీ ఆడపడుచుల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ఆ రోజు ఎస్ఐ ప్రవళ్లిక జనాలను అడ్డుకొని వేరే వైపు వెళ్లాలని సూచిస్తున్న సమయంలో ఒక్కసారిగా జై జగన్ అంటూ నినాదాలు చేస్తుండగా ఆమె చెవులు మూసుకున్నారని, దాన్ని వేరే విధంగా చూప డం తగదన్నారు. నిజా నిజాలు ఆమెకు తెలు సని అన్నారు. మహిళా ఎస్ఐపై ఒత్తిడి తీసుకు వచ్చి మచ్చ లేని ఆమె సర్వీసులో మచ్చ తేటానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ చేస్తున్న కుట్ర ను ఆపాలన్నారు. కూన కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మహిళా ఎస్ఐ గౌరవానికి భంగం పరిచేలా ఎలాంటి ఫొటోలు, కాని ట్రోలింగులు గానీ వైఎస్సార్ సీపీ వర్గీయులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె మన ఇంటి ఆడపడుచు అని, అది ఎప్పు డూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
లేడీ SI ఇష్యూపై చింతాడ రవి క్లారిటీ
-
‘వైఎస్ జగన్ మేనియాను చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది!’
సాక్షి,శ్రీకాకుళం: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆముదాలవలస పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆయనను చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఆముదాలవలస నియోజకవర్గం నుంచే వేలాది మంది జగన్ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమ అపూర్వ విజయాన్ని చూసి కూటమి ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి, మరికొందరు మంత్రులు దీనిపై మీడియాలో లేనిపోని డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులను పోలీసులు భారీ గేట్లు పెట్టి మరీ ఆపారు. ఆ సమయంలో స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తల మధ్యలోకి బూర్జ మండలం ఎస్ఐ ప్రవళిక వచ్చారు. ఆమె నాకు ముందే బాగా పరిచయం. ఇటీవల ఆమె అనారోగ్యంతో కాస్త ఇబ్బంది కూడా పడ్డారు. వేలాది మంది జనం ఒక్కసారిగా ముందుకు వస్తుండటంతో, ప్రమాదం జరగకుండా ఆమెను పక్కకు వెళ్లమని నేను కేవలం రిక్వెస్ట్ చేశాను. ఆ సమయంలో జనం పెద్ద పెట్టున ‘జై జగన్’ అంటూ నినాదాలు చేయడంతో ఆమె చెవులు మూసుకున్నారు. దీంతో మేము ఆమెను చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్లాం." అని రవికుమార్ ఆ ఘటనపై స్పష్టతనిచ్చారు. ఈ విషయాన్ని ఏదో పెద్ద అపరాధంగా, షాకింగ్ ఉదంతంగా చూపిస్తూ నాపై 109, 189, 191, 221, 121, 74, 79, 351, 119 వంటి అనేక కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హత్యానేరం, కుట్రలతో పాటు ఇతర అక్రమ కేసులు పెట్టారు. నేను ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశాను, ఎల్ఎల్బీ (న్యాయశాస్త్రం) కూడా చదివాను. నాలాంటి ఉన్నత విద్యావంతుడికి, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిపై ఇన్ని దారుణమైన కేసులు పెట్టడం శోచనీయం. నాలాంటి సామాన్యుడిపై కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది." అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ కేసులకు నేను ఎంతమాత్రం భయపడను. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడిన వ్యక్తిని నేను. భవిష్యత్తులో ఆయన కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. అసలు ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే ఈ వీడియో విడుదల చేస్తున్నాను’ అని చింతాడ రవికుమార్ స్పష్టం చేశారు.


