అర్ధరాత్రి ఆమదాలవలసలో పోలీసుల అదుపులో ఇద్దరు వైస్సార్సీపీ నేతలు | Chintada Ravi Kumar Case Police Enquiry Amadalavalasa Srikakulam Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఆమదాలవలసలో పోలీసుల అదుపులో ఇద్దరు వైస్సార్సీపీ నేతలు

Aug 8 2026 12:41 AM | Updated on Aug 8 2026 12:55 AM

Chintada Ravi Kumar Case Police Enquiry Amadalavalasa Srikakulam Andhra Pradesh

శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్‌లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్‌లోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.

కృష్ణ, రమేష్ కుమార్‌లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement