పామర్రు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిభిరంపై దాడికి ఉసిగొల్పిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మల్లాది విష్ణు శిబిరంపై దుర్మార్గంగా బోండా ఉమా దాడి చేశారని, మరి కృష్ణలంకలో అవినాష్ టెంట్ జోలికి ఎందుకు వెళ్లలేకపోయావ్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అంత పోటుగాడివైతే అవినాష్ టెంట్ జోలికి వెళ్లాల్సింది అంటూ బోండా ఉమాకు వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని.
ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 7వ తేదీ) డీఎస్సీ అక్రమాలపై కృష్ణా జిల్లాలోని పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని పేర్ని నాని సందర్భించి సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుడూ.. ‘ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిభిరం పై దుర్మార్గంగా దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ గూండాలు దాడి చేశారు. శిభిరం వద్ద ఉన్న బస్ షెల్డర్ పైకెక్కి మూత్రం పోశారు
ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యే బరితెగించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు , లోకేష్‌ను ఏదైనా అంటే ఇంటికొచ్చి కొడతానని బెదిరిస్తున్నారు. మల్లాది విష్ణు అమాయకుడు కాబట్టి టెంట్ మీదకు వెళ్లి దాడి చేశావ్. నువ్వు అంత పోటుగాడివైతే కృష్ణలంకలో అవినాష్ టెంట్ జోలికి ఎందుకు వెళ్లలేకపోయావ్
లోకేష్ దగ్గర బోండా ఉమాకు శీలం పోయింది. బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తే బోండా ఉమాను వాషింగ్ మెషీన్ లో వేసి తండ్రీ కొడుకులు ఉతికినట్లున్నారు. అందుకే ఇప్పుడు తండ్రీ కొడుకుల పై బోండాకు ప్రేమ పుట్టుకొచ్చింది. వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నిరసన చేస్తుంటే గంజాయి , బ్లేడ్ బ్యాచ్‌తో దాడులు చేస్తారా?, మీరు దాడులు చేసినంత మాత్రాన ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేరు. ఈరోజు కూడా మల్లాది విష్ణు టెంట్ వేసి దీక్ష చేస్తున్నాడు ... దమ్ముంటే ఈరోజు వెళ్లు’ అని హెచ్చరించారు.


