‘డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌ మౌనం ఎందుకు?’ | Kurasala Kannababu Slams Chandrababu Naidu Govt, Raises Questions on Lokesh | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌ మౌనం ఎందుకు?’

Aug 7 2026 4:40 PM | Updated on Aug 7 2026 4:51 PM

YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu Sarkar

తాడేపల్లి :  ఏపీలో రాచరిక పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. క్యాబినెట్‌ మీటింగ్‌ కంటే ముందే లోకేష్‌ మంత్రులతో మీటింగ్‌ పెడుతున్నారని, దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఎవరి చేతుల్లో ఉందని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. 

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన కురసాల.. ‘ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే లోకేష్ మంత్రులతో మీటింగ్ పెడుతున్నారు. క్యాబినెట్‌లో చంద్రబాబు అధ్యక్షత వహిస్తే, బయట లోకేష్ అధ్యక్షత వహిస్తున్నారు. 

అసలు క్యాబినెట్ సమావేశాలు ప్రజల కోసమా? వారి వ్యక్తిగత ఎజెండా కోసమా?,  క్యాబినెట్ మీటింగ్‌లకు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లటం లేదు?, చంద్రబాబు మాటలు వెంటుంటే ఆయన ప్రస్టేషన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. జగన్ పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకు ప్రెస్టేషన్ పెరుగుతోంది. జగన్ పర్యటనపై ఎల్లోమీడియా కాకమ్మ కబుర్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. 

మాజీ సీఎం దేవరపల్లి వస్తే ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు?, ఏదైనా తొక్కిసలాట జరిగితే జగన్‌పై బురద జల్లటానికి ప్రయత్నించారు. జెన్ జీని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనటం సరికాదు. చంద్రబాబు ప్రస్టేషన్‌తో ఒక తరాన్నే అవమానిస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపకుండా ఉత్తుత్తి సవాల్ చేయటమెందుకు?, డీఎస్సీ అక్రమాలపై లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు?, చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీ నుండి రోజూ ఫేక్ న్యూస్ వదులుతున్నారు. చంద్రబాబు క్రిమినల్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు

పనికి ఆహారం పథకం కింద వచ్చిన బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్నది టీడీపీ బ్యాచ్. జగన్ మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తే, చంద్రబాబు కార్పొరేట్లకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తారట. ఇది చాలదా.. జగన్, చంద్రబాబు మధ్య తేడా తెలుసుకోవటానికి?, పోలీసు స్టేషనులో చంపి బూడిద కూడా ఇవ్వని పాలన చంద్రబాబుది.  అలాంటి వారు దిశా చట్టాన్ని రద్దు చేయటంలో ఆశ్చర్యం లేదు. 

Gen Z పై చంద్రబాబు సంచలన కామెంట్స్ ఇక మీకు చుక్కలే...

చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యనల్లో జనం చనిపోయారు. గోదావరి పుష్కరాల్లోనూ 29 మందిని చంపేశారు. అలాంటి చంద్రబాబు ప్రతిరోజూ ప్రవచనాలు చెప్పటం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టును చివరికి బ్యారేజీగా మార్చేశారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటన చేసింది. మొత్తం 30 లక్షల ఎకరాలకు నీరు అందాల్సిన పోలవరం చంద్రబాబు వలన  లక్షా 89 వేలకే పరిమితం అయింది. ఇంతటి గొప్ప ప్రాజెక్టును తగ్గించటంపై క్యాబినెట్‌లో ఎందుకు చర్చించలేదు?’ అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement