విజయవాడ వెస్ట్‌లో ఉద్రిక్తత.. బుద్ధా వెంకన్న అనుచరుల హల్‌చల్‌ | Vijayawada West Political Tension: TDP Budda Venkanna Supporters Disrupt YSRCP Deeksha | Sakshi
Sakshi News home page

విజయవాడ వెస్ట్‌లో ఉద్రిక్తత.. బుద్ధా వెంకన్న అనుచరుల హల్‌చల్‌

Aug 7 2026 12:19 PM | Updated on Aug 7 2026 1:03 PM

TDP Budda Venkanna Supporters Over Action At Vijayawada West

సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్దకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనుచరులు చేరుకుని నినాదాలు చేశారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ గొడవలు సృష్ఠించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement