ఘాట్‌రోడ్డులో జారిపడిన కొండ చరియలు | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డులో జారిపడిన కొండ చరియలు

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలోని దుర్గగుడి ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. గురువారం రాత్రి 10 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఘాట్‌రోడ్డులోని మూడో మలుపు వద్ద కొండపై నుంచి ఒక సారిగా మట్టి, చరియలు విరిగి పడ్డాయి. ఐదేళ్ల కిందట కొండకు ఇనుప మెస్‌ ఏర్పాటు చేయగా, విరిగిపడిన కొండ రాళ్లు ఆ మెస్‌ను ధ్వంసం చేసుకుంటూ రోడ్డుపై పడ్డాయి. గత ఐదారు రోజులుగా ఘాట్‌రోడ్డు మరమ్మతుల నేపధ్యంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఘాట్‌రోడ్డుపై ఎటువంటి వాహనాలు, భక్తుల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగి పడిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, ఈవో శీనానాయక్‌, ఈఈ రమాలు శుక్రవారం ఉదయం పరిశీలించారు. కొండ రాళ్లు, మట్టిని వెంనటే తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రక్షణ గోడ, ఐరన్‌ ఫెన్సింగ్‌ రాక్‌–ఫాల్‌నెట్లను మరంత పటిష్టంగా పునరుద్దరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఘాట్‌రోడ్డును క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరిని అనుమతించవద్దని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి అమ్మవారి దర్శనం కల్పించాలని సూచించారు. కాగా ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆలయ ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేటి గిరి ప్రదక్షిణ రద్దు

వర్షాలు, తుఫా ను వాతావరణం నేపధ్యంలో శనివారం జరగాల్సిన గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్న ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 5.55 గంటలకు ప్రారంభం కావాల్సిన గిరి ప్రదక్షిణ తీవ్ర వర్షాలు, వాతావరణం, గిరిప్రదక్షిణ మార్గంలో డ్రైయిన్లు పొంగి కలుషిత నీరు ప్రవహించడంతో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చే అవకాశం లేదని వైదిక కమిటీ తేల్చి చెప్పింది. దీంతో వైదిక కమిటీ సూచన మేరకు గిరిప్రదక్షిణ ను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement