మునిసిపల్‌ ఉద్యోగుల సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌కు జైలు శిక్ష జరిమానా | - | Sakshi
Sakshi News home page

మునిసిపల్‌ ఉద్యోగుల సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌కు జైలు శిక్ష జరిమానా

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

మునిసిపల్‌ ఉద్యోగుల సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌కు జైలు శిక్ష జరిమానా అక్టోబర్‌ 8 నుంచి జాతీయ సరస్‌ అజీవిక మేళా

చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ నాలి నాగభూషణం, డైరెక్టర్‌ రామిరెడ్డి కృష్ణారెడ్డి లకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి.యామిని తీర్పు చెప్పారు. సొసైటీ ద్వారా 2013లో ఖాతాదారుల నుంచి సొసైటీ పాలకవర్గ సభ్యులు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల కాల పరిమితి పూర్తయిన తరువాత తిరిగి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించలేదు. ఈ విషయంపై మచిలీపట్నానికి చెందిన ఎ.శ్రీశైలనాధ్‌, పెనుబోతు సురేంద్రబాబు, పెనుబోతు వెంకట్‌, పెనుబోతు సందీప్‌, పెనుబోతు లక్ష్మీఅన్నపూర్ణలు స్థానిక ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను, ఆధారాలను విచారించిన అనంతరం న్యాయమూర్తి శుక్రవారం పై విధంగా తీర్పు చెప్పారు.

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడలో తొలిసారిగా జాతీయ సరస్‌ అజీవిక మేళా–2026నను నిర్వహిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. పున్నమి ఘాట్‌ వేదికగా వచ్చేనెల 8 నుంచి 22 వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే మార్కెటింగ్‌ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మేళా నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. గతేడాది గుంటూరులో 300 స్టాళ్లతో జరిగిన ఈ మేళాలో సుమారు రూ.30 కోట్ల మేర వ్యాపారం జరిగిందని.. ఈసారి విజయవాడలో 600 స్టాళ్లతో నిర్వహిస్తున్నామన్నారు. మేళాలో హ్యాండ్లూమ్‌, హ్యాండీక్రాఫ్ట్‌, నేచురల్‌ ఫుడ్‌, లైవ్‌ ఫుడ్‌ తదితర విభాగాలతో పాటు నాబార్డ్‌, ఎంఎస్‌ఎంఈ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా స్టాళ్లు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు సరస్‌ మేళా గొప్ప అవకాశంగా నిలుస్తుందన్నారు. ఈ సమీక్షలో కలెక్టర లక్ష్మీశా, పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement