స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర బాబుకు లేదు | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర బాబుకు లేదు

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర బాబుకు లేదు

●ఆయనకు తాపం ఎక్కువ.. తపన తక్కువ

●మాజీ మంత్రి కొడాలి నాని

గుడివాడటౌన్‌: తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒక్కసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర లేదని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. ఆయనకు తాపం ఎక్కువ.. తపన తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక పక్కన ఎన్నికలు జరుగుతాయంటూనే మరో పక్క ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పాచిపోయిన టీవీ చానళ్లలో సూటు, బూటు వేసుకున్న గొట్టంగాళ్లు ఎన్నికల విషయంలో అబద్ద ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తులన్నారు. 2021లో చంద్రబాబు ఎన్నికల్లో గెలిస్తే బూట్లు తుడుస్తానని నేను అన్న మాటలను ఇప్పుడు ఈ దద్దమ్మలు వాడుతున్నారు. రాష్ట్రం కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. తన సత్తా చాటేందుకు గతంలో తాను రాజీనామా చేసి మాతో కూడా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో గెలిచిన మగాడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

జగన్‌ మతం మానవత్వం..

మెడలో శిలువ వేసుకుంటే పదవులొస్తాయని జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లు పాచిపోయిన టీవీ చానళ్లు ప్రచారం చేస్తున్నాయని కొడాలి విమర్శించారు. వారికి ఒక్కటే చెపుతున్నా.. కులం, మతం అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటని, తన మతం మానవత్వం అంటూ అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ పేదలకు తండ్రి స్థానంలో నిలబడి ప్రజలకు ఉన్నత విద్య, వైద్యం అందించిన మహా నాయకులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి కూటమి నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, మచిలీపట్నం, పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు పేర్ని కిట్టు, ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement