శాస్త్రవేత్తల గణేశుడి పండుగ..! నిమజ్జనం ఎలా చేశారంటే.. | Indian scientists make snow Ganesha at Antarcticas research station | Sakshi
Sakshi News home page

snow Ganesha: శాస్త్రవేత్తల గణేశుడి పండుగ..! నిమజ్జనం ఎలా చేశారంటే..

Sep 24 2026 5:08 PM | Updated on Sep 24 2026 5:19 PM

Indian scientists make snow Ganesha at Antarcticas research station

గణేశుడి పండుగను అందరూ ఒకలా చేసుకుంటే..భారతీయ శాస్త్రవేత్తలు వేరేలెవల్‌లో జరుపుకున్నారు. పర్యావరణ హితంగా జరిపినా..అది కూడా ఓ రేంజ్‌లో అత్యద్భుతంగా జరపుకున్నారు. భారత్‌కి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాస్త్రవేత్తల బృందం వినాయక చవితిని ఎంత అద్భుతంగా జరుపుకున్నారంటే.. మాటల్లేవ్‌ అంతే..!. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేయడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

అంటార్కిటికాలోని మైత్రి పరిశోధనా కేంద్రంలో పరిశోధకులు పూర్తిగా మంచుతో కూడిన గణేశుడిని తయారు చేసి పర్యావరణ హితంగా పండుగను జరుపుకున్నారు. ఆ కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న అనిరుధ్‌ ధర్‌ ఆ పండుగకు సంబంధించిన విశేషాలను వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR)కు చెందిన పరిశోధకులు మైత్రి కేంద్రంలో స్వయంగా మంచుతో గణేశుడి విగ్రహాన్ని రూపొందించి ఈ పండుగను జరుపుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు వైద్యుడు అనిరుధ్‌. 

అలాగే ఆ వీడియోలో గణేశుడికి హారతి ఇచ్చి మిఠాయిలు, మోదకాలను సమర్పించడం స్పష్టంగా చూడొచ్చు. తమ మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా..తమకు తెలిసిన ఆచారాలను పాటిస్తూ వినాయకుడి పూజ చేసుకోవడం విశేషం. ఇందులో అన్నింట్లకంటే ప్రధాన ఆకర్షణ వినాయకుని నిమజ్జనం. 

మంచుతో చేసిన విగ్రహాన్ని బయటకు తీసుకువెళ్లడం లేదా బహరంగంగా విసర్జించడం వంటివి కాకుండా ఇంటి లోపలే నీటి బకెట్‌లో జాగ్రత్తగా నిమజ్జనం చేశారు. దాంతో మంచు త్వరగా నీరుగా మారిపోయింది..తద్వారా పండుగ ముగింపు ..ప్రకృతిలో భాగం కావడం అనే పండుగ సదుద్దేశాన్ని తెలిపేలా పర్యావరణ హితంగా  అత్యద్భుతంగా జరుపుకుంది ఆ శాస్త్రవేత్తల బృందం. నెటిజన్లు కూడా ఓరి దేవుడా ఇది మాములు అద్భుతం కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

ఇదీ చదవండి: ఈ అత్తమ్మ నిజంగా బంగారం..! పాపం కోడలి కోసం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement