బీచ్‌లో వింత చేష్టలు.. రీల్స్‌ కోసం ఇదేం పని? | Bangladeshi Content Creator Sparks Outrage Over Beach Video Allegedly Showing Woman Being Deliberately Bumped, Watch Inside | Sakshi
Sakshi News home page

బీచ్‌లో వింత చేష్టలు.. రీల్స్‌ కోసం ఇదేం పని?

Sep 23 2026 11:25 AM | Updated on Sep 23 2026 11:48 AM

Bangladeshi Emran Hossein filming women At Dubai beach for reels

అతి చేస్తే ఇబ్బందే.. అన్న సామెతను గుర్తు చేసేలా ఓ బంగ్లాదేశ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బీచ్‌లో మహిళలను వీడియో తీస్తూ.. చివరకు ఓ విదేశీ మహిళకు కావాలనే దగ్గరగా వెళ్లి ఢీకొట్టినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఓ బీచ్‌లో జరిగినట్టు తెలుస్తోంది.

ఇమ్రాన్‌ హొస్సేన్‌ అనే బంగ్లాదేశ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసినట్లు సమాచారం. వీడియోలో బీచ్‌ నుంచి సముద్రంలోకి వెళ్తూ చుట్టుపక్కల ఉన్న మహిళలను కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత నీటిలో ఉన్న ఓ విదేశీ మహిళకు నెమ్మదిగా దగ్గరై ఆమె కావాలనే తాకాడు.  ఆమెకు చేరువగా వెళ్లి ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనుకోని ఘటనతో ఆ మహిళ ఒక్కసారిగా షాకైంది. అతడి వైపు కోపంగా చూసింది. అనంతరం, ఆమె అసౌకర్యంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇమ్రాన్‌ మాత్రం కెమెరా ఆపకుండా చిత్రీకరణ కొనసాగించాడు. కాగా, మహిళల అనుమతి తీసుకున్నట్లు వీడియోలో ఎక్కడా కనిపించకపోవడం వివాదానికి కారణమైంది.

Video Credit: Monju Alom

‘చేతిలో కెమెరా ఉంది కదా’ అని..
బీచ్‌లో మహిళలను దూరం నుంచి మాత్రమే కాకుండా దగ్గరగా కూడా చిత్రీకరిస్తున్న అతడి ఇతర వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు దుబాయ్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గోప్యతపై కఠిన నిబంధనలు..
యూఏఈలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయి. ఇతరుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం విషయంలో నిబంధనలు ఉన్నాయి. గతంలో అబుదాబిలో ఓ మహిళను అనుమతి లేకుండా ఫొటో తీసిన వ్యక్తికి కోర్టు జరిమానా విధించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వైరల్‌ వీడియోలోని ఘటనపై దుబాయ్‌ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వీడియోపై చర్చ కొనసాగుతోంది.

Video Credit: Ravi Tiwari 

ఇదీ చదవండి: నెతన్యాహు, మమ్దానీ మధ్య మాటల యుద్ధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement