చాలా డబ్బులు నష్టపోతావని చెప్పారు..అయినా నో చెప్పా : ఐశ్వర్య లక్ష్మి | Aishwarya Lekshmi Opens Up Why She Quit Instagram | Sakshi
Sakshi News home page

చాలా డబ్బులు నష్టపోతావని చెప్పారు..అయినా నో చెప్పా : ఐశ్వర్య లక్ష్మి

Sep 22 2026 2:16 PM | Updated on Sep 22 2026 2:23 PM

Aishwarya Lekshmi Opens Up Why She Quit Instagram

ప్రస్తుతం ఈ డిజిటల్‌  యుగంలో సోషల్‌ మీడియా అనేది సినీ తారలకు, అభిమానులకు ఓ ముఖ్యమైన వారధిగా మారింది. తమ సినిమా అప్‌డేట్స్‌తో పాటు పర్సనల్‌ విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. అంతేకాదు దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్‌పెట్టి..లక్షల రూపాయలు సంపాదించే తారలు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్‌  ఐశ్వర్య లక్ష్మి మాత్రం సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది. ఏడాది క్రితం ఆమె సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పింది. ఇప్పటివరకు ఆమె మళ్లీ నెట్టింట్లోకి అడుగుపెట్టలేదు. ఇక ఎప్పటికీ సోషల్‌ మీడియాలోకి రానని చెబుతోంది ఈ టాలెంటెడ్‌ హీరోయిన్‌.  మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్‌ మీడియాను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరించింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌ని వదిలేస్తానని అస్సలు ఊహించలేదు. కొన్నాళ్లు దూరంగా ఉండి..తిరిగి వద్దామనుకున్నా. కానీ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అసత్యప్రచారాలు ఎక్కువైపోయాయి. ఏఐ సాయంతో ఎడిట్‌ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులు చూసి విసిగిపోయా. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తిగా నాకు చాలా స్వేచ్ఛ దొరికినట్లు అనిపిస్తోంది. మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోండి.. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారని నా మేనేజర్లు చెప్పినా.. నేను అంగీకరించలేదు. 

డబ్బు కంటే మానసిక ప్రశాంతత విలువైనదని.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉండగల్గుతున్నానని వారితో చెప్పాను. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రతి కామెంట్‌  చదివేదాన్ని. దాని వల్ల ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందని అనిపించేది. నన్ను ఎవరూ ఇష్టపడరనే భావన మొదలైంది. కామెంట్స్‌ మనకు తెలియకుండానే నెగెటివిటీని సృష్టిస్తాయి.అందుకే నేను సోషల్‌ మిడియాను దూరం పెట్టా. సినిమాల ద్వారనే ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలి’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement