సుమ కొంగుపట్టి అదిపోయే స్టెప్పులేసిన రాఘవ్‌.. ఎవరీ నటుడు? | Raghav Juyal And Suma Dance At The Paradise Movie Pre Release Event Video Goes Viral, Know Interesting Facts About Him | Sakshi
Sakshi News home page

‘ఏష నాగుల..’ పాటకు సుమతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. ఎవరీ నటుడు?

Sep 22 2026 11:32 AM | Updated on Sep 22 2026 11:46 AM

Raghav Juyal, Suma Dance At The Paradise Pre Release Event Video Goes Viral

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న ఆయన.. ఈవెంట్‌లో తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.

సుమ కొంగు పట్టుకుని ‘ఏష నాగుల..’ పాటకు రాఘవ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన డ్యాన్స్ చూసిన నెటిజన్లు ‘అదేం ఎనర్జీ సామీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో విలన్‌గా కనిపించనున్న రాఘవ్‌లోని మరో కోణాన్ని ఈ ఈవెంట్ ప్రేక్షకులకు చూపించింది.

డ్యాన్స్‌తో గుర్తింపు..
రాఘవ్ జుయల్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీ టెలివిజన్, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితుడే. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మంచి డ్యాన్సర్‌గానే కాకుండా యాంకర్, ప్రజెంటర్, నటుడిగానూ తనదైన ముద్ర వేశారు.

2009లో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్‌లో పాల్గొనడం ద్వారా రాఘవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తన ప్రత్యేకమైన డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘క్రాకడైల్’ వంటి పవర్‌ఫుల్ మూవ్స్‌తో పాటు ‘క్రాక్ రోచ్’ తరహా స్లో మోషన్ డ్యాన్స్‌ను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ విభిన్నమైన స్టైల్ కారణంగానే రాఘవ్ జుయల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

విలన్‌గా మరో కోణం..
డ్యాన్స్‌ మాత్రమే కాకుండా నటన, యాంకరింగ్‌లోనూ రాఘవ్ తన ప్రతిభను చాటుకున్నారు. 2014లో వచ్చిన ‘సోనాలి కేబుల్’ సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించారు. 2020లో వచ్చిన ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఆ తర్వాత ‘కిల్’, ‘యుధ్ర’, ‘భాయ్ తేరా స్టార్ మేరా’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న విలన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలోనూ రాఘవ్ జుయల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. డ్యాన్స్‌ షోతో కెరీర్‌ను ప్రారంభించి.. యాంకర్‌గా, నటుడిగా ఎదిగిన రాఘవ్ జుయల్.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement