ఈ స్టార్‌ జంట తీరే వేరు | Nayanthara And Vignesh Shivan Enjoys At Beach | Sakshi
Sakshi News home page

ఈ స్టార్‌ జంట తీరే వేరు

Sep 22 2026 8:06 AM | Updated on Sep 22 2026 8:06 AM

Nayanthara And Vignesh Shivan Enjoys At Beach

తొలి సంధ్య వేళ లో, తొలి పొద్దు పొడుపులో, తెల్లవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం. ఎగిరొచ్చే కెరటం సింధూరం. సూర్యోదయాన్ని ప్రము ఖ గీత రచయిత జాలాది ఎంత అద్భుతంగా వర్ణించారో కదూ ! నిజంగా వేకువ వేళలో సముద్ర తీరాన ప్రకృతి అందాలు మనసు ను పులకరింప చేస్తాయి. తద్వారా ఉత్తేజం ఉరకలేస్తుంది. 

అలాంటి రమణీయ ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రేమికులు మనసు పడతారు. అలాంటి అనుభూతిని నటి నయనతార, విఘ్నేష్‌ శివన్‌ దంపతులు పొందుతుండటం విశేషం. వీళ్లూ ప్రేమికులే కదా ! ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినా, ఈ స్టార్‌ జంట తీరే వేరు. పెళ్లికి ముందు ఆ తరువాత కూడా తనదైన శైలిలో జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇందుకు స్వదేశం, విదేశం అనే తేడా ఉండదు. 

మనసు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లి అందాలను ఆరాధిస్తుంటారు. ఆ దృశ్యాలను తమ సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తుంటారు. ఇదే ఈ జంట ప్రత్యేకకత. అలా ఇటీవల ఈ సంచలన జంట వేకువజామున సాగర తీరానికి వెళ్లి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్నారు. వారి రొమాంటిక్‌ భంగిమలను కెమెరాలో బంధించి తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. మొత్తానికి నటి నయనతార, తన భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ఇలా మరోసారి వార్తల్లో కెక్కారు. 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement