ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు నిర్మాత మైత్రి రవి. ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని ఆయన ప్రకటించారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న రిలీజ్ కావడం లేదని మైత్రి రవి వెల్లడించారు. నాని ది ప్యారడైజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ మూవీ వేరే లెవెల్ అని..బాహుబలి తర్వాత ప్రభాస్‌ను మీరెప్పుడు ఇలా చూడలేదని అన్నారు. అందుకే మరింత ఆలస్యం కానుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#Fauzi Postponed 👍#Prabhas pic.twitter.com/GSgAGudrvb
— Balcony Talks (@BalconyTalks_) September 21, 2026


