ఆస్కార్‌ బరిలో మరో చిన్న సినిమా.. ఇండియాలో రిలీజ్ కాలేదు..! | Angh ready for the Oscars Under new rules for the 2027 Academy Awards | Sakshi
Sakshi News home page

Oscar Awards: ఆస్కార్‌ బరిలో మరో సినిమా.. ఎవరు ఊహించని రాష్ట్రం నుంచి..!

Sep 21 2026 7:34 PM | Updated on Sep 21 2026 7:41 PM

Angh ready for the Oscars Under new rules for the 2027 Academy Awards

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో ఇండియా నుంచి మరో చిత్రం నిలిచింది. ఇటీవల మరాఠీ మూవీ గోంధల్ ఎంపికైనట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మనదేశం నుంచి ఈ మూవీని ఎంపిక చేశారు. అయితే ఈ రేసులో మరో సినిమా ఎంపికైంది. నాగాలాండ్‌లో తెరెకెక్కించిన అంగ్ నేరుగా ఆస్కార్‌కు నామినేషన్స్‌కు ఎంపికైంది. ఇండియా నేరుగా సెలెక్ట్ చేయకపోయినప్పటికీ.. ఆస్కార్ బరిలో నిలిచింది.

అయితే ఈ ఆస్కార్‌ పోటీకి అధికారికంగా పంపే ఎంపిక ప్రక్రియను ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియానే చేపట్టనుంది. ఈ ఏడాది ఫెడరేషన్‌ తుది జాబితాలో నిలిచిన మూడు సినిమాల్లో గోంధల్‌తో పాటు అంగ్ కూడా ఉంది. అయితే ఆ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదని పక్కనపెట్టినట్లు ఫెడరేషన్‌ ఇటీవల వెల్లడించింది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకోవడంతో ఆస్కార్‌ రేసులోకి వచ్చేసింది.  నాగాలాండ్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి చిత్రంగా అంగ్ నిలిచింది.

ఈ సెప్టెంబర్ 20న టోరండో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'ఆంగ్' ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది 12 చిత్రాలు పోటీపడిన ప్లాట్‌ఫామ్ పోటీలో ఉన్న ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని జ్యూరీ ప్రశంసించడంతో పాటు.. దర్శకుడి దార్శనికత, సాహసం, ధైర్యాన్ని అభినందించింది.

ఈ సినిమాకు తేజ రియో ​​దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాగాలాండ్ సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. 1960వ దశకంలో రాష్ట్రంలో జరిగే ఈ కథ ఒక అమెరికన్ మిషనరీ రాకతో వారి సాంప్రదాయ జీవన విధానం ఒత్తిడికి గురవుతున్న ఒక వృద్ధ కోన్యాక్ గ్రామ పెద్ద, అతని కుమారుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రధానంగా కోన్యాక్ భాషలో ఉంటుంది. ఇందులో బాఫ్టా-విజేత, నటుడు డగ్లస్ హెన్‌షాల్‌తో పాటు ఆదివాసీ నాగా వర్గాలకు చెందిన నటులు కూడా నటించారు. ఈ సినిమా కోసంగ్రామాలకు వెళ్లి.. వీధుల్లోనే నటీనటులను ఎంపిక చేయాల్సి వచ్చిందని దర్శకుడు తేజ రియో తెలిపారు. ఈ చిత్రాన్ని 16 ఎంఎం ఫార్మాట్‌లో చిత్రీకరించడం ప్రత్యేకమైన దృశ్య గుర్తింపును మరింత పెంచింది. ఈ చిత్రానికి పనిచేసినందుకు సినిమాటోగ్రాఫర్ ఆడమ్ పీట్‌కివిచ్.. వెరైటీ ఆర్టిసన్ అవార్డు పొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement