breaking news
Toronto International Film Festival
-
ఆస్కార్ బరిలో మరో చిన్న సినిమా.. ఇండియాలో రిలీజ్ కాలేదు..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో ఇండియా నుంచి మరో చిత్రం నిలిచింది. ఇటీవల మరాఠీ మూవీ గోంధల్ ఎంపికైనట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మనదేశం నుంచి ఈ మూవీని ఎంపిక చేశారు. అయితే ఈ రేసులో మరో సినిమా ఎంపికైంది. నాగాలాండ్‌లో తెరెకెక్కించిన అంగ్ నేరుగా ఆస్కార్‌కు నామినేషన్స్‌కు ఎంపికైంది. ఇండియా నేరుగా సెలెక్ట్ చేయకపోయినప్పటికీ.. ఆస్కార్ బరిలో నిలిచింది.అయితే ఈ ఆస్కార్ పోటీకి అధికారికంగా పంపే ఎంపిక ప్రక్రియను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియానే చేపట్టనుంది. ఈ ఏడాది ఫెడరేషన్ తుది జాబితాలో నిలిచిన మూడు సినిమాల్లో గోంధల్తో పాటు అంగ్ కూడా ఉంది. అయితే ఆ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదని పక్కనపెట్టినట్లు ఫెడరేషన్ ఇటీవల వెల్లడించింది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకోవడంతో ఆస్కార్ రేసులోకి వచ్చేసింది. నాగాలాండ్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి చిత్రంగా అంగ్ నిలిచింది.ఈ సెప్టెంబర్ 20న టోరండో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'ఆంగ్' ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది 12 చిత్రాలు పోటీపడిన ప్లాట్‌ఫామ్ పోటీలో ఉన్న ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని జ్యూరీ ప్రశంసించడంతో పాటు.. దర్శకుడి దార్శనికత, సాహసం, ధైర్యాన్ని అభినందించింది.ఈ సినిమాకు తేజ రియో దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాగాలాండ్ సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. 1960వ దశకంలో రాష్ట్రంలో జరిగే ఈ కథ ఒక అమెరికన్ మిషనరీ రాకతో వారి సాంప్రదాయ జీవన విధానం ఒత్తిడికి గురవుతున్న ఒక వృద్ధ కోన్యాక్ గ్రామ పెద్ద, అతని కుమారుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రధానంగా కోన్యాక్ భాషలో ఉంటుంది. ఇందులో బాఫ్టా-విజేత, నటుడు డగ్లస్ హెన్షాల్తో పాటు ఆదివాసీ నాగా వర్గాలకు చెందిన నటులు కూడా నటించారు. ఈ సినిమా కోసంగ్రామాలకు వెళ్లి.. వీధుల్లోనే నటీనటులను ఎంపిక చేయాల్సి వచ్చిందని దర్శకుడు తేజ రియో తెలిపారు. ఈ చిత్రాన్ని 16 ఎంఎం ఫార్మాట్లో చిత్రీకరించడం ప్రత్యేకమైన దృశ్య గుర్తింపును మరింత పెంచింది. ఈ చిత్రానికి పనిచేసినందుకు సినిమాటోగ్రాఫర్ ఆడమ్ పీట్కివిచ్.. వెరైటీ ఆర్టిసన్ అవార్డు పొందారు. -
టోరంటోలో ఉమెన్ టాలెంట్
ఈ నెల పద్నాలుగు వరకు జరగనున్న టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(టిఐఎఫ్ఎఫ్)కు తొలిసారిగా మహిళల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపుతోంది ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియా. దేశవ్యాప్తంగా వచ్చిన రెండు వందలకు పైగా దరఖాస్తుల నుంచి ఈ ఆరుగురు మహిళా దర్శకులను ఎంపిక చేశారు.అర్ష్లే జోస్ – ఏ డాండిలయన్ డ్రీమ్; దీపాభాటియా – రాబిట్ హోల్; కాత్యాయని కుమార్– సన్స్ ఆఫ్ ది రివర్; మధుమిత సుందర్‌రామన్ – ది గెస్ట్ హౌజ్; పరోమిత దార్ –ఉల్టా ; ప్రమిత ఆనంద్ – ఏ లేట్ ఆటమ్ డ్రీమ్.‘ప్రతిభావంతులైన భారతీయ మహిళా దర్శకులను ప్రపంచ సినిమాతో అనుసంధానం చేయడానికి మా ప్రయత్నం తోడ్పడుతుంది’ అని ప్రకటించింది డబ్ల్యూఐఎఫ్.ఒక మహిళ చేసే పోరాటాన్ని కథావస్తువుగా తీసుకొని రూపొందించిన ‘బయాన్’ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ డిస్కవరీ విభాగానికి ఎంపికైంది. ఈ చిత్రంలో హుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రపోషించింది.ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియాను గుణిత్ ముంగ కపూర్ ప్రారంభించారు. భారతీయ సినీ పరిశ్రమలో లింగ సమానత్వం (Gender Equality) కోసం కృషి చేస్తోంది డబ్లూఐఎఫ్.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? -
ఒబామా ఫోటోగ్రాఫర్‌కు అంతర్జాతీయ అవార్డ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పీట్ సౌజాకు ది వే ఐ సీ ఇట్ చిత్రానికి 45 టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. అయితే పీట్ సౌజా గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వ్యక్తిగత, వైట్ హౌస్ ఫోటోగ్రాఫర్‌గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. కాగా పీట్ సౌజా మే 2019 సంవత్సరం హైదరాబాద్ పర్యటనలో అమెరికన్ ఫిల్మ్ మేకర్ డాన్ పోర్టర్ డాక్యుమెంటరీని రూపొందించారు. అయితే గతంలో బ్రాండ్ ఒబామాను మీరు ప్రమోట్ చేశారా అన్న ప్రశ్నకు సౌజా స్పందిసూ ఒబామా పాలనలో రాజకీయ, సామాజిక అంశాలను దృష్య రూపంలో చూపెట్టినట్లు తెలిపాడు. అయితే తాను కేవలం ఫోటోగ్రాఫర్‌ను మాత్రమే కాదని తన కెమెరా పనితనం చారిత్రక అంశాలతో ముడిపడి ఉంటుందని సౌజా పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం వైట్ హౌస్ జర్నలిస్ట్లుల పై ఏ విధంగా స్పందిస్తుందని సౌజాను అడగగా జర్నలిస్టుందరూ నిరాధార వార్తలు రాస్తున్నారంటూ ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ది వే ఐ సీ ఇట్ చిత్రంబపై సౌజా స్పందిస్తు ఇందులో బరాక్ ఒబామా ప్రెసిడెంట్‌గా, వ్యక్తిగా విభిన్న కోణాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయని పీట్ సౌజా పేర్కొన్నాడు. (చదవండి: ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) -
నటి ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు


