
ఫస్ట్ టైమ్
ఈ నెల పద్నాలుగు వరకు జరగనున్న టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(టిఐఎఫ్‌ఎఫ్)కు తొలిసారిగా మహిళల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పంపుతోంది ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియా. దేశవ్యాప్తంగా వచ్చిన రెండు వందలకు పైగా దరఖాస్తుల నుంచి ఈ ఆరుగురు మహిళా దర్శకులను ఎంపిక చేశారు.
అర్ష్‌లే జోస్ – ఏ డాండిలయన్ డ్రీమ్; దీపాభాటియా – రాబిట్ హోల్; కాత్యాయని కుమార్– సన్స్ ఆఫ్ ది రివర్; మధుమిత సుందర్‌రామన్ – ది గెస్ట్ హౌజ్; పరోమిత దార్ –ఉల్టా ; ప్రమిత ఆనంద్ – ఏ లేట్ ఆటమ్ డ్రీమ్.
‘ప్రతిభావంతులైన భారతీయ మహిళా దర్శకులను ప్రపంచ సినిమాతో అనుసంధానం చేయడానికి మా ప్రయత్నం తోడ్పడుతుంది’ అని ప్రకటించింది డబ్ల్యూఐఎఫ్.
ఒక మహిళ చేసే పోరాటాన్ని కథావస్తువుగా తీసుకొని రూపొందించిన ‘బయాన్’ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ డిస్కవరీ విభాగానికి ఎంపికైంది. ఈ చిత్రంలో హుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రపోషించింది.
ఉమెన్ ఇన్ ఫిల్మ్ (డబ్ల్యూఐఎఫ్) ఇండియాను గుణిత్ ముంగ కపూర్ ప్రారంభించారు. భారతీయ సినీ పరిశ్రమలో లింగ సమానత్వం (Gender Equality) కోసం కృషి చేస్తోంది డబ్లూఐఎఫ్.
చదవండి: ఏఐ చాట్‌బాట్‌లకు లింగ వివక్ష ఉంటుందా?