నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు భారీగానే కట్స్ చెప్పారు. దాదాపు 21 సీన్స్ మార్పులు, చేర్పులు సూచించారు. మార్పుల అనంతరం ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 54 నిమిషాల 4 సెకన్లపాటు ఉండనుంది. ఇందులో మితిమీరిన వయొలెన్స్ సీన్స్ ఉండడం వల్లే భారీ కట్స్ చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు.


